ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవ శుభాకాంక్షలు: ప్రధాని శ్రీ నరేంద్రమోదీ

प्रविष्टि तिथि: 23 AUG 2024 9:39AM by PIB Hyderabad

మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తున్న అద్భుత విజయాలను సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ప్రశంసించారు

 ‘‘అందరికీ మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవ శుభాకాంక్షలు. అంతరిక్ష రంగంలో మనదేశం సాధిస్తున్న విజయాలను మనం గర్వంగా గుర్తు చేసుకుందాం. అంతరిక్ష శాస్త్రవేత్తలు అందిస్తున్న సేవలను మెచ్చుకోవాల్సిన రోజు ఇది’’ అని ప్రధాని మోదీ అన్నారు.

అంతరిక్ష రంగాన్ని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తూ ‘‘భవిష్యత్తులో ఈ రంగానికి అవసరమైన నిర్ణయాలు మా ప్రభుత్వం తీసుకుంది. రానున్న కాలంలో మరిన్ని నిర్ణయాలు తీసుకుంటుంది’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

 

 

***

MJPS/SR


(रिलीज़ आईडी: 2047972) आगंतुक पटल : 109
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Khasi , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam