ప్రధాన మంత్రి కార్యాలయం
రజత పతకాన్ని గెలుచుకున్న బాడ్మింటన్ క్రీడాకారిణి తులసిమతి మురుగేశన్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు
प्रविष्टि तिथि:
02 SEP 2024 9:16PM by PIB Hyderabad
ప్రస్తుతం జరుగుతున్న పారిస్ పారాలింపిక్స్ లో మహిళల బాడ్మింటన్ ఎస్‌యు5 పోటీలో తులసిమతి మురుగేశన్ వెండి పతకాన్ని గెలిచిన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం ఆమెకు అభినందనలను తెలియ జేశారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఒక సందేశంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘అమిత గర్వకారణమైనటువంటి క్షణం.. పారాలింపిక్స్ 2024 (#Paralympics2024) లో మహిళల బాడ్మింటన్ ఎస్‌యు5 పోటీలో తులసిమతి రజత పతకాన్ని గెలుచుకొన్నారు. ఆమె సాఫల్యం ఎంతో మంది యువజనులకు ప్రేరణను ఇచ్చేదే అవుతుంది. క్రీడలంటే ఆమెకున్న అంకితభావం ప్రశంసనీయం. ఆమెకు ఇవే నా అభినందనలు.
తులసిమతి గారు, చీర్ ఫర్ భారత్ (@Thulasimathi11 #Cheer4Bharat)’’
(रिलीज़ आईडी: 2051242)
आगंतुक पटल : 88
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam