ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రతిష్టాత్మక ఒలింపిక్ ఆర్డర్ ను శ్రీ అభినవ్ బింద్రా కు ప్రకటించిన సందర్భంగా ఆయనకు ప్రధాన మంత్రి అభినందన
प्रविष्टि तिथि:
24 JUL 2024 11:19PM by PIB Hyderabad
ఒలింపిక్ ఆర్డర్ ను ప్రముఖ క్రీడాకారుడు శ్రీ అభినవ్ బింద్రా కు ఇవ్వాలని ఆధికారిక నిర్ణయం వెలువడిన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీ అభినవ్ బింద్రా కు బుధవారం అభినందనలు తెలిపారు.
క్రీడలకు, ఒలింపిక్ ఉద్యమానికి ప్రముఖ తోడ్పాటును అందించినందుకు 2008 ఒలింపిక్ పసిడి పతక విజేత శ్రీ అభినవ్ బింద్రా పై శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసలను కురిపించారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘ఒలింపిక్ ఆర్డర్ ను @Abhinav_Bindra కు ఇవ్వాలన్న ఆధికారిక నిర్ణయాన్ని ప్రకటించడం భారతదేశంలో ప్రతి ఒక్కరిని గర్వపడేటట్లుగా చేసింది. ఆయనకు అభినందనలు. ఒక క్రీడాకారునిగా అయితేనేమి, వర్థమాన క్రీడాకారులకు మార్గదర్శకునిగా అయితేనేమి.. క్రీడలకు, ఒలింపిక్ ఉద్యమానికి గుర్తుంచుకోదగ్గ తోడ్పాటులను ఆయన అందించారు.’’
(रिलीज़ आईडी: 2036731)
आगंतुक पटल : 78
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam