ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎస్ఎస్ఎల్‌వి-డి3ని విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రోకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు

Posted On: 16 AUG 2024 1:48PM by PIB Hyderabad

కొత్త ఉపగ్రహ ప్రయోగ నౌక- ఎస్.ఎస్.ఎల్.వీ-డీ 3ని విజయవంతంగా ప్రయోగించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఖర్చు పరిమితం కావడం వల్ల ఇది అంతరిక్ష ప్రయోగాల్లో ముఖ్య భూమికను పోషిస్తుందని, ప్రైవేటు రంగానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని అన్నారు.  

‘‘ఎక్స్’’ వేదికగా ప్రధాన మంత్రి తన సందేశాన్ని పోస్టు చేశారు.

 ‘‘ఇదో కీలకమైన మలుపు. ఈ విజయాన్ని సాధించిన శాస్త్రవేత్తలకు, పరిశ్రమకు అభినందనలు. ఇప్పుడు భారతదేశం దగ్గర ఒక కొత్త తరహా ఉపగ్రహ ప్రయోగ వాహక నౌక ఉండడం అమితానందాన్ని అందిస్తోంది.  పరిమిత ఖర్చుతో కూడిన ఎస్ఎస్ఎల్‌వి అంతరిక్ష యాత్రలలో ఒక ముఖ్య పాత్రను పోషించడమే కాకుండా, ప్రైవేటు పరిశ్రమను ప్రోత్సహిస్తుంది.  నేను @isro, @INSPACeIND, @NSIL_India లతోపాటు యావత్తు అంతరిక్ష రంగ పరిశ్రమకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.



(Release ID: 2046494) Visitor Counter : 51