కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

प्रविष्टि तिथि: 11 JUN 2024 2:24PM by PIB Hyderabad

కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా డాక్టర్ మన్సుఖ్ మాండవీయ బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 

మంత్రికి శ్రీమతి సుమితా దావ్రా, కార్యదర్శి ఎల్‌అండ్‌ఇతో పాటు మంత్రిత్వ శాఖలోని ఇతర సీనియర్ అధికారులు స్వాగతం పలికారు.

 

గత ప్రభుత్వంలో డాక్టర్ మాండవీయ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా పనిచేశారు.

 

आज श्रम शक्ति भवन में @LabourMinistry का पदभार सँभाला।

हमारे श्रमिक भाइयों-बहनों की नये भारत के निर्माण में भूमिका को सुदृढ़ करने हेतु प्रधानमंत्री @NarendraModi जी की सरकार पूरी ईमानदारी से कार्य करेगी। pic.twitter.com/R3fHOh0AXo

— Dr Mansukh Mandaviya (मोदी का परिवार) (@mansukhmandviya) June 11, 2024

 

గుజరాత్ లోని పోర్ బందర్ నుంచి డాక్టర్ మాండవీయ లోక్ సభకు ఎన్నికయ్యారు. అంతకుముందు 2012 నుంచి 2024 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2002-2007 మధ్య కాలంలో పాలిటానా నుంచి గుజరాత్ శాసనసభ సభ్యుడిగా ఉన్నారు.


(रिलीज़ आईडी: 2036820) आगंतुक पटल : 81
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Hindi_MP , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam