ప్రధాన మంత్రి కార్యాలయం
మాజీ ప్రధాని శ్రీ హెచ్.డి.దేవెగౌడతో ప్రధానమంత్రి మాటామంతీ
Posted On:
25 JUL 2024 8:41PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలోని నం.7, లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో మాజీ ప్రధాని శ్రీ హెచ్.డి.దేవెగౌడతో సమావేశమయ్యారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం “ఎక్స్” ద్వారా పంపిన సందేశంలో:
“మాజీ ప్రధాని శ్రీ హెచ్.డి.దేవెగౌడ గారిని నం.7, లోక్ కల్యాణ్ మార్గ్‌లోని నివాసంలో కలుసుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. వివిధ అంశాలపై ఆయనకుగల అవగాహన, విస్తృత పరిజ్ఞానం, దృక్పథం ఎంతో అమూల్యం. ఈ సందర్భంగా ఆయన బహూకరించిన కళాఖండం నా ఇటీవలి కన్యాకుమారి పర్యటనను జ్ఞప్తికి తెచ్చింది. ఇలాంటి అపురూపమైన కానుక ఇచ్చినందుకు దేవెగౌడతోపాటు హెచ్.డి.కుమారస్వామి @H_D_Devegowda @hd_kumaraswamyకి నా కృతజ్ఞతలు తెలియజేశాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 2037382)
Visitor Counter : 46
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam