సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఖేల్ ఉత్సవ్ నిర్వహించిన సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
పోటీల్లో పాల్గొన్న 200 మందికి పైగా మంత్రిత్వశాఖ అధికారులు, సిబ్బంది
Posted On:
06 SEP 2024 10:52AM by PIB Hyderabad
మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా యువజన వ్యవహరాలు, క్రీడల మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడాదినోత్సవం-2024 వేడుకలను నిర్వహించింది. దీనిలో భాగంగా సమాచార, ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ ఆగస్టు 27 నుంచి 30 వరకు న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియం, జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ‘ఖేల్ ఉత్సవ్ 2024’ నిర్వహించింది.
ఈ తొలి ఎడిషన్ నాలుగు క్రీడాంశాలు - క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ విభాగాల్లో మంత్రిత్వ శాఖ పోటీలు నిర్వహించింది. వీటిలో 200 మందికి పైగా మంత్రిత్వశాఖ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఖేల్ ఉత్సవ్ తర్వాతి ఎడిషన్లలో మరిన్ని క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించేందుకు మంత్రిత్వ శాఖ యోచిస్తోంది.
ఈ నెల 4న శాస్త్రి భవన్లోని పీఐబీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కార్యక్రమంలో విజేదలకు మేజర్ ధ్యాన్ చంద్ ట్రోపీలను బహుకరించారు. బహుమతి ప్రదాన కార్యక్రమంలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
(Release ID: 2052690)
Visitor Counter : 62
Read this release in:
English
,
Khasi
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam