ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దేశంలో ‘రామ్‌స‌ర్’ ప్రదేశాల సంఖ్య పెరగడంపై ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హర్షం

Posted On: 14 AUG 2024 9:47PM by PIB Hyderabad

   దేశంలో ‘రామ్‌సర్’ ప్రదేశాల సంఖ్య పెరగడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. ఈ మేరకు మధ్యప్రదేశ్, తమిళనాడులలోని మూడు ప్రదేశాలు ‘రామ్‌సర్’ తీర్మానం కింద ఆ జాబితాలో చేరడంపై రెండు రాష్ట్రాల ప్రజలను ఆయన అభినందించారు.

ఈ అంశంపై ‘ఎక్స్’లో కేంద్ర పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పుల శాఖామంత్రి పోస్టుపై స్పందిస్తూ పంపిన సందేశంలో:

   ‘‘మన ‘రామ్‌సర్’ ప్రదేశాల సంఖ్య ఇంకాస్త పెరగడం దేశానికెంతో సంతోషం కలిగించే అంశం. దేశంలో సుస్థిర ప్రగతికి, ప్రకృతితో సహజీవనానికి మనమిస్తున్న ప్రాధాన్యాన్ని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. ఈ సందర్భంగా తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు నా ప్రత్యేక అభినందనలు. భవిష్యత్తులోనూ ఇలాగే ముందంజలో నిలిచేలా మా కృషిని కొనసాగిస్తాం’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(Release ID: 2046850) Visitor Counter : 79