ప్రధాన మంత్రి కార్యాలయం

యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో అసోమ్ కు చెందిన చరాయిదేవ్ లో ఉన్న మొయిదమ్ ను చేర్చినందుకు సంతోషాన్ని, గర్వాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 26 JUL 2024 2:50PM by PIB Hyderabad

అసోమ్ కు చెందిన చరాయిదేవ్ మొయిదమ్ ను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని , గర్వాన్ని వ్యక్తం చేశారు.  ఈ చేర్పు భారతదేశానికి అంతులేని ఆనందాన్ని కలిగించిందని, ఈ పరిణామం భారత్ కు గర్వకారణం అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

చరాయిదేవ్ లో గల మొయిదమ్ లు (సమాధి మట్టిదిబ్బలు) పూర్వికుల పట్ల భక్తి, శ్రద్ధలను చాటే విఖ్యాత అహోమ్ సంస్కృతిని కళ్లకు కడుతున్నాయి అని కూడా శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

  

పైన పేర్కొన్న యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాను గురించి యునెస్కో ‘ఎక్స్’ లో పొందుపరచిన సందేశానికి ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ, ఈ క్రింది విధంగా పేర్కొన్నారు:

‘‘భారతదేశానికి అత్యధిక ఆనందాన్ని, గర్వాన్ని కలిగించేటటువంటి విషయం.

 

చరాయిదేవ్ లోని మొయిదమ్ లు పూర్వికుల పట్ల భక్తి శ్రద్ధలను చాటే విఖ్యాత అహోమ్ సంస్కృతికి అద్దం పడుతున్నాయి.  ఘనమొయిన అహోమ్ పాలన, సంస్కృతిలను గురించి మరింత మంది తెలుసుకొంటారని నేను ఆశిస్తున్నాను.

 

మొయిదమ్ లు #WorldHeritage జాబితాలో చేరినందుకు సంతోషిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

 

 

 

 

 

 

 

***

DS/ST



(Release ID: 2037858) Visitor Counter : 41