ప్రధాన మంత్రి కార్యాలయం
మెన్స్ క్లబ్ త్రోలో స్వర్ణం సాధించిన ధరంబీర్ కు ప్రధాని శుభాకాంక్షలు
Posted On:
05 SEP 2024 7:59AM by PIB Hyderabad
పారిస్ పారాలింపిక్ క్రీడల్లో పురుషుల క్లబ్ త్రో ఎఫ్ 51 విభాగంలో స్వర్ణం సాధించిన క్రీడాకారుడు ధరంబీర్ కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు అభినందనలు తెలిపారు. ఈ విభాగంలో భారత్ కు ఇదే తొలి బంగారు పతకం.
‘ఎక్స్’లో శ్రీ మోదీ చేసిన పోస్టు:
‘‘పురుషుల క్లబ్ త్రో ఎఫ్ 51 విభాగంలో దేశానికి పారాలింపిక్ క్రీడల్లో తొలి స్వర్ణాన్ని అందించి ధరంబీర్ చరిత్ర సృష్టించారు. తిరుగులేని స్ఫూర్తితో ఈ అపురూపమైన విజయం సాధించారు. ఈ గెలుపుతో దేశం సంతోషంలో మునిగిపోయింది. #Cheer4Bharat’’
(Release ID: 2052091)
Visitor Counter : 39
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam