ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పశ్చిమ బెంగాల్ పూర్వ ముఖ్యమంత్రి మృతికి ప్రధాన మంత్రి సంతాపం

Posted On: 08 AUG 2024 1:45PM by PIB Hyderabad

పశ్చిమ బెంగాల్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ బుద్ధదేబ్ భట్టాచార్య (Buddhadeb Bhattacharjee) మృతికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

 

శ్రీ నరేంద్ర మోదీ ‘ఎక్స్’ లో:

‘‘పశ్చిమ బెంగాల్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ బుద్ధదేబ్ భట్టాచార్య మరణించారన్న వార్త నాకెంతో దుఃఖాన్ని కలిగించింది.  ఆయన ఒక రాజకీయ దిగ్గజం; రాష్ట్రానికి నిబద్ధతతో సేవలను అందించారు.  ఆయన కుటుంబానికి, ఆయన మద్దతుదారులకు నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను.  ఓం శాంతి.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/RT


(Release ID: 2043117) Visitor Counter : 60