ప్రధాన మంత్రి కార్యాలయం
మహారాష్ట్రలోని జల్‌గావ్‌లో లఖ్పతి దీదీలతో ప్రధాన మంత్రి ముఖాముఖి
Posted On:
26 AUG 2024 1:46PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి: లఖ్పతి దీదీలుగా మారిన వారికి, మారని వారికి మధ్య ఏ విధమైన సంభాషణ జరుగుతుంది?
లఖ్పతి దీదీ: లఖ్పతి దీదీలుగా మారిన వారి అనుభవాలు, జీవన పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. వారు స్వయం సమృద్ధి సాధిస్తారు, దీని వల్ల వారు కుటుంబ ఖర్చులను సమర్థవంతంగా నిర్వహించేలా వీలు కల్పిస్తుంది. సర్, నాకు ఇద్దరు "దివ్యాంగ దీదీలు" (వికలాంగ సోదరీమణులు) కూడా ఉన్నారు, వారికి నేను అండగా ఉన్నాను. వారి పురోగతిని చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను.
ప్రధాన మంత్రి: ఆ 'దివ్యాంగ దీదీలు' కూడా లఖ్పతి దీదీలుగా మారిపోయారా?
లఖ్పతి దీదీ: అవును. వారు లఖ్పతిలుగా మారడానికి నేను కూడా సహాయం చేశాను.
ప్రధాన మంత్రి: వారు ఏ పని చేస్తారు?
లఖ్పతి దీదీ: ఒకరు దోనా పత్తల్ వ్యాపారం (పేపర్ ప్లేట్స్), మరొకరు కిరాణా దుకాణం నడుపుతున్నారు. నేను కూడా లఖ్ పతి సీఆర్పీ (కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్)ని, 3.5 నుంచి 4 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నాను. నా సోదరీమణులు లఖ్పతి సీఆర్పీలుగా మారడానికి కూడా నేను సహాయం చేశాను.
లఖ్పతి దీదీ: నేను ఇప్పటికే లఖ్పతిని, ఇటీవల 260 మంది మహిళలు లఖ్పతిలుగా మారడానికి నేను సహాయం చేశాను.
ప్రధాన మంత్రి: మీరు లఖ్పతి దీదీ అయ్యారు, అంటే మీరు సంవత్సరానికి ఎంత సంపాదిస్తారు?
లక్పతి దీదీ: ఏడాదికి రూ.8 లక్షలు సంపాదిస్తాను.
ప్రధాన మంత్రి: 8 లక్షల రూపాయలా?
లఖ్పతి దీదీ: అవును సార్.
ప్రధాన మంత్రి: మీ ఆదాయానికి ఇది రెట్టింపు! దీన్ని సాధించడానికి మీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది?
లఖ్పతి దీదీ: ఐదేళ్లు పూర్తయ్యాయి సార్.
ప్రధాన మంత్రి: అస్సాం ప్రజలు మిమ్మల్ని గొప్ప ప్రేరణగా చూడాలి.
లఖ్పతి దీదీ: అవును చూస్తారు. జీరో స్థాయి నుంచి హీరో స్థాయికి ఎదిగాను సార్.
ప్రధాన మంత్రి: బాగుంది!
లఖ్పతి దీదీ: నా స్వయం సహాయక బృందం పేరు అతి-ఉత్తమం సఖి మండల్. గృహోపకరణాల నుంచి ఇంట్లో తయారు చేసిన సౌందర్య ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్నాం. సరస్ మేళా, వైబ్రంట్ గుజరాత్, మాన్సూన్ ఫెస్టివల్ వంటి వేదికలు మమ్మల్ని వెలుగులోకి తెచ్చాయి, ఇది మా ఉత్పత్తుల ప్రజాదరణను గణనీయంగా పెంచింది. ఒక్క ఏడాదిలోనే రూ.30 లక్షలకు పైగా టర్నోవర్ (అమ్మకపు మొత్తం)సాధించాం.
ప్రధాన మంత్రి: రూ.30 లక్షలా !
లఖ్పతి దీదీ: మా టర్నోవర్(అమ్మకపు మొత్తం) రూ.30 లక్షలు దాటింది, నికర లాభం రూ.12 లక్షలకు పైగా ఉంది సార్.
లఖ్పతి దీదీ: పది మంది మహిళలు సంయుక్తంగా శానిటరీ న్యాప్కిన్ కంపెనీ నడుపుతున్నారు సార్.
ప్రధాన మంత్రి: లాతూర్ నుంచి మీ గ్రామం ఎంత దూరంలో ఉంది?
లఖ్పతి దీదీ: 20 కిలోమీటర్ల దూరంలో ఉంది సార్.
ప్రధాన మంత్రి: 20 కిలోమీటర్లు. మీరు మొదట ఈ పనిని ప్రారంభించినప్పుడు ఎంత మంది మహిళలు పాల్గొన్నారు?
లఖ్పతి దీదీ: మొదట్లో మేం 10 మంది ఉన్నాం. చేరడానికి ఎవరూ సిద్ధంగా లేరు, శానిటరీ న్యాప్కిన్ల గురించి మాట్లాడటానికి కూడా ప్రజలు సంకోచించారు.
ప్రధాన మంత్రి: మీ ప్రస్తుత టర్నోవర్(అమ్మకపు మొత్తం) ఎంత?
లఖ్పతి దీదీ: టర్నోవర్ (అమ్మకపు మొత్తం) రూ.5 లక్షలు సార్.
ప్రధాన మంత్రి: మీరు హిందీని అంత అనర్గళంగా ఎలా మాట్లాడతారు?
లఖ్పతి దీదీ: ఇతరులతో ఎక్కువగా మాట్లాడటంతో సహజంగానే వస్తుంది సార్.
ప్రధాన మంత్రి: మీరు మీ ఉత్పత్తులను మహారాష్ట్ర వెలుపల విక్రయిస్తారా?
లఖ్పతి దీదీ: లేదు సార్, మేము ప్రస్తుతం మహారాష్ట్రలో మాత్రమే పనిచేస్తున్నాము. మహిళా సాధికారత కార్యక్రమానికి, మాకు లభించిన ఉపాధి అవకాశాలకు చాలా ధన్యవాదాలు సార్. ఇందులో మీరు కీలక పాత్ర పోషించారు. మేము కేవలం మాధ్యమం మాత్రమే; మీరు మొత్తం మార్గాన్ని సుగమం చేశారు. మేం చేయాల్సింది ఆ మార్గంలో నడవడమే.
లఖ్పతి దీదీ: నేను 2017 నుంచి బ్యాంక్ సఖిగా పనిచేస్తున్నాను.
ప్రధాన మంత్రి: ఇప్పుడు మీరు ఎంత సంపాదిస్తున్నారు?
లఖ్పతి దీదీ: నేను ప్రస్తుతం రూ.4.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు సంపాదిస్తున్నాను సార్.
ప్రధాన మంత్రి: మీరు ఈ ప్రాంతానికి చెందినవారా?
లఖ్పతి దీదీ: అవును.
ప్రధాన మంత్రి: అయితే మీరు అందరినీ ఇంటికి తీసుకెళ్లాలి.
లఖ్పతి దీదీ: నేను తీసుకెళ్తాను సార్. మీరు కూడా రావాలి.
ప్రధాన మంత్రి: అవును, కానీ నన్ను ఎవరు ఆహ్వానిస్తారు ? ఎవరూ ఆ పని చేయరు.
లఖ్పతి దీదీ: నేను ప్రావీణ్యత కలిగిన దానిని సార్. బ్యాంకుకు వెళ్లడంలో లేదా ఇంట్లో సమస్యలను పరిష్కరించడంలో తరచుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు, ముఖ్యంగా గ్రామీణ మహిళలకు సహాయం చేయడమే నా పని. వారి ఇళ్లకు వెళ్లి బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు సాయం చేస్తాను.
లఖ్పతి దీదీ: సార్, నిన్నటి ఉదాహరణ చెబుతాను. మా అమ్మాయిని స్కూల్లో అమ్మ ఎక్కడుందని అడిగారు.
ప్రధాన మంత్రి: అవును.
లఖ్పతి దీదీ: సార్, మా అమ్మ మోదీని కలవడానికి మహారాష్ట్ర వెళ్లింది' అని నా బిడ్డ గర్వంగా చెప్పింది. సర్, మీరు ఒకసారి నహన్ ను సందర్శించారు, అప్పుడు నేను మిమ్మల్ని కలవలేకపోయినా, ఈ రోజు ఈ అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది నాకు దక్కిన గొప్ప గౌరవం సార్.
ప్రధాన మంత్రి: నేను గతంలో సిర్మౌర్ ను తరచుగా సందర్శించేవాడిని.
లఖ్పతి దీదీ: 2023లో అంతర్జాతీయ చిరుధాన్యాల దినోత్సవాన్ని జరుపుకున్నాం. చిరుధాన్యాలలో శిక్షణ తీసుకున్నాం సార్. ఆ తర్వాత కలెక్టరేట్ జిల్లా పంచాయతీకి సమీపంలో ఒక భవనాన్ని నిర్మించి, అక్కడ చిరుధాన్యాల కేఫ్ నిర్వహిస్తున్నాం. మాలాంటి 38 మంది మహిళలు అక్కడ పనిచేస్తున్నారు.
ప్రధాన మంత్రి: మీరు ఎంత సంపాదిస్తారు?
లఖ్పతి దీదీ: సార్, అక్కడ నా జీతం రూ.30,000. అంటే, నా మొత్తం వార్షిక ఆదాయం 3 లక్షల 30 వేల రూపాయలు.
లఖ్పతి దీదీ: గుజరాత్లోని ఎన్డీడీలో నేను పశు సఖిగా, ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్నాను. నేను లఖ్పతి దీదీని, నాతో పాటు 88 మంది మహిళలు పనిచేస్తున్నారు.
లఖ్పతి దీదీ: నా గ్రూప్(బృందం) పేరు జై మాతా ది. నేను ఈ బృందంలో పశు సఖిగా పనిచేస్తున్నాను, పత్రి గ్రామంలో, నేను 500 మంది రైతులతో కలిసి పనిచేస్తున్నాను.
ప్రధాన మంత్రి: 500?
లఖ్పతి దీదీ: అవును, 500 మంది రైతులతో.
లఖ్పతి దీదీ: ఎస్ఏజీ దీదీలకు రుణాలు అందించి, వారి పురోగతికి తోడ్పడటమే నా పాత్ర. దీని ద్వారా ఏడాదికి లక్షా 50 వేల రూపాయలు సంపాదిస్తున్నాను.
ప్రధాన మంత్రి: 1.50 లక్షలు?
లఖ్పతి దీదీ: అవును సార్.
ప్రధాన మంత్రి: గొప్ప విషయం.
లఖ్పతి దీదీ: సార్, మేము అమెడియన్లం, మా సమాజంలో స్త్రీలు బయటకు వెళ్ళడానికి అనుమతి లేదు. మా ఇంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. కానీ గ్రూపులో చేరిన తర్వాత నాకు పత్రి అనే గ్రామంలో పశు సఖి ఉద్యోగం వచ్చింది. ఈ రోజు నేను లఖ్పతి దీదీని సార్.
ప్రధాన మంత్రి: మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
లఖ్పతి దీదీ: మేం మేఘాలయకు చెందినవారం
ప్రధాన మంత్రి: మేఘాలయ. నీతో ఎంతమంది అక్కాచెల్లెళ్లు ఉన్నారు?
లఖ్పతి దీదీ: మేం 10 మంది ఉన్నాం.
ప్రధాన మంత్రి: పది.
లఖ్పతి దీదీ: అవును, కానీ మేము ఎస్ హెచ్ జి ఫార్మసీలో చాలా పని చేస్తున్నాము. నేను ఎస్ హెచ్ జి ఫార్మసీలో 3.03 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాను.
లఖ్పతి దీదీ: మేము ఈ ప్రచారంలో భాగం కావడానికి ముందు, మాకు పేరు లేదా గుర్తింపు లేదు. చేరిన తర్వాత మా గౌరవం పెరిగింది. వ్యవసాయ వైద్యులుగా మారి కృషి సఖీలుగా శిక్షణ పొందాం.
లఖ్పతి దీదీ: ఇప్పుడు మమ్మల్ని డాక్టర్ దీదీస్ అని పిలుస్తున్నారు.
ప్రధాన మంత్రి: మీరు ఎన్ని జంతువులను సంరక్షిస్తారు?
లఖ్పతి దీదీ: సార్, మా బ్లాక్ చాలా పెద్దది. మేము 20 మంది అక్కడ పనిచేస్తున్నాము, మేము ఆ ప్రాంతంలో 470 లఖ్పతి దీదీలను తయారు చేసాము.
ప్రధాన మంత్రి: 470?
లఖ్పతి దీదీ: అవును.
ప్రధాన మంత్రి: మీరు అద్భుతమైన పని చేశారు. మీకు చాలా అభినందనలు.
లఖ్పతి దీదీ: సర్, 2021 లో, మీరు 10,000 రైతు ఉత్పత్తి సంస్థలను ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేశారు.. ఆ చొరవలో భాగంగా, మేము ఇచ్ఛావర్లో ఆత్మనిర్భర్ మహిళా ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ను స్థాపించాము. తొలి ఏడాదిలోనే 1,000 మంది రైతు సోదరీమణులను కంపెనీలో చేర్చుకున్నాం.
ప్రధాన మంత్రి: 1,000?
లఖ్పతి దీదీ: అవును సార్.
ప్రధాన మంత్రి: ఏడాదిలో?
లఖ్పతి దీదీ: అవును సార్.
లఖ్పతి దీదీ: నమస్కారం సార్. నా పేరు రబియా బషీర్. నేను జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లా వాసిని. నేను పాడిపరిశ్రమ వ్యాపారం చేస్తున్నాను, నా ప్రస్తుత వార్షిక ఆదాయం రూ .1.20 లక్షలు. నేను కూడా లఖ్ పతినే, 160 మంది సభ్యులు లఖ్ పతిలుగా మారడానికి నేను సహాయం చేశాను.
ప్రధాన మంత్రి: మీరు ఎన్ని జంతువులను సంరక్షిస్తున్నారు ?
లఖ్పతి దీదీ: ప్రస్తుతం 10 జంతువులను సంరక్షిస్తున్నాం.
లఖ్పతి దీదీ: జై జోహార్, సర్. జై చత్తీస్ గఢ్.
ప్రధాన మంత్రి: జై జోహార్.
లఖ్పతి దీదీ: సార్, మాకు ఎఫ్పిఓ (రైతు ఉత్పత్తి సంస్థ) ఉంది. ఈ ప్రాజెక్టును భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు కిసాన్ దీదీలుగా పిలిచే 15,800 మంది సోదరీమణులు మాతో చేరారు. ఒక్కో సోదరి రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు కమీషన్ తీసుకుంటుంది.
ప్రధాన మంత్రి: మీ వెంట ఎంతమంది సోదరీమణులు ఉన్నారు?
లఖ్పతి దీదీ: ప్రస్తుతం మాతో 100 నుంచి 500 మంది మహిళలు ఉన్నారు.
ప్రధాన మంత్రి: సరే.
లఖ్పతి దీదీ: నేను డ్రోన్ దీదీని.
ప్రధాన మంత్రి: కాబట్టి గ్రామంలో అందరూ మిమ్మల్ని డ్రోన్ పైలట్ అని పిలవాలి.
లఖ్పతి దీదీ: అవును, మా జిల్లాలో ముగ్గురు డ్రోన్ పైలట్లు ఉన్నారు, వారిలో నేను ఒకరిని.
లఖ్పతి దీదీ: నేను 2019 నుంచి స్వయం సహాయక బృందంలో సభ్యురాలిగా ఉన్నాను. సర్, మాతో 1,500 మంది మహిళలు ఉన్నారు.
ప్రధాన మంత్రి: 1,500?
లఖ్పతి దీదీ: అవును సార్. నేను మరాఠీ మాట్లాడతాను. నాకు హిందీ ఎక్కువగా రాదు సార్.
ప్రధాన మంత్రి: మీరు మరాఠీలోనే మాట్లాడండి.
లఖ్పతి దీదీ: నా పొలంలో మహువా చెట్లు ఉన్నాయి. నేను మహువాను విక్రయించే వ్యాపారాన్ని నడుపుతున్నాను, నా సమూహంలోని మహిళల నుండి మహువాను కూడా కొనుగోలు చేస్తాను. కేవలం రెండు నెలల్లోనే రూ.2-2.5 లక్షల వరకు సంపాదించాను.
ప్రధాన మంత్రి: రెండు లక్షల రూపాయలా?
లఖ్పతి దీదీ: అవును.
ప్రధాన మంత్రి: మొత్తం ఎంత మంది మహిళలు ఉన్నారు? ఐదు వందలా?
లఖ్పతి దీదీ: 538
లఖ్పతి దీదీ: సార్, నేను మరాఠీలో మాట్లాడుతున్నాను.
ప్రధాన మంత్రి: అవును, ఫర్వాలేదు.
లఖ్పతి దీదీ: నాకు పర్యాటక వ్యాపారం కూడా ఉంది. నేను రెండు టూరిస్ట్ బోట్లను కలిగి ఉన్నాను, పర్యాటకులను రైడ్ లకు తీసుకెళ్తాను. నేను కేరళ వెళ్లి వారి పర్యాటక వ్యాపారాన్ని గమనించాను. ఇక్కడ మహిళలమే ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాం. గత మూడేళ్లుగా సొంతంగా టూరిస్ట్ బోటు నడుపుతున్నాను, దాని ద్వారా ఏటా రూ.1-1.5 లక్షల వరకు సంపాదిస్తున్నాను.
ప్రధాన మంత్రి: గొప్పగా ఉంది!
లఖ్పతి దీదీ: ఈ వ్యాపారాన్ని విస్తరించడానికి అందరం కలిసి పనిచేస్తున్నాం.
లఖ్పతి దీదీ: నేను గోండియా జిల్లా నుంచి, సాలేకా గిరిజన ప్రాంత వాసిని. నేను ఒక గిరిజన మహిళను, నాకు ఇ-రిక్షా ఉంది, దానిని నేను స్వయంగా నడుపుతాను. గ్రామంలో సరుకులు కొనడానికి, అమ్మడానికి కూడా ఉపయోగిస్తాను. నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు లాభం వస్తుంది.
ప్రధాన మంత్రి: మీ అందరి మాటలు విన్న తరువాత, దేశంలో లఖ్ పతి దీదీ ల సంఖ్య గణనీయంగా పెరగబోతోందని నేను భావిస్తున్నాను. ప్రజలు మీ కథలను చదివినప్పుడు లేదా విన్నప్పుడు, వారు ప్రేరణ పొందుతారు. మీరు మీ అనుభవాలను ఇతరులతో పంచుకోవాలి— అది ఎలా ఉంది, మీరు ఎంత స్వావలంబన సాధించారు, మీ మొత్తం కుటుంబానికి మీరు ఎంత తోడ్పాటు ఇవ్వగలరు. అంతేకాక, మీ సాధికారత మీ చుట్టూ ఉన్న వాతావరణంలో గణనీయమైన మార్పులను తెస్తుంది. నా లక్ష్యం ఏంటో తెలుసా? ఇప్పటికే కోటి మంది దీదీలు లఖ్పతి దీదీలుగా మారారు, 3 కోట్ల మంది లఖ్పతి దీదీలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. కాబట్టి, మీరు దీనిని ఇతరులకు వివరించడంలో సహాయపడాలి. మీరు అలా చేస్తారా?
లఖ్పతి దీదీ: అవును సార్.
ప్రధాన మంత్రి: మీరు ఖచ్చితంగా చేస్తారా?
లఖ్పతి దీదీ: అవును.
ప్రధాన మంత్రి: సంతోషం. ధన్యవాదాలు.
***
(Release ID: 2049606)
Visitor Counter : 45
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada