ప్రధాన మంత్రి కార్యాలయం
మహారాజా బీర్ బిక్రమ్ కిశోర్ మాణిక్య బహాదుర్ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి
Posted On:
19 AUG 2024 2:02PM by PIB Hyderabad
మహారాజా బీర్ బిక్రమ్ కిశోర్ మాణిక్య బహాదుర్ జయంతి సోమవారం కావడంతో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. త్రిపుర అభివృద్దిలో మహారాజు పోషించిన పాత్ర మరపురానిదని ప్రధాన మంత్రి ప్రశంసించారు. త్రిపుర పురోగతి కి మహారాజు కన్న కలలను నెరవేర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.
“మహారాజా బీర్ బిక్రమ్ కిశోర్ మాణిక్య బహాదుర్ జయంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. త్రిపుర అభివృద్ధిలో ఆయన పోషించిన పాత్ర మరపురానిది. పేదలకు, అణచివేతకు గురైన వారికి సాధికారితను కల్పించడానికి ఆయన జీవితాన్ని అంకితం చేశారు. గిరిజన సముదాయాల అభ్యున్నతి కి ఆయన అమలు చేసిన సంక్షేమ చర్యలు సర్వత్రా ఆదరణ పాత్రమయ్యాయి. త్రిపుర పురోగతి కోసం ఆయన కన్న కలలను సాకారం చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.” అని సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ఒక సందేశంలో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
****
MJPS/SR
(Release ID: 2046689)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam