ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ప్రభుత్వం


ప్రామాణిక తగ్గింపు రూ.50,000 నుంచి రూ.75,000కు పెంపు


రూ.17,500 వరకు ఆదా చేసుకోనున్న వేతనజీవులు

Posted On: 23 JUL 2024 1:14PM by PIB Hyderabad

కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న వేతన జీవులు, పెన్షనర్లకు ఉపశమనం కలిగించే అనేక ఆకర్షణీయమైన ప్రయోజనాలను కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో 2024-25 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ప్రకటించారు.

 

ఆదాయపు పన్ను ప్రామాణిక తగ్గింపు రూ.50,000 నుంచి రూ.75,000కు పెంచాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. కొత్త పన్ను విధానంలో ఫించనుదారులకు ఫ్యామిలీ ఫించను తగ్గింపు రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచాలని ప్రతిపాదించారు. దీనితో దాదాపు నాలుగు కోట్ల మంది వేతన జీవులు, ఫించనుదారులకు ఉపశమనం లభించనుంది.

 

కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు ఈ క్రింది విధంగా ఉండాలని ప్రతిపాదించారు. 




ఈ మార్పుల ఫలితంగా, కొత్త పన్ను విధానంలో వేతన ఉద్యోగికి సంవత్సరానికి రూ .17,500 వరకు ఆదాయపు పన్ను ఆదా అవుతుంది.


కొత్త పన్ను విధానంలో పన్ను ఉపశమనాలు, పన్ను స్లాబ్‌లు

 

0-3 లక్షల రూపాయలు

పన్ను లేదు

3-7 లక్షల రూపాయలు

5 శాతం

7-10 లక్షల రూపాయలు

10 శాతం

10-12 లక్షల రూపాయలు

15 శాతం

12-15 లక్షల రూపాయలు

20 శాతం

15 లక్షల రూపాయల అనంతరం

30 శాతం

 

కొత్త పన్ను విధానంలో రూ.17,500ల ఆదాయపు పన్ను ఆదా చేసుకోనున్న వేతన ఉద్యోగులు

4 కోట్ల మంది వేతన ఉద్యోగులు, ఫించనుదారులకు ఆదాయపు పన్ను ఉపశమనం
వేతన ఉద్యోగులకు ప్రామాణిక తగ్గింపు రూ.50,000 నుంచి రూ.75,000లకు పెంపు
ఫించనుదారులకు కుటుంబ ఫించను విషయంలో తగ్గింపు రూ.15,000 నుంచి రూ.20,000లకు పెంపు

 

***


(Release ID: 2036142)