ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అరుణాచల్ ప్రదేశ్ చైతన్యభరిత సాంస్కృతిక వారసత్వంలో రాష్ట్ర ప్రజల దేశభక్తి ప్రతిబింబిస్తుంది: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

प्रविष्टि तिथि: 13 AUG 2024 4:35PM by PIB Hyderabad

   ‘‘ఇంటింటా మువ్వన్నెల జెండా (హర్ ఘర్ తిరంగా) అభియాన్‌ను ప్రోత్సహిస్తూ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు కమెంగ్ పరిధిలోగల సెప్పాలో ‘హర్ ఘర్ తిరంగా’ యాత్ర నిర్వహించడంపై ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. దేశంపై అరుణాచల్ ప్రదేశ్ భక్తిభావన ఈ రాష్ట్ర చైతన్య భరిత సాంస్కృతిక వారసత్వంలో స్పష్టంగా ప్రతిబింబిస్తున్నదని ఆయన అన్నారు.

ఈ మేరకు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన వీడియోపై స్పందిస్తూ పంపిన సందేశంలో:

   ‘‘ప్రతి పౌరుడి గుండెలో దేశభక్తి ఉప్పొంగే గడ్డ అరుణాచల్ ప్రదేశ్. ఈ దేశభక్తి భావన రాష్ట్ర చైతన్యభరిత సాంస్కృతిక వారసత్వంలో స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. ‘హర్ ఘర్ తిరంగా’   (#HarGharTiranga) కార్యక్రమంపై ఎనలేని ఉత్సాహం పెల్లుబుకుతుండటం చూస్తుంటే సంతోషం కలుగుతోంది’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 2045039) आगंतुक पटल : 103
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Hindi_MP , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam