ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పోలాండ్ ఉక్రెయిన్‌లలో ప్రధాని పర్యటన

Posted On: 19 AUG 2024 8:38PM by PIB Hyderabad

Posted On: 19 AUG 2024 8:38PM by PIB Delhi

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 ఆగస్టు 21-22 తేదీల్లో పోలాండ్‌, ఉక్రెయిన్ దేశాల్లో పర్యటిస్తారు. కాగా, గత 45 సంవత్సరాల కాలంలో భారత ప్రధానమంత్రి పోలాండ్ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ఆ దేశ రాజధాని వార్సాలో ప్రధానమంత్రికి ఘన స్వాగతం లభించనుండగా, అనంతరం ఆయన దేశాధ్యక్షుడు గౌరవనీయ ఆంద్రె సెబాస్టియన్ డూడాను కలుసుకుంటారు. అటుపైన దేశ ప్రధాని మాననీయ డొనాల్డ్ ట‌స్క్‌తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమాల అనంతరం పోలాండ్‌లోని ప్రవాస భారతీయులతో కూడా శ్రీ మోదీ సంభాషిస్తారు.

   ఆ తర్వాత ప్రధానమంత్రి ఉక్రెయిన్ బయల్దేరుతారు. భారత్-ఉక్రెయిన్ మధ్య 1992లో ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడ్డాక భారత ప్రధానమంత్రి ఆ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి.

   ఈ పర్యటనలో భాగంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ప్రధానమంత్రి పలు అంశాలపై చర్చలు, ఇతర కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. ఈ మేరకు రాజకీయ, వాణిజ్య, ఆర్థిక రంగాలుసహా  పెట్టుబడులు, విద్య, సాంస్కృతిక సంబంధాలు, ప్రజల మధ్య ఆదానప్రదానాలు, మానవతా  సాయం, వగైరా అంశాలతోపాటు ద్వైపాక్షిక సంబంధాలు ఈ కార్యక్రమాల పరిధిలో ఉంటాయి. మరోవైపు అక్కడి విద్యార్థులు సహా భారతీయ సమాజ సభ్యులతోనూ ప్రధాని సంభాషిస్తారు. ఉక్రెయిన్‌లో ప్రధానమంత్రి విశిష్ట పర్యటనతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టం కావడమేగాక విస్తృతం కాగలవని అంచనా.


(Release ID: 2047555) Visitor Counter : 60