ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇరవై అయిదో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా జులై 26న కార్గిల్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి


వ్యూహాత్మక షింకున్ లా సొరంగ ప్రాజెక్టు మొదటి పేలుడును ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

ఈ ప్రాజెక్టు లేహ్ కు అన్ని రుతువులలోనూ సంధానాన్ని సమకూర్చనుంది

నిర్మాణ పనులు పూర్తి అయిన తరువాత ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తయిన సొరంగ మార్గం గా పేరు తెచ్చుకోనుంది

Posted On: 25 JUL 2024 10:28AM by PIB Hyderabad

ఇరవై అయిదో కార్గిల్ విజయ్  దివస్ సందర్భంగా రేపు 2024 జులై 26న ఉదయం పూట సుమారు గంటల 20 నిమిషాల వేళలో కార్గిల్ యుద్ధ స్మారకానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేరుకోనున్నారు.  కార్గిల్ యుద్ధం లో ప్రాణాలను ఆహుతి ఇచ్చిన అమర వీరులకు ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి ఘటించనున్నారు.  షింకున్ లా సొరంగ మార్గ ప్రాజెక్టులో భాగంగా తొలి పేలుడు ఘట్టాన్ని ప్రధాన మంత్రి వర్చువల్ మాధ్యమం ద్వారా ఆరంభించనున్నారు.

 

 

లేహ్ కు ప్రతి రుతువులోనూ సంధానాన్ని సమకూర్చడానికి ఉద్దేశించిన శింకున్ లా ప్రాజెక్టు లో 4.1 కిలో మీటర్ ల పొడవైన రెండు మార్గాల సొరంగాన్ని నిర్మించనున్నారు. దీని నిర్మాణం నిమూ - పదుమ్ - దార్చా రహదారిలో సుమారు 15,800 అడుగుల ఎత్తున జరుగనుంది.  శింకున్ లా సొరంగం  ఒకసారి నిర్మాణాన్ని పూర్తి చేసుకుందా అంటే గనక ఇది ప్రపంచంలో  అత్యంత ఎత్తయిన ప్రదేశంలో రూపుదిద్దుకొన్న సొరంగ మార్గంగా పేరు తెచ్చుకోనుంది.  షిన్ కున్ లా సొరంగ మార్గం మన సాయుధ దళాలకు, పరికరాలకు  శీఘ్రగతిన, నిరంతరాయ రాకపోకల సౌకర్యాన్ని అందించడం ఒక్కటే కాకుండా లడఖ్ లో ఆర్థికసామాజిక అభివృద్ధిని కూడా ప్రోత్సహించనుంది.

 

 

***



(Release ID: 2036847) Visitor Counter : 61