ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డెబ్భై ఎనిమిదో స్వాతంత్ర్య దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ నేతలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృత‌జ్ఞత‌లు

Posted On: 15 AUG 2024 9:20PM by PIB Hyderabad

భారతదేశం 78 వ స్వాతంత్ర్య దినం సందర్భంగా ప్రపంచ నేతలు వారి శుభాకాంక్షలు వ్యక్తం చేసినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి కృత‌జ్ఞత‌లు తెలిపారు.

 

భూటాన్ ప్రధాని ట్వీట్ కు ప్రధాన మంత్రి జవాబిస్తూ:

‘‘ప్రధాని శ్రీ శెరింగ్ టోబ్ గే, స్వాతంత్ర్య దిన శుభాకాంక్షలకు మీకు ఇవే ధన్యవాదాలు.’’ అని పేర్కొన్నారు.  

నేపాల్ ప్రధాని ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానమిస్తూ:

‘‘ప్రధాని శ్రీ కె.పి. శర్మ ఓలీ, స్వాతంత్ర్య దిన శుభాభినందనలను తెలియజేసినందుకు మీకు ఇవే ధన్యవాదాలు. భారతదేశానికి, నేపాల్ కు మధ్య ఉన్న బలమైన సంబంధాల విషయంలో మీరు వ్యక్తం చేసిన అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు

.

 

మాల్దీవ్స్ అధ్యక్షుని ట్వీట్ కు ప్రధాన మంత్రి స్పందిస్తూ :  

‘‘అధ్యక్షుడు శ్రీ మొహమ్మద్ ముయిజ్జూ, మా దేశ స్వాతంత్ర్య దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినందుకు మీకు ఇవే కృత‌జ్ఞత‌లు. మాల్దీవ్స్ ను ఒక చక్కని మిత్రదేశం గా భారతదేశం భావిస్తోంది. మరి మన ఇరు దేశాలు కూడా మన ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కలిసికట్టుగా కృషి చేస్తూ ఉంటాయి.’’ అని పేర్కొన్నారు.  

 

ఫ్రాన్స్ అధ్యక్షుని ట్వీట్ కు ప్రధాన మంత్రి జవాబిస్తూ:

‘‘మా దేశ స్వాతంత్ర్య దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన నా మంచి మిత్రుడు, అధ్యక్షుడు శ్రీ ఇమేనుయెల్ మేక్రోన్ కు నేను కృత‌జ్ఞత‌లు తెలియజేస్తున్నాను. ఆయన భారతదేశ సందర్శనను మాత్రమే కాకుండా మనం జరిపిన వివిధ సంభాషణలను కూడా నేను ఎంతో ఆప్యాయంగా గుర్తుకు తెచ్చుకొంటున్నాను. ఆ సంభాషణలు భారతదేశం-ఫ్రాన్స్ భాగస్వామ్యానికి మహత్తర శక్తిని జోడించాయి.  ప్రపంచ హితాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కలిసికట్టుగా పనిచేయడాన్ని కొనసాగించుదాం.’’ అని పేర్కొన్నారు.

 

మారిషస్ ప్రధాని ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానమిస్తూ:

‘‘ప్రధాని శ్రీ ప్రవింద్ కుమార్ జుగ్ నాథ్, స్వాతంత్ర్య దిన శుభాకాంక్షలకు గాను మీకు ఇవే ధన్యవాదాలు. మన దేశాల మైత్రి వర్ధిల్లుతూ ఉండాలని, మరిన్ని రంగాలకు విస్తరించాలని అభిలషిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

యుఎఇ ప్రధాని శ్రీ మొహమ్మద్ బిన్ రాశిద్ అల్ మక్ తూమ్ సందేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ప్రత్యుత్తరాన్నిస్తూ:

‘‘శ్రీ మొహమ్మద్ బిన్ రాశిద్ అల్ మక్ తూమ్ (@HHShkMohd), మీరు వ్యక్తం చేసిన శుభాకాంక్షలకు కృతజ్ఞ‌ుడిని. భారతదేశానికి, యుఎఇ కి మధ్య బంధాలను బలపరచడానికి మీరు వ్యక్తిగతంగా చాటుతున్న నిబద్ధత ప్రశంసనీయమైంది. కొన్ని సంవత్సరాలుగా పెంచుకొంటూ వస్తున్న మైత్రీబంధాన్ని మన దేశాలు మరింత పటిష్టపరచుకొంటూనే ఉంటాయి.’’ అని పేర్కొన్నారు.

 

ఇటలీ ప్రధాని జార్జియా మెలొనీ వ్యక్తం చేసిన స్వాతంత్ర్య దిన శుభాకాంక్షలకు శ్రీ నరేంద్ర మోదీ సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఈ కింది విధంగా సమాధానమిచ్చారు:

‘‘ప్రధాని జియార్జియా మెలొని (@GiorgiaMeloni) గారు, మీరు తెలిపిన స్వాతంత్ర్య దిన శుభాకాంక్షలకు నేను కృతజ్ఞ‌ుడినై ఉంటాను. భారతదేశం-ఇటలీ మైత్రి అంతకంతకు వృద్ధి చెందుతూ ఉండాలని, మెరుగైన ధరణిని ఆవిష్కరించే దిశలో ఈ దేశాలు రెండూ వాటి తోడ్పాటును అందించాలని కోరుకుంటున్నాను.’’

 

గుయాన అధ్యక్షుడు డాక్టర్ ఇర్ఫాన్ అలీ భారతదేశం స్వాతంత్ర్య దినం సందర్భంగా తన హృదయపూర్వక శుభాకాంక్షలను తెలిపినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు కృత‌జ్ఞత‌లు తెలిపారు.

డాక్టర్ ఇర్ఫాన్ అలీ కి శ్రీ నరేంద్ర మోదీ సమాధానమిస్తూ సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు:

‘‘అధ్యక్షుడు డాక్టర్ ఇర్ఫాన్ అలీ (@presidentaligy), మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ఇవే కృత‌జ్ఞత‌లు. మన దేశాల ప్రజల మధ్య గల స్నేహాన్ని మరింత బలపరచడానికి మీ తో కలసి పనిచేయాలని ఆశపడుతున్నాను.’’

 

 

***



(Release ID: 2046819) Visitor Counter : 38