ప్రధాన మంత్రి కార్యాలయం
ఉక్రెయిన్ కు భిష్మ్ క్యూబులను బహూకరించిన ప్రధానమంత్రి
Posted On:
23 AUG 2024 6:33PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉక్రెయిన్ ప్రభుత్వానికి నాలుగు భిష్మ్ (సహయోగ్ హిత, మైత్రికి భారత ఆరోగ్య కార్యక్రమం) క్యూబులను బహూకరించారు. ఈ మానవతాపూర్వకమైన సహాయం అందించినందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ జెలెన్ స్కీ ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. క్షతగాత్రులకు వేగంగా చికిత్స అందించేందుకు తద్వారా విలువైన ప్రాణాలు కాపాడేందుకు ఈ క్యూబులు ఉపయోగపడతాయి.
అన్ని రకాల గాయాలు, వైద్య అవసరాల్లో బాధితులకు ప్రాథమిక చికిత్స అందించేందుకు అవసరమైన మందులు, పరికరాలు ఒక్కో భిష్మ్ క్యూబు లో ఉంటాయి. బేసిక్ ఆపరేషన్ గదిలో సర్జికల్ పరికరాలుంటాయి. రోజుకి 10-15 ప్రాథమిక సర్జరీలు చేయవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో గాయాలు, రక్తస్రావం, కాలిన గాయాలు, ఫ్రాక్చర్లు వంటి విభిన్న స్వభావంతో కూడిన 200 కేసులను హ్యాండిల్ చేయగల సామర్థ్యం ఈ క్యూబునకు ఉంటుంది. ఇవి పరిమిత పరిమాణంలో విద్యుత్, ఆక్సిజెన్ కూడా స్వయంగా ఉత్పత్తి చేసుకోగలుగుతాయి. ఈ క్యూబుల నిర్వహణలో ఉక్రెయిన్ సిబ్బందికి ప్రాథమిక శిక్షణ ఇచ్చేందుకు భారతదేశం తన నిపుణుల బృందాన్ని పంపింది.
(Release ID: 2048537)
Visitor Counter : 138
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam