ఆర్థిక మంత్రిత్వ శాఖ

జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం కింద పన్నెండు పెట్టుబడి సంసిద్ధ ‘ప్లగ్ అండ్ ప్లే’ పారిశ్రామిక పార్కుల ఏర్పాటు: కేంద్ర బడ్జెట్ 2024-25


కీలక ఖనిజాల దేశీయ ఉత్పత్తి, పునర్వినియోగం, కీలక ఖనిజ ఆస్తుల సముద్రాంతర సేకరణ కోసం కీలక ఖనిజాల మిషన్ (క్రిటికల్ మినరల్ మిషన్) ప్రతిపాదన

ఈ-శ్రమ్ పోర్టల్ ను ఇతర పోర్టళ్లతో సమీకరించి అన్ని సమస్యలనూ ఒకే చోట పరిష్కరించేలా కార్మికులకు విస్తృతశ్రేణి సేవలు

శ్రమసువిధ, సమాధాన్ పోర్టళ్లను పునరుద్ధరించి పరిశ్రమలు, వాణిజ్యానికి అనుమతులను సులభతరం చేయాలని కేంద్ర బడ్జెట్ ప్రతిపాదన

Posted On: 23 JUL 2024 12:55PM by PIB Hyderabad

పట్టణ ప్రణాళిక పథకాల సద్వినియోగం ద్వారా రాష్ట్రాలు, ప్రైవేటు రంగం భాగస్వామ్యంతో దాదాపు 100 నగరాల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలతో పెట్టుబడి సంసిద్ధ ‘ప్లగ్ అండ్ ప్లే’ పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి మా ప్రభుత్వం అన్ని అవకాశాలూ కల్పిస్తుందిఅని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. 2024-25 కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న ‘తయారీ, సేవల’ ప్రాధాన్యాన్ని నెరవేర్చే అంశంగా దీనిని పేర్కొన్నారు. జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం కింద పన్నెండు పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు కూడా నిధులు మంజూరు చేయాలని బడ్జెట్ లో ప్రతిపాదించారు.

కీలక ఖనిజాల మిషన్ (క్రిటికల్ మినరల్ మిషన్)

‘తయారీ & సేవల’ రంగానికి మరింత ప్రాధాన్యత ఇస్తూ; దేశీయ ఉత్పత్తి, కీలక ఖనిజాల పునర్వినియోగం, సముద్రాంతర కీలక ఖనిజ ఆస్తుల సేకరణ కోసం కీలక ఖనిజాల మిషన్ (క్రిటికల్ మినరల్ మిషన్) ఏర్పాటును కేంద్ర బడ్జెట్ 2024-25 ప్రతిపాదించింది. సాంకేతిక అభివృద్ధి, నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి, ఉత్పత్తిదారు బాధ్యతల విస్తరణ యంత్రాంగం, తగిన ఆర్థిక విధానం దీని బాధ్యతలు.

తీరప్రాంత ఖనిజాల వెలికితీతపై ప్రత్యేకంగా దృష్టిపెడుతూ, ఇప్పటికే చేపట్టిన అన్వేషణ ఆధారంగా మైనింగ్ కోసం మొదటి విడత తీరప్రాంత బ్లాకుల వేలాన్ని ప్రారంభించాలని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.

కార్మిక సంబంధిత సంస్కరణలు

ఉపాధి, నైపుణ్యం సహా కార్మికులకు విస్తృతమైన సేవలను అందించడానికి కూడా కేంద్ర బడ్జెట్ 2024-25 ప్రతిపాదనలు చేసింది. “ఇతర పోర్టళ్లతో ఈ-శ్రమ్ పోర్టల్ సమగ్ర ఏకీకరణ అన్ని అంశాలతో ఒకే చోట వ్యవహరించే సదుపాయం కల్పిస్తుంది”. శరవేగంగా మార్పు చెందుతున్న శ్రామిక మార్కెట్ కోసం సార్వత్రిక నిర్మాణశాస్త్ర అంశాలు, నైపుణ్య ఆవశ్యకతలు – అందుబాటులోని ఉద్యోగాలు, యజమానులు-నైపుణ్య శిక్షకులను ఈ సేవల పరిధిలోకి తెస్తూ ఉద్యోగాలు- అభ్యర్థులను అనుసంధానించే వ్యవస్థను ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.

‘మలితరం సంస్కరణల’పై దృష్టిపెడుతూ, శ్రమసువిధ, సమాధాన్ పోర్టళ్లను పునరుద్ధరించి పరిశ్రమలు, వాణిజ్యానికి అనుమతులను సులభతరం చేయాలని కేంద్ర బడ్జెట్ 2024-25 ప్రతిపాదించింది. వాటిని బలోపేతం చేయడం, వికసిత భారత్ లక్ష్యం దిశగా మన ప్రయాణం పుంజుకునేలా వాటి అమలును వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ ప్రతిపాదనలు చేశారు.

***



(Release ID: 2035872) Visitor Counter : 14