ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర బడ్జెట్ 2024-25 ముఖ్యాంశాలు

Posted On: 23 JUL 2024 1:17PM by PIB Hyderabad

    కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఇవాళ కేంద్ర బడ్జెట్ 2024-25ను పార్లమెంటుకు సమర్పించారు. ఈ బడ్జెట్ ముఖ్యాంశాలు కిందివిధంగా ఉన్నాయి:-

 

పార్ట్-ఎ

బడ్జెట్ అంచనాలు 2024-25:

  • రుణాలు మినహా మొత్తం రాబడి: 32.07 లక్షల కోట్లు.
  • మొత్తం వ్యయం: 48.21 లక్షల కోట్లు.
  • నికర పన్ను రాబడులు: 25.83 లక్షల కోట్లు.
  • ద్రవ్య లోటు: స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)లో 4.9 శాతం.
  • వచ్చే ఏడాదికల్లా ద్రవ్య లోటును 4.5 శాతానికి తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యనిర్దేశం.
  • ద్రవ్యోల్బణం స్వల్ప స్థాయిలో, స్థిరంగా 4 శాతం లక్ష్యం దిశగా సాగుతోంది; కీలక (ఆహారేతర, ఇంధనేతర) ద్రవ్యోల్బణం 3.1 శాతంగా ఉంది.
  • ఈ బడ్జెట్ ప్రధానంగా ఉపాధి, నైపుణ్యం, ‘ఎంఎస్ఎంఇ’లు, మధ్య తరగతిపై దృష్టి సారిస్తుంది.

ఉపాధి-నైపుణ్యం దిశగా ఐదు ప్రధానమంత్రి పథకాల ప్యాకేజీ

  • రాబోయే ఐదేళ్ల కాలంలో దేశంలోని 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి-నైపుణ్యం సహా ఇతరత్రా అవకాశాల కల్పన లక్ష్యంగా 5 ప్రధానమంత్రి పథకాలు, కార్యక్రమాల ప్యాకేజీ:
  1. పథకం ఎ - తొలి ఉద్యోగస్థులు: ‘ఇపిఎఫ్ఒ’లో నమోదు మేరకు తొలి ఉద్యోగంలోగల వారికి 3 వాయిదాలలో ఒక నెల జీతం గరిష్ఠంగా 15,000 వరకు అందుతుంది.
  2. పథకం బి – తయారీ రంగంలో ఉపాధి సృష్టి: ఉద్యోగి-యజమాని రెండు పక్షాలకూ తొలి 4 ఏళ్ల ఉద్యోగ కాలంలో తమతమ వాటా ‘ఇపిఒఫ్ఒ’ చందా ప్రకారం నిర్దేశిత స్థాయిలో ప్రత్యక్ష ప్రోత్సాహకం.
  3. పథకం సి – యాజమాన్యాలకు చేయూత: ప్రతి అదనపు ఉద్యోగిపై యాజమాన్య వాటా ‘ఇపిఒఫ్ఒ’ చందా నిమిత్తం 2 సంవత్సరాలపాటు ప్రభుత్వం నుంచి నెలకు 3,000 దాకా నగదు వాపసు.
  4. నైపుణ్య కల్పన కోసం కొత్త కేంద్ర ప్రాయోజిత పథకం
  • రాబోయే ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు నైపుణ్య కల్పన
  • దేశవ్యాప్తంగా కూడలి-కేంద్రం (హబ్ అండ్ స్పోక్) పద్ధతిలో 1,000 పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటిఐ)ల ఉన్నతీకరణ.
  1. దేశంలోని 500 అగ్రశ్రేణి కంపెనీల్లో శిక్షణార్థి ఉద్యోగ కల్పనకు కొత్త పథకం: దీనికింద రాబోయే ఐదేళ్ల కాలంలో 1 కోటిమంది యువతకు అవకాశం

‘వికసిత భారత్’ లక్ష్య సాధన కోసం బ‌డ్జెట్‌లో 9 ప్రాథమ్యాలు:

  1. వ్యవసాయంలో ఉత్పాదకత - ప్రతిరోధకత
  2. ఉపాధి - నైపుణ్య కల్పన
  3. సమగ్ర మానవ వనరుల అభివృద్ధి - సామాజిక న్యాయం
  4. తయారీ - సేవలు
  5. పట్టణాభివృద్ధి
  6. ఇంధన భద్రత
  7. మౌలిక సదుపాయాల కల్పన
  8. ఆవిష్కరణ.. పరిశోధన-అభివృద్ధి
  9. భవిష్యత్తరం సంస్కరణలు

ప్రాథమ్యం 1: వ్యవసాయంలో ఉత్పాదకత - ప్రతిరోధకత

  • వ్యవసాయం, అనుబంధ రంగాలకు 1.52 లక్షల కోట్లు కేటాయింపు
  • అధిక దిగుబడితోపాటు వాతావరణ ఒడుదొడుకులను తట్టుకోగల 32 రకాల సాధారణ-ఉద్యాన పంటల సాగు దిశగా రైతుల కోసం 109 కొత్త వంగడాల ఆవిష్కరణ.
  • ప్రకృతి వ్యవసాయ పద్ధతి అనుసరించేలా రాబోయే 2 సంవత్సరాల్లో ధ్రువీకరణ-బ్రాండింగ్‌తో దేశవ్యాప్తంగా 1 కోటి మంది రైతులకు ప్రోత్సాహం.
  • ప్రకృతి వ్యవసాయం కోసం దేశవ్యాప్తంగా 10,000దాకా ‘అవసరం ఆధారిత’ జీవ ఉత్పాదక వనరుల కేంద్రాలు ఏర్పాటు
  • రాబోయే మూడేళ్లలో వ్యవసాయ రంగం, రైతుల కోసం మౌలిక డిజిటల్ ప్రజా సదుపాయాలు (డిపిఐ) అమలు.

ప్రాథమ్యం 2: ఉపాధి - నైపుణ్య కల్పన

  • ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా ‘ఉపాధి ఆధారిత ప్రోత్సాహకం’ కోసం 3 పథకాల అమలు; పథకం ఎ: తొలిసారి ఉద్యోగులు; పథకం బి: తయారీ రంగంలో ఉద్యోగ సృష్టి; పథకం సి: యాజమాన్యాలకు చేయూత.
  • కార్మికశక్తిలో మహిళల అధిక భాగస్వామ్యం దిశగా సౌలభ్య కల్పన
  • పారిశ్రామిక రంగ సహకారంతో ఉద్యోగినుల వసతి గృహాలు, క్రెష్‌ల‌ ఏర్పాటు
  • మహిళలకు నైపుణ్య కల్పన కోసం ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ
  • మహిళా స్వయం సహాయ సంస్థల కోసం మార్కెట్ సౌలభ్యం కల్పనకు ప్రోత్సాహం

నైపుణ్యాభివృద్ధి

  • ప్రధానమంత్రి ప్యాకేజీ కింద ఐదేళ్ల కాలంలో 20 లక్షల మంది యువతకు నైపుణ్య కల్పన  కోసం కొత్త కేంద్ర ప్రాయోజిత పథకం.
  • ఆదర్శ నైపుణ్య రుణ పథకం మార్గదర్శకాల సవరణ ద్వారా 7.5 లక్షలదాకా రుణ సహాయం.
  • ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల కింద ఎలాంటి ప్రయోజనం పొందని యువతకు దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం 10 లక్షలదాకా రుణం ద్వారా ఆర్థిక తోడ్పాటు.

ప్రాథమ్యం 3: సమగ్ర మానవ వనరుల అభివృద్ధి - సామాజిక న్యాయం

పూర్వోదయ:

  • అమృత్‌సర్-కోల్‌కతా పారిశ్రామిక కారిడార్ స‌హా గయ వద్ద పారిశ్రామిక మండళ్ల ఏర్పాటు.
  • పిరపైంటిలో 2400 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త విద్యుదుత్పాదన కేంద్రం సహా 21,400 కోట్లతో మరికొన్ని విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం:

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బహుపాక్షిక అభివృద్ధి సంస్థ‌ల ద్వారా 15,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయం.
  • విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ స‌హా కొప్పర్తి వద్ద; హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక  కారిడార్ వెంబ‌డి ఓర్వకల్ వద్ద పారిశ్రామిక మండ‌ళ్ల ఏర్పాటు.

మహిళల నాయకత్వంలో ప్రగతి:

  • మహిళలు, బాలికల ప్రయోజనార్థం వివిధ పథకాల అమలుకు 3 లక్షల కోట్లకుపైగా నిధుల కేటాయింపు

ప్రధానమంత్రి గిరిజన గ్రామీణోద్ధరణ కార్యక్రమం (పిఎంజెయుజిఎ)

  • గిరిజన ప్రాబల్యంగల, ఆకాంక్షాత్మక జిల్లాల్లో గిరిజన కుటుంబాల సామాజిక-ఆర్థిక అభివృద్ధి; మొత్తం 63,000 గ్రామాల్లో 5 కోట్ల గిరిజన కుటుంబాలకు ప్రయోజనం.

ఈశాన్య భారతంలో బ్యాంకు శాఖల ఏర్పాటు

  • ఈశాన్య భారత ప్రాంతంలో మొత్తం 100 ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు శాఖల ఏర్పాటు.

ప్రాథమ్యం 4: తయారీ - సేవల రంగాలు

తయారీ రంగంలోని ‘ఎంఎస్ఎంఇ’ల కోసం రుణహామీ పథకం

  • యంత్రాలు, యంత్ర పరికరాల కొనుగోలు కోసం ‘ఎంఎస్ఎంఇ’లకు పూచీకత్తు లేదా మూడో పక్షం హామీ లేకుండా నిర్దిష్ట వ్యవధిగల రుణహామీ పథకం.

సంక్లిష్ట సమయాల్లో ‘ఎంఎస్ఎంఇ’లకు రుణ చేయూత

  • సంక్లిష్ట సమయాల్లో ‘ఎంఎస్ఎంఇ’లకు బ్యాంకు రుణాల కొనసాగింపు సౌలభ్యం కోసం కొత్త వ్యవస్థ ఏర్పాటు.

ముద్ర రుణాలు

  • ముద్ర రుణాల్లో ‘తరుణ్’ విభాగం కింద మునుపటి వాయిదాలు సకాలంలో చెల్లించిన వారికి తాజా రుణ పరిమితి 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంపు.

‘ట్రెడ్స్’ (TReDS)లో తప్పనిసరి చేరికకు మరింత అవకాశం

  • ‘ట్రెడ్స్’ (TReDS) వేదికలో తప్పనిసరి చేరికకు వీలుగా కొనుగోలుదారుల వార్షిక టర్నోవర్ పరిమితి 500 కోట్ల నుంచి 250 కోట్లకు తగ్గింపు.

ఆహారంలో రేడియో ధార్మికత తొలగింపు, నాణ్యత-భద్రత పరీక్ష ‘ఎంఎస్ఎంఇ’ యూనిట్లు

  • దేశ‌వ్యాప్తంగా వివిధ ఆహార ఉత్ప‌త్తుల‌లో రేడియో ధార్మికత తొలగింపు ల‌క్ష్యంగా 50 బ‌హుళ ఉత్ప‌త్తి ‘ఎంఎస్ఎంఇ’ యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం.

ఇ-కామర్స్ ఎగుమతి కూడళ్లు

  • ‘ఎంఎస్ఎంఇ’లు, సంప్రదాయ కళాకారులు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ విప‌ణిలో  విక్రయించుకునే సౌల‌భ్యం కల్పిస్తూ ప్ర‌భుత్వ-ప్రైవేట్ భాగ‌స్వామ్యం (పిపిపి)తో ఇ-కామర్స్ ఎగుమతి కూడ‌ళ్ల ఏర్పాటు.

కీలక ఖనిజా వ్యవస్థ

  • కీలక ఖనిజాల దేశీయ ఉత్పత్తి, రీసైక్లింగ్ సహా విదేశాల్లో కీలక ఖనిజ ఆస్తుల సమీకరణ లక్ష్యంగా కీలక ఖనిజాల వ్యవస్థ ఏర్పాటు.

తీరప్రాంతంలో ఖనిజాల తవ్వకం

  • తీరప్రాంతంలో ఖనిజ క్షేత్రాల అన్వేషణ, ప్రస్తుత గనుల తవ్వకం సంబంధిత తొలివిడత వేలం ఇప్పటికే పూర్తి

మౌలిక డిజిటల్ ప్రజా సదుపాయాల (డిపిఐ) అనువర్తనాలు

  • రుణాలు, ఇ-కామర్స్, విద్య, ఆరోగ్యం, చట్టం-న్యాయం, రవాణా, ‘ఎంఎస్ఎంఇ’, సేవల ప్రదానం సహా పట్టణ పాలన రంగాల కోసం ‘డిపిఐ’ అనువర్తనాల రూపకల్పన.

ప్రాథమ్యం 5: పట్టణాభివృద్ధి

రవాణా ఆధారిత ప్రగతి

  • దేశంలో 30 లక్షలకు మించి జనాభాగల 14 పెద్ద నగరాలకు రవాణా ఆధారిత అభివృద్ధి ప్రణాళికలు- వ్యూహాల రూపకల్పన-అమలు, ఆర్థిక సహాయం.

పట్టణ గృహనిర్మాణం

  • రాబోయే ఐదేళ్ల‌లో 1 కోటి పట్టణ పేద, మధ్య తరగతి కుటుంబాల గృహావస‌రాలు తీర్చేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన-ప‌ట్ట‌ణ 2.0 కింద కేంద్ర సాయంగా 2.2 ల‌క్ష‌ల కోట్లు స‌హా 10 లక్షల కోట్ల పెట్టుబడికి ప్ర‌తిపాద‌న‌.

వీధి మార్కెట్లు

  • రాబోయే ఐదేళ్లపాటు దేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో ఏటా 100 వారాంతపు ‘హాత్’ లేదా వీధి ఆహార కూడళ్ల ఏర్పాటుకు మద్దతుగా కొత్త పథకం.

ప్రాథమ్యం 6: ఇంధన భద్రత

ఇంధన పరివర్తన

  • ఉపాధి, వృద్ధి, పర్యావరణ సుస్థిరతల ఆవశ్యకత సమతౌల్యం లక్ష్యంగా ‘ఇంధన పరివర్తన పరిష్కారాల’పై విధాన పత్రం రూపకల్పన.

ఉత్పాదకత నిల్వ విధానం

  • విద్యుత్ నిల్వ కోసం ఉత్పాదకత నిల్వ ప్రాజెక్టుల ఏర్పాటుపై విధాన పత్రం రూపకల్పన.

చిన్న.. మాడ్యులర్ అణు రియాక్టర్ల పరిశోధన-అభివృద్ధి

  • ‘భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్’ పరిశోధన-అభివృద్ధి సహా అణు విద్యుత్తు, భారత చిన్న రియాక్టర్ల సాంకేతికతల కోసం ప్రైవేట్ రంగంతో ప్రభుత్వ భాగస్వామ్యం.

అత్యాధునిక అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ ప్లాంట్లు

  • అత్యాధునిక అల్ట్రా సూపర్ క్రిటికల్ (ఎయుఎస్‌సి) సాంకేతిక పరిజ్ఞానంతో 800 మెగావాట్ల  పూర్తిస్థాయి వాణిజ్య విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు దిశగా ‘ఎన్‌టిపిసి-బిహెచ్ఇఎల్‌’ సంయుక్త సంస్థ ఏర్పాటుకు ప్రతిపాదన.

‘రద్దు శక్యంకాని’ పరిశ్రమల కోసం మార్గ ప్రణాళిక

  • ‘రద్దు శక్యంకాని’ పరిశ్రమలను ప్రస్తుత ‘పెర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్’ విధానం నుంచి ‘ఇండియన్ కార్బన్ మార్కెట్’ విధానంలోకి మార్చేందుకు తగిన నిబంధనల రూపకల్పన.

 

ఏడవ ప్రాధాన్యం: మౌలిక సదుపాయాల కల్పన

 

కేంద్ర ప్రభుత్వం ద్వారా మౌలిక సదుపాయాల కల్పన రంగంలో పెట్టుబడి

· మూలధన వ్యయం కోసం 11,11,111 కోట్ల రూపాయలు (జిడిపిలో 3.4 శాతం) సమకూర్చడం జరుగుతుంది.

 

రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడి

· మౌలిక సదుపాయల రంగంలో పెట్టుబడి పెట్టడానికి రాష్ట్రాలకు దీర్ఘకాలిక వడ్డీ రహిత రుణాలకు గాను 1.5 లక్షల కోట్ల రూపాయలను సమకూర్చడం జరుగుతుంది.

ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (పిఎమ్ జిఎస్ వై)

· అన్ని కాలాల్లో 25,000 గ్రామీణ జనావాసాలకు సంధానాన్ని సమకూర్చడం కోసం పిఎమ్ జిఎస్ వై లో నాలుగో దశను ప్రారంభించడం జరుగుతుంది.

 

సేద్యపు నీటి పారుదల, వరద సంబంధ నష్టాలను తగ్గించడం

· బిహార్ లో కోసీ-మేచీ అంతర్ రాష్ట్ర లంకెతో పాటు, ఇతర పథకాల కోసం 11,500 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది.

· వరదలు, కొండచరియలు విరిగి పడడం తదితర సంఘటనలను దృష్టిలో పెట్టుకొని అసోమ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిమ్ లకు ప్రభుత్వం సహాయాన్ని సమకూర్చుతుంది.

పర్యటన రంగం

· విష్ణుపాద టెంపుల్ కారిడార్, మహాబోధి టెంపుల్ కారిడార్, రాజ్ గీర్ లను సంపూర్ణగా అభివృద్ధి పరచడం జరుగుతుంది.

· ఒడిశాలో దేవాలయాలు, కట్టడాలు, చేతివృత్తులు, వన్యప్రాణి అభయారణ్యాలు, సముద్రతీర ప్రాంతాల అభివృద్ధికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది.

 

ఎనిమిదో ప్రాధాన్యం: నూతన ఆవిష్కరణలు, పరిశోధన-అభివృద్ధి

· ప్రాథమిక పరిశోధన, ప్రోటోటైప్ వికాసం కోసం ఉద్దేశించిన అనుసంధాన్ నేషనల్ రిసర్చ్ ఫండ్ కార్యకలాపాలను ఆరంభించడం జరుగుతుంది.

· వాణిజ్య సరళిలో ప్రైవేటు రంగం చోదక శక్తిగా ఉండే పరిశోధనలు, నూతన ఆవిష్కారాలకు ఊతాన్ని ఇవ్వడం కోసం ఒక లక్ష కోట్ల రూపాయల ఆర్థిక ప్రధాన వనరుల సమీకరణ.

అంతరిక్ష సంబంధ ఆర్థిక వ్యవస్థ

· వచ్చే పదేళ్ళలో అంతరిక్ష ప్రధాన ఆర్థిక వ్యవస్థను అయిదింతలు విస్తరించడం కోసం ఒక వేయి కోట్ల రూపాయల వెంచర్ కేపిటల్ ఫండ్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది.

 

తొమ్మిదో ప్రాధాన్యం: భవిష్యత్తు తరం సంస్కరణలు

 

గ్రామీణ భూ సంబంధ కార్యాచరణలు

· అన్ని భూములకు భూ-ఆధార్ లేదా యునీక్ లాండ్ పార్శిల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యుఎల్ పిఐఎన్)

· భూమి లెక్కల చిత్రపటాల డిజిటలీకరణ

· ప్రస్తుత యాజమాన్య ఆధారిత మ్యాప్ సబ్ డివిజన్ ల సర్వే

· భూమి రిజిస్ట్రీని ఏర్పాటు చేయడం

· రైతుల రిజిస్ట్రీతో లంకెను ఏర్పాటు చేయడం

పట్టణ ప్రాంత భూ సంబంధ కార్యాచరణలు

· పట్టణ ప్రాంతాలలో భూమికి సంబంధించిన రికార్డులను జిఐఎస్ మేపింగ్ దన్నుతో డిజిటలీకరణను చేపట్టడం

కార్మికులకు సేవలు

· ఇతర పోర్టల్స్ తో ఇ-శ్రమ్ పోర్టల్ ను విలీనపరచడం, తద్వారా ఒకే చోట పరిష్కారం సాధ్యపడేటట్లు మార్గాన్ని సుగమం చేయడం

· శర వేగంగా మార్పులకు లోనవుతున్న కార్మిక విపణి నైపుణ్యాలకు సంబంధించిన అవసరాలు, వివిధ ఉద్యోగ విధులకు సంబంధించిన ఓపెన్ ఆర్కిటెక్చర్ డేటా బేస్ లు ఏర్పాటు

· ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారిని యాజమాన్యాలు, నైపుణ్య ప్రధాన సంస్థలతో ముడిపెట్టడానికి సంబంధించిన యంత్రాంగం

ఎన్ పిఎస్ వాత్సల్య

· తల్లితండ్రులు, మైనర్ ల సంరక్షులు చందాలను ఇచ్చేందుకు ఉద్దేశించిన ఎన్ పిఎస్-వాత్సల్య అనే ఒక ప్లాన్ ను తీసుకురావడం జరుగుతుంది.

 

రెండవ భాగం

 

పరోక్ష పన్నులు

 

జిఎస్‌టి

· వస్తువులు, సేవల పన్ను విజయవంతం అయిన నేపథ్యంలో పన్నుల స్వరూపాన్ని సరళతరం చేయడం జరుగుతుంది. మిగతా రంగాలకు జిఎస్‌టి ని విస్తరించడం కోసం పన్నుల స్వరూపాన్ని క్రమబద్ధీకరించడం జరుగుతుంది.

 

 

రంగాల వారీ కస్టమ్స్ సుంకం ప్రతిపాదనలు

 

మందులు, వైద్య సంబంధ సామగ్రి

· మూడు కేన్సర్ మందులను కస్టమ్స్ సుంకం నుంచి పూర్తిగా మినహాయించడమైంది. ఆ మందులలో త్రాస్టూజుమాబ్ డెరుక్స్ టెకాన్, ఆసిమెర్తినిమ్ మరియు డూర్వాలుమాబ్ (TrastuzumabDeruxtecan, Osimertinib and Durvalumab) లు ఉన్నాయి

· వైద్య చికిత్సకు ఉపయోగించే ఎక్స్-రే యంత్రాలకు సంబంధించిన ఎక్స్-రే ట్యూబ్ లు, ఫ్లాట్ పానల్ డిటెక్టర్ ల పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బిసిడి) లో మార్పులు.

 

మొబైల్ ఫోన్, సంబంధిత భాగాలు

· మొబైల్ ఫోన్, మొబైల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ (పిసిబిఎ) లపై మరియు మొబైల్ చార్జర్ లపై బిసిడి 15 శాతానికి తగ్గించడమైంది.

విలువైన లోహాలు

· బంగారం, వెండి లపై కస్టమ్స్ సుంకాలను 6 శాతానికి తగ్గించడమైంది; ప్లాటినమ్ పై 6.4 శాతానికి తగ్గించడమైంది.

ఇతర లోహాలు

· ఫెర్రో నికెల్ పై, దుక్క రాగి పై బిసిడి ని తొలగించడమైంది.

· ఫెర్రస్ స్క్రాప్ పై, నికెల్ కాథోడ్ పై బిసిడి ని తొలగించడమైంది.

· రాగి తుక్కు పై 2.5 శాతం ప్రత్యేక బిసిడి

 

ఎలక్ట్రానిక్స్

· రెసిస్టర్స్ తయారీకి ఉపయోగించే ఆక్సిజన్ ఫ్రీ కాపర్ పై కొన్ని షరతులకు లోబడి బిసిడి తొలగించడమైంది.

రసాయనాలు, పెట్రో కెమికల్స్

 

· అమ్మోనియమ్ నైట్రేట్ పై బిసిడి ని 7.5 శాతం నుంచి 10 శాతానికి పెంచడమైంది.

ప్లాస్టిక్స్

· పివిసి ఫ్లెక్స్ బేనర్ లపై బిసిడి ని 10 శాతం నుంచి 25 శాతానికి పెంచడమైంది.

టెలికమ్యూనికేషన్ సామగ్రి

· నిర్దిష్ట టెలికం సామగ్రికి సంబంధించిన ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ (పిసిబిఎ) పై బిసిడిని 10 శాతం మించి 15 శాతానికి పెంచడమైంది.

వ్యాపార సంబంధ ప్రత్యేక సదుపాయం

· దేశీయ విమాన యానాన్ని పడవల, నౌకల ఎమ్ఆర్ఒ ప్రక్రియను ప్రోత్సహించడం కోసం మరమ్మత్తులకై దిగుమతి చేసుకొన్న వస్తువుల ఎగుమతి కాలావధిని ఆరు నెలల నుంచి ఒక ఏడాదికి పొడిగించడమైంది.

· వారంటీతో కూడిన మరమ్మత్తు వస్తువులను తిరిగి దిగుమతి చేయడానికి నిర్దేశించిన కాల పరిమితిని మూడు సంవత్సరాల నుంచి అయిదు సంవత్సరాలకు విస్తరించడమైంది.

క్రిటికల్ మినరల్స్

· 25 క్రిటికల్ మినరల్స్ ను కస్టమ్స్ సుంకాల నుంచి పూర్తిగా మినహాయించడమైంది

· రెండు క్రిటికల్ మినరల్స్ పై బిసిడిని తగ్గించడమైంది.

 

సోలార్ ఎనర్జీ

· సోలార్ సెల్స్, పేనల్స్ తయారీలో ఉపయోగించే కేపిటల్ గూడ్స్ పై కస్టమ్స్ సుంకాన్ని మినహాయించడమైంది

సముద్ర సంబంధ ఉత్పాదనలు

· కొన్ని రకాలైన బ్రూడ్ స్టాక్, పాలీకీట్ వార్మ్ స్, చిన్న రొయ్య మరియు చేపల మేతలపై బిసిడి ని 5 శాతానికి తగ్గించడమైంది.

· చిన్న రొయ్యలు, చేపల మేత తయారీకి ఉపయోగించే వివిధ ఇన్ పుట్స్ ను కస్టమ్స్ సుంకం నుంచి మినహాయించడమైంది.

తోలు, జౌళి సరుకు

· ఆడ బాతు నుంచి తీసే ఫిల్లింగ్ మెటీరియల్ పైన బిసిడి ని తగ్గించడమైంది.

· స్పాండెక్స్ యార్న్ తయారీకి ఉపయోగించే మిథిలీన్ డైఫినైల్ డైసోసైనేట్ (ఎమ్ డిఐ) పై కొన్ని షరతులకు లోబడి బిసిడి ని 7.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడమైంది.

 

ప్రత్యక్ష పన్నులు

· పన్నులను సులభతరం చేయడం, పన్ను చెల్లింపుదారుకు సంబంధించిన సేవలను మెరుగు పరచడం, పన్నులను ఖచ్చితంగా చెల్లించేటందుకు మార్గాన్ని సుగమం చేయడం, దావాల దాఖలను అవకాశాలను తగ్గించడం దిశలో ప్రయత్నాలను కొనసాగించడం జరుగుతుంది.

· ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి పథకాలకు, సంక్షేమ పథకాలకు నిధులను అందించడానికి ఆదాయాలను పెంచుకోవడం జరుగుతుంది.

· 2022-23 ఆర్థిక సంవత్సరంలో పన్నుల విధానాన్ని సరళీకరించిన ఫలితంగా కార్పొరేట్ పన్నులో 58 శాతం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత ఆదాయపు పన్నుకు సంబంధించిన సరళీకరించిన పన్ను విధానాన్ని మూడింట రెండు వంతులకు పైగా పన్ను చెల్లింపుదారులు వినియోగించుకోవడమైంది.

దానశీల సంస్థలకు, టిడిఎస్ కు సంబంధించిన సరళీకరణ

· దానశీల సంస్థలకు వర్తించే రెండు రకాల పన్ను మినహాయింపు విధానాలను ఒకే అంశంగా కలిపివేయడమైంది.

· అనేక చెల్లింపులపై అమలవుతున్న 5 శాతం టిడిఎస్ రేటును 2 శాతం టిడిఎస్ రేటులోకి విలీనం చేయడమైంది.

· మ్యూచువల్ ఫండ్ లు లేదా యుటిఐ యూనిట్ లను తిరిగి కొనుగోలు చేసినప్పుడు వర్తించే 20 శాతం టిడిఎస్ రేటును ఉపసంహరించుకోవడమైంది.

· ఇ-కామర్స్ ఆపరేటర్ లకు వర్తిస్తున్న టిడిఎస్ రేటును ఒక శాతం నుంచి 0.1 శాతానికి తగ్గించడమైంది.

· స్టేట్ మెంట్ ను దాఖలు చేసేందుకు ఉద్దేశించిన గడువు తేదీ వరకు టిడిఎస్ చెల్లింపులో జాప్యం చేయడాన్ని ఇకపై అపరాధ పూర్వక చర్యగా పరిగణించడం జరుగదు.

పునర్ నిర్ధారణ ప్రక్రియ సరళీకరణ

· లెక్కలలో చూపని ఆదాయం 50 లక్షల రూపాయలు గాని, లేదా అంతకన్నా ఎక్కువ గాని ఉన్నప్పుడు మాత్రమే నిర్ధారణ (అసెస్ మెంట్)ను అసెస్ మెంట్ ఇయర్ ముగిసినప్పటి నుంచి మూడేళ్ళు దాటిన తరువాత అయిదేళ్ళ వరకు తిరిగి తెరవవచ్చు.

· సోదా జరపవలసి వచ్చిన వ్యవహారాలలో కాల పరిమితిని సోదాను చేపట్టిన సంవత్సరానికి పూర్వం పది సంవత్సరాలుగా ఉండగా, దానిని ఆరు సంవత్సరాలకు తగ్గించడమైంది.

 

మూలధన లాభాల సరళీకరణ సక్రమ వ్యవస్థీకరణ

· కొన్ని విధాలైన ఫైనాన్షియల్ అసెట్స్ పై ఆర్జించే స్వల్పకాలిక లాభాల పైన 20 శాతం పన్ను రేటును విధించడం జరుగుతుంది.

· అన్ని విధాలైన ఫైనాన్షియల్ అసెట్స్ మరియు నాన్ ఫైనాన్షియల్ అసెట్స్ పై ఆర్జించే దీర్ఘకాలిక లాభాల పైన 12.5 శాతం పన్ను రేటును విధించడం జరుగుతుంది.

· కొన్ని విధాలైన ఫైనాన్షియల్ అసెట్స్ పై మూలధన లాభాలకు మినహాయింపు పరిమితిని ఒక్కో సంవత్సరానికి 1.25 లక్షల రూపాయలకు పెంచడమైంది.

పన్ను చెల్లింపుదారుకు సంబంధించిన సేవలు

· కస్టమ్స్, ఆదాయపు పన్నుల తాలూకు మిగతా సేవలను అన్నింటిని (సవరణ మరియు అప్పిలేట్ ఆర్డర్ లు అవసరమని సూచించిన ఉత్తర్వులు సహా) వచ్చే రెండు సంవత్సరాలలో డిజిటల్ మాధ్యమంలోకి మార్పు చేయడం జరుగుతుంది.

దావా, అప్పీళ్ళు

· ఉన్నతాధికారికి నివేదించిన అపరిష్కృతంగా ఉన్న ఆదాయపు పన్ను వివాదాల పరిష్కారం కోసం ఉద్దేశించిన ‘వివాద్ సే విశ్వాస్ పథకం-2024’.

· పన్నుల సంబంధ ప్రత్యేక న్యాయస్థానాలు, ఉన్నత న్యాయస్థానాలు, సర్వోన్నత న్యాయస్థానంలో నివేదించిన ప్రత్యక్ష పన్నులు, ఎక్సైజ్, ఇంకా సేవ పన్ను సంబంధ అప్పీళ్ళ దాఖలుకు విధించిన ద్రవ్య పరిమితులను వరుసగా 60 లక్షల రూపాయలు, 2 కోట్ల రూపాయలు, 5 కోట్ల రూపాయలకు పెంచడమైంది.

· దావాలు వేయడాన్ని తగ్గించడానికి, అంతర్జాతీయ పన్నుల విధానంలో నమ్మకం కలిగించడానికి సేఫ్ హార్బర్ సంబంధ నియమాలను విస్తరించడమైంది.

ఉపాధి కల్పన, పెట్టుబడి

 

· స్టార్ట్-అప్ ఇకో-సిస్టమ్ ను ప్రోత్సహించడం కోసం అన్ని విధాలైన ఇన్వెస్టర్ లకు ఏంజల్ టాక్స్ ను విధించే పద్ధతిని రద్దు చేయడమైంది.

· దేశీయ విహారాల కార్యకలాపాలను నిర్వహిస్తున్న విదేశీ నౌకాయాన వ్యాపార సంస్థలకు సులభతర పన్ను విధానాన్ని ప్రవేశపెట్టడమైంది. భారతదేశంలో సముద్రయాత్ర ప్రధానమైన పర్యటన రంగాన్ని ప్రోత్సహించడమే ఈ నిర్ణయంలోని ప్రధానోద్ధేశ్యం.

· దేశంలో ముడి వజ్రాలను విక్రయిస్తున్న విదేశీ మైనింగ్ కంపెనీలకు రక్షణ ప్రధానమైన రేటులను వర్తింప చేయడం జరుగుతుంది.

· విదేశీ వ్యాపార సంస్థలకు విధించే కార్పొరేట్ పన్ను రేటును 40 శాతం నుంచి 35 శాతానికి తగ్గించడమైంది.

పన్నుల సంబంధ పునాదిని విస్తరించడం

· సెక్యూరిటీల ఫ్యూచర్స్ పైన & ఆప్షన్స్ పైన విధించే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్స్ ని వరుసగా 0.02 శాతానికి, 0.1 శాతానికి పెంచడమైంది.

· షేర్ లను తిరిగి కొనుగోలు చేసినందువల్ల స్వీకర్త అందుకొన్న ఆదాయం పై పన్నును విధించడం జరుగుతుంది.

సామాజిక భద్రత సంబంధ ప్రయోజనాలు

· ఎన్‌పిఎస్ కు సంబంధించిన యాజమాన్యాలు పెట్టే ఖర్చులో తగ్గింపు, ఉద్యోగి జీతంలో 10 శాతం కోతను 14 శాతానికి పెంచడం జరుగుతుంది.

· 20 లక్షల రూపాయల వరకు విలువైన విదేశీ చరాస్తులను గురించి వివరాలను వెల్లడించకపోవడాన్ని అపరాధంగా పరిగణించడం జరుగదు.

ఆర్థిక బిల్లులో మరో ప్రధాన ప్రతిపాదన

· ఉపసంహరించిన 2 శాతానికి తత్సమానమైన విధంగా భర్తీ చేయడం జరుగుతుంది.

 

కొత్త పన్నుల విధానంలో భాగంగా వ్యక్తిగత ఆదాయపు పన్నులో మార్పులు

· జీతాన్ని అందుకొనే ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ ను 50,000 రూపాయల నుంచి 75,000 రూపాయలకు పెంచడమైంది.

· పింఛన్ దారులకు కుటుంబ పింఛను కోతను 15,000 రూపాయల నుండి 25,000 రూపాయలకు పెంచడమైంది.

 

· సవరించిన పన్ను రేటుల స్వరూపం ఇది:

0-3 లక్షల రూపాయలు వరకు

0

3-7 లక్షల రూపాయలు వరకు

5 శాతం

7-10 లక్షల రూపాయలు వరకు

10 శాతం

10-12 లక్షల రూపాయలు వరకు

15 శాతం

12-15 లక్షల రూపాయలు వరకు

20 శాతం

15 లక్షల రూపాయలకు పైబడి

30 శాతం

 

· జీతాన్ని అందుకొనే ఉద్యోగికి కొత్త పన్ను విధానంలో 17,500 రూపాయల వరకు ఆదాయ పన్నును ఆదా చేసుకొనేందుకు వీలుంటుంది.

 

*** 


(Release ID: 2036043) Visitor Counter : 3720