ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ అరబిందో జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి
Posted On:
15 AUG 2024 11:43AM by PIB Hyderabad
పూజనీయుడైన తత్వవేత్త, ఆలోచనపరుడు, ఆధ్యాత్మిక నేత శ్రీ అరబిందో జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.
కలకాలం నిలిచే శ్రీ అరబిందో వారసత్వాన్ని, విస్తృత స్థాయిలో ఆయన ప్రసరింపచేసిన ప్రభావం భారతదేశం జనతలో జాగృతికి తోడ్పడడాన్ని గురించి ప్రధాన మంత్రి తన సందేశం లో ప్రముఖంగా ప్రస్తావించారు.
ప్రధాన మంత్రి తన శ్రద్ధాంజలి సందేశం లో ‘‘శ్రీ అరబిందో జయంతి సందర్భంగా ఆయనకు నా శ్రద్ధాంజలి. అసాధారణ తత్వవేత్తగా, చింతనపరునిగా, ఆధ్యాత్మిక నేతగా ఆయనను మనం స్మరించుకొంటున్నాం. దేశ ప్రజలు చైతన్యవంతులు కావడానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యం రాబోయే తరాల వారికి సైతం ప్రేరణను అందిస్తూనే ఉంటుంది. ఆయన కలలుగన్న భారతదేశాన్ని సాకారం చేయడానికి మనమంతా కట్టుబడి ఉన్నాం’’ అని పేర్కొన్నారు.
***
MJPS/SR
(Release ID: 2045637)
Visitor Counter : 56
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam