ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కాంస్య విజేత మరియప్పన్ తంగవేలుకు ప్రధాని అభినందనలు

నాడు పోస్టు చేయడమైనది: 04 SEP 2024 10:31AM by PIB Hyderabad

పారిస్ లో జరుగుతున్నపారాలింపిక్ క్రీడల్లో పురుషుల హైజంప్ టీ63 విభాగంలో కాంస్యం సాధించిన క్రీడాకారుడు మరియప్పన్ తంగవేలును ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు అభినందించారు.

వరుసగా మూడు పారాలింపిక్ క్రీడల్లో నిలకడగా రాణించిన ఆయన నైపుణ్యాలను శ్రీ మోదీ మెచ్చుకున్నారు.

‘ఎక్స్’ లో ప్రధానమంత్రి పోస్ట్:

‘‘పురుషుల హైజంప్ టీ63 విభాగంలో కాంస్యం సాధించిన మరియప్పన్ తంగవేలుకు అభినందనలు.  వరుసగా మూడు పారాలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించడం అభినందనీయం. అతని నైపుణ్యాలు, స్థిరత్వం, సంకల్పం అసాధారణమైనవి #Cheer4Bharat’’

 

 

***

MJPS/RT


(రిలీజ్ ఐడి: 2051716) సందర్శకుల సూచీ సంఖ్య : : 82