ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ పింగళి వెంకయ్య కు ఆయన జయంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
‘హర్ ఘర్ తిరంగా’ ప్రచార ఉద్యమాన్ని బలపరచాలని పౌరులకు విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
02 AUG 2024 2:02PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీ పింగళి వెంకయ్య కు ఆయన జయంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించడంతో పాటు దేశం కోసం మువ్వన్నెల పతాకాన్ని అందించడంలో శ్రీ పింగళి వెంకయ్య చేసిన కృషిని స్వరించుకొన్నారు. ఈ నెల 9-15 తేదీల మధ్య కాలంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం ద్వారాను, ప్రజలు వారి సెల్ఫీలను harghartiranga.com లో పంచుకోవడం ద్వారాను ‘హర్ ఘర్ తిరంగా’ (ఇంటింటా మువ్వన్నెల జెండా) ప్రచార ఉద్యమాన్ని బలపరచవలసిందిగా కూడా శ్రీ నరేంద్ర మోదీ పౌరులకు విజ్ఞప్తి చేశారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో -
‘‘శ్రీ పింగళి వెంకయ్య గారిని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకొంటున్నాను. మనకు త్రివర్ణ పతాకాన్ని అందించడంలో ఆయన చేసిన కృషిని ఎల్లప్పటికీ స్మరించుకోవడం జరుగుతుంది.
‘హర్ ఘర్ తిరంగా’ ప్రచార ఉద్యమాన్ని బలపరచండి; ఆగస్టు 9 మొదలు 15 మధ్యకాలంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయండి! మీరు తీసుకొన్న సెల్ఫీలను harghartiranga.com లో పంచుకోవడాన్ని మరచిపోకండి’’ అని పేర్కొన్నారు.
***
DS/TS
(रिलीज़ आईडी: 2040770)
आगंतुक पटल : 121
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam