ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగం, విద్యా సంస్థలతో బహుళ ఒప్పందాలు, ఏకాభిప్రాయం సాధన ద్వారా దేశాన్ని ముందుకు నడపించాలని పిలుపునిచ్చిన ఆర్థిక సర్వే 2023-24 ముందుమాట


భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది, స్థిరమైన పురోగతిని కలిగి ఉంది ఉంది: ఆర్థిక సర్వే 2023-24

గత, వర్తమానాల అంశాలను పరిగణిస్తూ భారతీయ ఆర్థిక వ్యవస్థను భవిష్యత్తు వైపు పటిష్టంగా నడిపించే చర్యలను సూచించిన ముందుమాట

Posted On: 22 JUL 2024 3:25PM by PIB Hyderabad

పెరుగుతున్న అనేక ప్రపంచ సవాళ్ల మధ్య భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నమ్మకంతో ముందుకుసాగడం, ప్రైవేట్ రంగం దీర్ఘకాలిక ఆలోచనతో, న్యాయమైన ప్రవర్తనతో పరస్పర నమ్మకాన్ని సాధించడం, అలాగే ప్రజలు వారి ఆర్థిక, శారీరక, మానసిక ఆరోగ్య సంబంధమైన బాధ్యతలను స్వీకరించడం అనే త్రైపాక్షిక ఒప్పంద అవసరం ఉంది అని ఈరోజు పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ సమర్పించిన ఆర్థిక సర్వే 2023-24 పేర్కొన్నది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆధ్వర్యంలో వరుసగా మూడవసారి ఏర్పడిన ప్రభుత్వ చారిత్రక ఆదేశం రాజకీయ, విధానపరమైన నిర్ణయాల కొనసాగింపును సూచిస్తుందని ఆర్థిక సర్వే పేర్కొంది.

కోవిడ్-19 మహమ్మారి నుండి కోలుకున్న తర్వాత, భారత ఆర్థిక వ్యవస్థ బలంగా, స్థిరమైన వృద్ధితో సాగుతుందని, భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడానికి తగినంత పటిష్టంగా ఉందని సర్వే తెలిపింది. అయితే, రికవరీ నిలకడగా ఉండేందుకు, వాణిజ్యం, పెట్టుబడి, వాతావరణం వంటి కీలకమైన ప్రాపంచిక సమస్యలపై ఒప్పందాలను చేరుకోవడం అత్యంత కష్టంగా ఉన్న పరిస్థితులలో దేశీయంగా అధిక కృషి జరగాలని సర్వే అభిప్రాయపడింది.

బలమైన భారత ఆర్థిక వ్యవస్థ

భారత ఆర్థిక వ్యవస్థకు అనేక ప్రోత్సాహకరమైన సంకేతాలు ఉన్నాయని సర్వే పేర్కొంది:

·      2022 ఆర్థిక సంవత్సరంలో 7%గా, 2023 ఆర్థిక సంవత్సరంలో 9.7%గా ఉన్న ఆర్థిక వృద్ధి రేటుతో పోలిస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో అధిక ఆర్థిక వృద్ధి నమోదైంది

  • కొన్ని నిర్దిష్ట ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీప్రధాన ద్రవ్యోల్బణ రేటు చాలా వరకు నియంత్రణలోనే ఉంది
  • 2023 ఆర్థిక సంవత్సరం కంటే 2024 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య లోటు తక్కువగా ఉంది
  • 2024 ఆర్థిక సంవత్సరం కోసం కరెంట్ ఖాతా లోటు జి.డి.పిలో దాదాపు 0.7% ఉండగా, 2024 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో కరెంట్ ఖాతా మిగులును నమోదు చేసింది
  • పుష్కలమైన విదేశీ మారక ద్రవ్య నిల్వలు
  • ప్రైవేట్ రంగం దాని బ్యాలెన్స్ షీట్ బ్లూస్‌ను వదులుకుని 2022 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించినప్పటికీ, ప్రభుత్వ పెట్టుబడి గత కొన్ని సంవత్సరాలలో మూలధన నిర్మాణాన్ని స్థిరంగా కొనసాగించింది.
  • ప్రస్తుత ధరలతో కొలవబడిన ఆర్థికేతర ప్రైవేట్ రంగ మూలధన రాబడి, 2021 ఆర్థిక సంవత్సరంలో క్షీణత తర్వాత 2022 ఆర్థిక సంవత్సరం, 2023 ఆర్థిక సంవత్సరంలో అధికంగా పెరిగినట్లు జాతీయ ఆదాయ డేటా సూచిస్తున్నది.
  • యంత్రాలు మరియు పరికరాలపై పెట్టుబడి 2020 ఆర్థిక సంవత్సరం, 2021 ఆర్థిక సంవత్సరంలో క్షీణించినప్పటికీ తర్వాత బలంగా పుంజుకుంది
  • ప్రైవేట్ రంగంలో మూలధన రాబడి వృధ్ది ఉన్నప్పటికీ వృద్ధి రేటు నిదానంగా ఉంటుందని 2024 ఆర్థిక సంవత్సర ప్రారంభ కార్పొరేట్ సెక్టార్ డేటా సూచిస్తున్నది.

విదేశీ పెట్టుబడిదారుల పెట్టుబడి ఆసక్తి

ఆర్‌.బి.ఐ డేటాను ఉటంకిస్తూ, విదేశీ పెట్టుబడిదారులల పెట్టుబడి ఆసక్తిని డాలర్ ఇన్‌ఫ్లోల పరంగా కొలిచినప్పుడు నూతన మూలధనం 2023 ఆర్థిక సంవత్సరంలో గల 47.6 బిలియన్ డాలర్లతో పోలిస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో 45.8 బిలియన్ డాలర్లే ఉన్నట్లు భారతదేశ చెల్లింపుల నిల్వ మనకు చూపుతున్నప్పటికీ, భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరుగుతూనే ఉన్నట్లు సర్వే పేర్కొన్నది. ఈ స్వల్ప క్షీణత సైతం ప్రపంచ ధోరణులకు అనుగుణంగానే ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో 29.3 బిలియన్ డాలర్లు, అలాగే 2024 ఆర్థిక సంవత్సరంలో 44.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాబట్టినట్లు సర్వే తెలిపింది.

చాలా మంది ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడిదారులు భారతదేశంలో ఉత్సాహంగా సాగుతున్న ఈక్విటీ మార్కెట్‌లను సద్వినియోగం చేసుకుని లాభాలను గడించినట్లు సర్వే పేర్కొన్నది. ఇది పెట్టుబడిదారులకు లాభాలనందించే ఆరోగ్యకరమైన మార్కెట్ వాతావరణానికి సంకేతం, ఇది రాబోయే సంవత్సరాల్లో మరిన్ని కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తుంది.

రాబోయే సంవత్సరాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగడానికి ప్రస్తుత వాతావరణం అంతగా అనుకూలంగా లేదని సర్వే అంచనా వేసింది:

·      అభివృద్ధి చెందిన దేశాలలో వడ్డీ రేట్లు కోవిడ్ కాలంలో, అంతకు ముందు ఉన్నదాని కంటే చాలా ఎక్కువగా ఉండడం

·      దేశీయ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు గణనీయమైన రాయితీలను అందిస్తున్న అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు అనుసరిస్తున్న క్రియాశీల పారిశ్రామిక విధానాలతో, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు పోటీ పడవలసి ఉండడం.

·      బదిలీ ధర, పన్నులు, దిగుమతి సుంకాలు, పన్నేతర విధానాలకు సంబంధించిన అనిశ్చితులు, పునర్నిర్మాణ ప్రక్రియలను పరిష్కరించాల్సి ఉండడం.

·      పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితులు మూలధన రాబడులపై అత్యంత ప్రభావం చూపే అవకాశం ఉండడం.

ఉపాధిపై షాక్స్ ప్రభావం

ఉపాధి కల్పనపై, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేను ఉటంకిస్తూ, గ్రామీణ భారతదేశంలో శ్రామిక శక్తిలోకి వలస కూలీలు తిరిగి రావడం, మహిళల ప్రవేశం ద్వారా వ్యవసాయ ఉపాధిలో నమోదైన పెరుగుదల పాక్షికంగా వివరించబడిందని సర్వే పేర్కొంది.

పరిశ్రమల వార్షిక సర్వేను ఉటంకిస్తూ, 2013-14 మరియు 2021-22 మధ్యకాలంలో మొత్తం కర్మాగారాలలో ఉద్యోగాల సంఖ్య సంవత్సరానికి 3.6% పెరిగిందని, చిన్న కర్మాగారాల (వందలోపు కార్మికులు గలవి) కంటే వంద మందికి పైగా కార్మికులు పనిచేసే కర్మాగారాలలో 4.0% వేగంగా ఉద్యోగాల వృద్ధి జరిగిందని సర్వే పేర్కొంది. ఈ కాలంలో భారతీయ కర్మాగారాల్లో ఉపాధి 1.04 కోట్ల నుంచి 1.36 కోట్లకు పెరిగిందని సర్వే పేర్కొంది.

భారతదేశంలో ‘అన్‌ఇన్‌కార్పొరేటెడ్ వ్యవసాయేతర వ్యాపారరంగ సంస్థల (నిర్మాణం మినహా) ముఖ్య సూచికల 73వ రౌండ్ ఎన్.ఎస్.ఎస్. ఫలితాలతో పోల్చడం ద్వారా 2022-23 కోసం అన్‌ఇన్‌కార్పొరేటెడ్ వ్యాపారరంగ సంస్థల వార్షిక సర్వేను ఉటంకిస్తూ, ఈ రంగంలో మొత్తం మీద ఉపాధి 2015-16 కాలంలో 11.1 కోట్ల నుంచి 10.96 కోట్లకు పడిపోయినట్లు సర్వే తెలిపినది. తయారీ రంగంలో 54 లక్షల మంది కార్మికులు తగ్గినప్పటికీ వాణిజ్య, సేవా రంగాలలో ఉద్యోగాలు పొందిన శ్రామికశక్తి కారణంగా ఈ రెండు కాలాల మధ్య అన్ఇన్‌కార్పొరేటెడ్ వ్యాపారరంగ సంస్థల కార్మికుల సంఖ్యలో మొత్తం క్షీణత దాదాపు 16.45 లక్షలకు పరిమితమైంది. 2021-22 (ఏప్రిల్ 2021 నుండి మార్చి 2022) మరియు 2022-23 (అక్టోబర్ 2022 నుండి సెప్టెంబరు 2023) మధ్య సంభవించిన తయారీరంగ ఉద్యోగాలలో అధిక వృద్ధిని ఈ పోలిక మరుగునపడేస్తుందని, సర్వే వాదించింది.

త్వరితగతిన వరుసగా రెండు పెద్ద ఆర్థిక కుదుపులు - అధిక కార్పొరేట్ రుణభారంతో జత కలిసిన బ్యాంకింగ్‌లోని నిరర్ధక ఆస్తులు (ఎన్.పి.ఎ) అలాగే కోవిడ్-19 మహమ్మారి కారణంగా, 2047 వరకు వికసిత్ భారత్ సాధన దిశగా భారతదేశ ప్రయాణం కోసం ప్రపంచ నేపథ్యం, 1980 నుండి 2015 మధ్య చైనా పురోగమన సమయంలోలాగే ఉన్నట్లు సర్వే అంచనా వేసింది.

ఆధునిక ప్రపంచంలో డీ-గ్లోబలైజేషన్, భౌగోళిక రాజకీయాలు, వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్, కృత్రిమ మేధ (ఏ.ఐ) ఆగమనాల ప్రభావం చిన్న, మధ్యస్థ, ఉన్నత స్థాయిలు సహా అన్ని స్థాయిల కార్మికులపై ఉండడం భారతదేశానికి భారీ అనిశ్చితిని కలిగిస్తుందని సర్వే అంచనా వేసింది. ఇవి రాబోయే సంవత్సరాలు, దశాబ్దాలలో భారతదేశం అధిక వృద్ధి రేటును కొనసాగించుటలో అడ్డంకులను, అవరోధాలను కలిగిస్తాయని పేర్కొన్నది. ఈ సవాళ్లను అధిగమించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగాలతో మహా కూటమి అవసరమని సర్వే సూచించింది.

ఉపాధి కల్పన: ప్రైవేట్ రంగానిదే కీలక పాత్ర

భారతీయుల ఉన్నత, పెరుగుతున్న ఆకాంక్షలకు అనుగుణంగా ఉపాధిని అందించడానికి, 2047 నాటికి వికసిత్ భారత్‌ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రైవేట్ రంగం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య త్రైపాక్షిక ఒప్పందాన్ని సర్వే సమర్థించింది, ఉద్యోగాల కల్పన ప్రధానంగా ప్రైవేట్ రంగంలోనే జరగడం, అలాగే ఆర్థిక వృద్ధి, ఉద్యోగ కల్పన, ఉత్పాదకతపై ప్రభావం చూపే అనేక (అన్ని కాదు) అంశాలు, వాటికోసం తీసుకోవలసిన చర్యలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండడం వల్ల ప్రభుత్వాలు ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని తెలిపింది.

33,000లకు పైగా కంపెనీను శాంపిల్‌గా చేసుకుని జరిపిన సర్వే ఫలితాలను ఉటంకిస్తూ, 2020 ఆర్థిక సంవత్సరం నుండి 2023 ఆర్థిక సంవత్సరం వరకు మూడు సంవత్సరాలలో భారతీయ కార్పొరేట్ రంగం యొక్క పన్నుకు ముందు లాభం దాదాపు నాలుగు రేట్లు పెరిగిందని, అందువల్ల, ఆర్థిక పనితీరు పరంగా, ప్రైవేట్ రంగం చర్యలు దీనికి కారణమని సర్వే పేర్కొంది. 

లాభాలలో సాగుతున్న భారత కార్పొరేట్ రంగం ఉద్యోగాలు కల్పించే బాధ్యతను తీసుకుని, సరైన దృక్పథం, నైపుణ్యాలు గల వ్యక్తులను గుర్తించడానికి స్వీయ ఆసక్తి చూపడం ద్వారా ఇది సాధ్యమవుతుందని సర్వే వాదించింది.

ప్రైవేట్ రంగంప్రభుత్వం, విద్యాసంస్థల మధ్య ఒప్పందం

ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, విద్యాసంస్థల మధ్య మరో త్రైపాక్షిక ఒప్పంద ఆలోచనను కూడా సర్వే అన్వేషిస్తుంది. నైపుణ్యం కోసం మిషన్‌ను సంస్కరించడం, సాంకేతిక పరిణామంతో ముందుకు సాగడానికి భారతీయులను సన్నద్ధం చేయడమే ఈ ఒప్పందం. ఈ మిషన్‌లో విజయం సాధించడానికి గానూ, ఈ బృహత్తర కార్యంలో తమవంతు పాత్రలను పోషించేలా పరిశ్రమలకు, విద్యాసంస్థలకు ప్రభుత్వాలు తగినంత స్వేచ్ఛనివ్వాలి.

కార్పొరేట్ సామాజిక బాధ్యత కీలకం

దీర్ఘకాలిక పెట్టుబడుల సంస్కృతిని పెంపొందించడం, కొనసాగించడం ద్వారా కార్పొరేట్ రంగం ముఖ్య పాత్ర పోషించుటను కూడా సర్వే సమర్థించింది. రెండవది, కార్పొరేట్ లాభాలు పుంజుకున్నట్లే, భారతీయ బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్ అనేక సంవత్సరాల గరిష్ట స్థాయికి పెరిగింది. ఇది మంచి విషయమే. దీనివల్ల లాభదాయకమైన బ్యాంకులు ఎక్కువ రుణాలు ఇస్తాయి.

అనుకూల కాలాన్ని కొనసాగించడానికి, గతంలో ఆర్థిక రంగ తిరోగమనం నుండి పొందిన పాఠాలను మరచిపోకూడదని సర్వే సూచించింది. బ్యాంకింగ్ పరిశ్రమ తప్పనిసరిగా రెండు ఎన్.పి.ఎ సైకిల్స్ మధ్య అంతరాన్ని పొడగించే లక్ష్యం కలిగి ఉండాలి. ఉపాధి, ఆదాయ వృద్ధి ద్వారా ఏర్పడిన అధిక డిమాండ్ నుండి కార్పొరేట్‌లు ప్రయోజనం పొందుతాయని సర్వే పేర్కొంది. పెట్టుబడి ప్రయోజనాల కోసం కుటుంబ పొదుపులను ఉపయోగించడం ద్వారా ఆర్థిక రంగం ప్రయోజనం పొందుతుంది. రాబోయే దశాబ్దాలలో మౌలిక సదుపాయాలు, ఇంధన పరివర్తనలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ అనుసంధానాలు మరింత బలోపేతం అయి సుదీర్ఘ కాలం కొనసాగాలని సర్వే అభిప్రాయపడింది.

భారతదేశంలోని పనిచేసే వయస్సులో గల జనాభాకు ఉపాధి కల్పించాలని, దీని కోసం వారికి నైపుణ్యాలు మరియు మంచి ఆరోగ్యం అవసరం అని సర్వే వ్యాఖ్యానించింది. సోషల్ మీడియా, స్క్రీన్ టైమ్, కదలకుండా కూర్చునే అలవాట్లు, అనారోగ్యకరమైన ఆహారం ప్రజారోగ్యాన్ని, ఉత్పాదకతను బలహీనపరుస్తూ, భారతదేశ ఆర్థిక సామర్థ్యాన్ని తగ్గించగల అంశాలుగా సర్వే పేర్కొన్నది.

శతాబ్దాలుగా భారతదేశ సాంప్రదాయిక జీవనశైలి, ఆహారం, వంటకాలు ప్రకృతి, పర్యావరణంతో కలిసి ఆరోగ్యంగా, సామరస్యంగా జీవించడం ఎలాగో చూపాయని సర్వే వాదించింది. భారతీయ వ్యాపారాలు వాటి గురించి తెలుసుకుని, వాటిని అమలు చేయడం ద్వారా వారు ప్రపంచ మార్కెట్‌పై ఆధారపడడం కన్నా దానికి నాయకత్వం వహించవచ్చనే వాణిజ్య భావాన్ని ఇది సూచించింది.

ఎన్నికైన లేదా నియమితులైన విధానకర్తలు కూడా సవాలును ఎదుర్కోవలసి ఉంటుందని సర్వే వాదిస్తుంది. మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలన్నింటి మధ్య, అలాగే కేంద్ర, రాష్ట్రాల మధ్య చర్చలు, సహకారం, భాగస్వామ్యం, సమన్వయం ఉండాలి. ఈ సవాలును సాధించడం కంటే చెప్పడం తేలికే అలాగే ఇది ఇంతకు ముందు ఎప్పుడూ ఈ స్థాయిలో జరగలేదు, కాలపరిమితి, ప్రపంచ అననుకూల వాతావరణంతో సంబంధం లేకుండా ఈ ప్రయత్నంలో విజయం సాధించడం కోసం ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు, సామాజిక రంగాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించి, దానిని కొనసాగించాల్సిన అవసరం ఉందని సర్వే పిలుపునిచ్చింది.

ఇలా చేస్తే వ్యవసాయమే అబివృద్ధికి చోదక శక్తి అవుతుంది..

ఇప్పటికే ఉన్న, నూతన విధానాలను సంస్కరించడం ద్వారా వ్యవసాయ రంగానికి మెరుగైన సేవలందించే ఒక సందర్భాన్ని సర్వే సూచించింది, అలాంటి ఒక భారతదేశ స్థాయి చర్చ అవసరం కోసం, అవసరంలో ఇది ఒక కీలకమైన అంశమని సర్వే పేర్కొన్నది. వ్యవసాయ రంగ విధానాలను భారత్‌ సంస్కరిస్తే దాని ప్రతిఫలం అపారంగా ఉంటుందని సర్వే పేర్కొంది. సామాజిక-ఆర్థిక ప్రయోజనాలను అందించడమే కాకుండా, దేశాన్ని మంచి భవిష్యత్తు వైపు నడిపించడం కోసం ప్రభుత్వ ఆత్మవిశ్వాసం, సామర్థ్యం పట్ల విశ్వాసాన్ని ఇది పునరుద్ధరిస్తుందని సర్వే ప్రధానంగా ప్రస్తావించింది.

సాంకేతిక పురోగతులు, భౌగోళిక రాజకీయాలు సంప్రదాయిక విజ్ఞానాన్ని సవాలు చేస్తున్నాయి. వాణిజ్య రక్షణవాదం, వనరులు కలిగి ఉండడం, అదనపు సామర్థ్యం, డంపింగ్, దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం అలాగే ఏ.ఐ యొక్క ఆగమనం వంటివి దేశాలు తయారీ, సేవా రంగాల ద్వారా వృద్ధిని రాబట్టే అవకాశాలను తగ్గించాయి.

సాగు పద్ధతులు, విధాన రూపకల్పన పరంగా మూలాలకు తిరిగి వెళ్లాలని సర్వే పిలుపునిచ్చింది, దీని ద్వారా వ్యవసాయం అధిక రాబడిని అందించగలదు, రైతుల ఆదాయాన్ని పెంపొందించగలదు, ఆహార ప్రాసెసింగ్, ఎగుమతుల కోసం అవకాశాలు కల్పించగలదు అలాగే భారతదేశ పట్టణ ప్రాంత యువత కోసం వ్యవసాయ రంగం పట్ల అభిరుచిని, ఉత్పాదకతను రెండింటినీ అందించగలదు. ఈ పరిష్కారం భారతదేశానికి శక్తి వనరుగా మాత్రమే కాకుండా ప్రపంచంలోని మిగతా అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం ఒక నమూనాగా మారగలదు.

విజయవంతమైన శక్తి పరివర్తన అనేది ఒక ఆర్కెస్ట్రా వంటిది

వ్యవసాయ రంగ విధానాలను సరిగ్గా రూపొందించుటలో గల సంక్లిష్టతతో పోలిస్తే శక్తి పరివర్తన, మొబిలిటీ వంటి ఇతర ప్రాధాన్యతలు పేలవంగా ఉండవచ్చు. అయినప్పటికీ, వారు దానితో ఉమ్మడిగా ఒక విషయం కలిగి ఉన్నారు.

శక్తి పరివర్తన, మొబిలిటీ రంగాలలో, అనేక మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలకు చెందిన అనేక అంశాలను సమలేఖనం చేయాల్సిన అవసరం ఉందని సర్వే పేర్కొంది అలాగే ఈ రంగం ఈ కింది అంశాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది:

శత్రు దేశాల వనరులపై ఆధారపడటం;

అడపాదడపా విద్యుత్ ఉత్పత్తి, పునరుత్పాదక ఇంధన వనరులు, బ్యాటరీ నిల్వ ద్వారా ఉత్పాదనలో తలెత్తే హెచ్చుతగ్గుల మధ్య గ్రిడ్ స్థిరత్వాన్ని నిర్వహించడం వంటి సాంకేతిక సవాళ్లు

భూమి కొరత ఉన్న దేశంలో ఒప్పంద విధానంలో భూమిని పంచుకునే అవకాశం కోసం అయ్యే ఖర్చును గుర్తించడం;

పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి రాయితీ ఇవ్వడం, ఇ-మొబిలిటీ పరిష్కారాల కోసం అయ్యే అదనపు ఖర్చులు, ప్రస్తుతం శిలాజ ఇంధనాల అమ్మకం, రవాణా ద్వారా పొందుతున్న పన్ను, రవాణా ఆదాయాన్ని కోల్పోవడం వంటి ఆర్థిక సమస్యలు;

'స్ట్రాండెడ్ అసెట్స్' అని పిలవబడే వాటి ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌లలో క్షీణత

ప్రజా రవాణా నమూనాల వంటి మరెన్నో వంటి ప్రత్యామ్నాయ రవాణా పరిష్కారాల యోగ్యతలను పరిశీలించుట.

సాధ్యమయ్యేవి కాని లేదా వాంఛనీయం కాని ఇతర దేశాల విధానాలను అనుకరించే బదులుగా స్వంత విధానాలు, పద్ధతులను రూపొందించడం మేలని సర్వే వాదించింది.

చిన్న పరిశ్రమలకు స్వేచ్ఛనివ్వడం

చిన్న తరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న అనుమతుల భారాల నుండి వారికి అత్యంత ఉపశమనం కలిగించాల్సి ఉందని సర్వే వాదించింది. వారి ఆర్థిక, సామర్థ్యపరమైన, శక్తిపరమైన విస్తరణ కోసం గల చట్టాలు, నియమ నిబంధనలు ఎదగాలనే వారి సంకల్పాన్ని దోచుకుంటాయి.

స్వేచ్ఛనివ్వడం సుపరిపాలనలో భాగం

ముందున్న సవాళ్ల గురించి ఆలోచిస్తున్నప్పుడు, ప్రజాస్వామ్య భారతదేశ సామాజిక, ఆర్థిక పరివర్తన ఒక అద్భుతమైన విజయగాథ అయినందున ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని సర్వే పేర్కొంది. భారతదేశం చాలా పురోగతిని సాధించింది. 1993 ఆర్థిక సంవత్సరంలో సుమారు 288 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థ 2023 ఆర్థిక సంవత్సరంలో 3.6 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది, అలాగే భారతదేశం ప్రతి డాలర్‌ అప్పు పరంగా పోల్చదగిన ఇతర దేశాల కంటే ఎక్కువ వృద్ధిని సాధించింది.

భారత ప్రభుత్వం అవసరమైన అంశాలపై పట్టు నిలుపుకోవడం కన్నా అవసరమైన అంశాలపై దృష్టి సారించడం కోసం సామర్థ్యాన్ని ఉపయోగిస్తూ తన సమర్థతను పెంపొందించుకోవాలని సర్వే వాదించింది. ప్రభుత్వం యొక్క అన్ని స్థాయిలలో వ్యాపారాల లైసెన్సింగ్, తనిఖీ, అనుమతుల కోసం విధించిన నిబంధనలు భారంగా పరిణమించాయి. అయితే గతంతో పోలిస్తే ఈ భారం తగ్గిందని సర్వే గుర్తించింది. ఇవి ఉండాల్సిన దానికంటే ఇంకా చాలా భారంగానే ఉన్నాయి. ఈ భారాన్ని మోయడానికి తక్కువ సన్నద్ధత గల చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఇది పెనుభారంగా మారింది. సర్వే ఈషోపనిషద్‌ను ఉటంకిస్తూ, అది మనందరినీ మన ఆస్తులను విడిచిపెట్టమని (త్యజించమని), తద్వారా స్వేచ్ఛగా జీవిస్తూ ఆ స్వేచ్ఛను ఆస్వాదించమని ఉపదేశిస్తుందని పేర్కొన్నది:

ఈశా వాస్యమిదం సర్వం యత్కిఞ్చ జగత్యాం జగత్ ।

తేన త్యక్తేన భుంజీతా మా గృధః కస్యస్విద్ధనమ్॥

అధికారం ప్రభుత్వాల విలువైన ఆస్తి. వారు దానిలో కొంత భాగాన్ని విడిచిపెట్టడం ద్వారా, పాలించుట, పాలించబడుట అను రెండింటిలో అది కలిగించే ఆనందాన్ని ఆస్వాదించవచ్చు. 

 

***


(Release ID: 2036147) Visitor Counter : 607