ఆర్థిక మంత్రిత్వ శాఖ

2022-23లో నిరుద్యోగ రేటు 3.2 శాతానికి తగ్గడంతో గత ఆరేళ్లలో మెరుగుపడిన భారత కార్మిక మార్కెట్


పెరుగుతున్న యువత, మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం డెమోగ్రాఫిక్, జెండర్ డివిడెండ్ ను ఉపయోగించుకోవడానికి ఒక అవకాశం

మహమ్మారి పూర్వ స్థితి నుంచి మెరుగైన వ్యవస్థీకృత తయారీ రంగం; గత ఐదేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో నమోదైన అధిక వేతన వృద్ధి

గత ఐదేళ్లలో రెట్టింపు కంటే ఎక్కువ నమోదై 131.5 లక్షలకు చేరుకున్న ఈపీఎఫ్‌వో నికర పేరోల్ చేరికలు, ఇది ఉపాధిలో ఆరోగ్యకరమైన వృద్ధిని సూచిస్తుంది.

Posted On: 22 JUL 2024 3:17PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2023-24 ఆర్థిక సర్వేలో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పిఎల్ఎఫ్ఎస్) డేటా ప్రకారం, గత ఆరేళ్లలో భారతదేశం కార్మిక మార్కెట్ సూచికలలో మెరుగుదల చూసిందని పేర్కొన్నారు, నిరుద్యోగిత రేటు 2022-23 లో 3.2 శాతానికి తగ్గింది. భారత యువత యొక్క చట్టబద్ధమైన ఆకాంక్షలకు అనుగుణంగా తగిన ఉపాధి అవకాశాలను సృష్టించడానికి భారత ప్రభుత్వ విధానాన్ని ఇది తెలిపింది.
ప్రస్తుత ఉపాధి పరిస్థితి

భారత్, ఉపాధి విషయంలో గణనీయమైన మార్పును చూసిందని ఆర్థిక సర్వేలో పేర్కొ్న్నారు. ఆర్థిక వృద్ధి, సామాజిక అభివృద్ధికి దోహదపడే అనేక సానుకూల ధోరణులతో గుర్తించబడిందని, ఆర్థిక సంస్కరణలు, సాంకేతిక పురోగతి, నైపుణ్య అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఇది సాధ్యపడినట్లు ఆర్థిక సర్వే పేర్కొంది.
పిఎల్ఎఫ్ఎస్ ప్రకారం, కోవిడ్ -19 మహమ్మారి నుండి అఖిల భారత వార్షిక నిరుద్యోగ రేట్ (యుఆర్) (సాధారణ స్థితి ప్రకారం 15 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు) తగ్గుతున్న ధోరణి కనిపిస్తోంది, కార్మిక శక్తి భాగస్వామ్య రేటు (ఎల్ఎఫ్పిఆర్) కార్మిక-జనాభా నిష్పత్తి (డబ్ల్యుపిఆర్) పెరుగుదల కనిపించినట్లు సర్వే వెల్లడించింది.
మహిళా శ్రామిక శక్తి, స్వయం ఉపాధి వైపు మళ్లుతోందని, గత ఆరేళ్లలో మహిళా ఎల్ఎఫ్‌పీఆర్ గణనీయంగా పెరగడం, గ్రామీణ మహిళలు వ్యవసాయం, సంబంధిత కార్యకలాపాల్లో చేరడం ద్వారా పురుష శ్రామిక శక్తి వాటా స్థిరంగా ఉందని సర్వే పేర్కొంది.
యువత, మహిళా ఉపాధి
2017-18 ఆర్థిక ఏడాదిలో యువత (15-29 ఏళ్ల వయస్సు) నిరుద్యోగ రేటు 17.8 శాతం కాగా, 2022-23 నాటికి 10 శాతానికి తగ్గిందని ఆర్థిక సర్వే పేర్కొంది. ఈపీఎఫ్ఓ పేరోల్ లోని కొత్త చందాదారుల్లో మూడింట రెండొంతుల మంది 18-28 ఏళ్ల వయసుకు చెందినవారే.
ఆరేళ్లుగా పెరుగుతున్న మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు (ఎఫ్ఎల్ఎఫ్పీఆర్) గురించి కూడా సర్వే ప్రస్తావించింది. వ్యవసాయ ఉత్పత్తిలో నిరంతర అధిక పెరుగుదల నమోదవ్వడం, పైపుల తాగునీరు, స్వచ్ఛమైన వంట ఇంధనం, పారిశుధ్యం వంటి ప్రాథమిక సౌకర్యాల ప్రాప్యత గణనీయంగా విస్తరించడం వల్ల మహిళల సమయం తగ్గడం వంటి అనేక అంశాలు దీనికి కారణమని పేర్కొంది.

కర్మాగార (ఫ్యాక్టరీ) ఉద్యోగాల్లో పురోగతి

గత ఐదేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో కనిపించిన అధిక వేతన వృద్ధితో పాటు వ్యవస్థీకృత తయారీ రంగం మహమ్మారి పూర్వ స్థాయికి కోలుకుందని, ఇది గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ సృష్టికి బాగా దోహదం చేస్తుందని ఆర్థిక సర్వే పేర్కొంది. 2015-22 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో కార్మికుడి వేతనాలు 6.9 శాతం సీఏజీఆర్ (కాంపౌండెడ్ వార్షిక వృద్ధి రేటు)గా, పట్టణ ప్రాంతాల్లో 6.1 శాతం సీఏజీఆర్ పెరిగాయి.
రాష్ట్రాలవారీగా పరిశీలిస్తే, కర్మాగారాల సంఖ్య పరంగా మొదటి ఆరు రాష్ట్రాలు అత్యధికంగా, కర్మాగారాల్లో ఉపాధి కల్పనలో ఉన్నతంగా నిలిచాయి. ఫ్యాక్టరీల్లో 40 శాతానికి పైగా తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రల్లోనే ఉన్నాయి. అయినప్పటికీ, 2018-2022 ఆర్థిక సంవత్సరా మధ్య అత్యధిక ఉపాధి వృద్ధి ఛత్తీస్‌గఢ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ తో సహా యువ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కనిపించింది.
కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్, రబ్బర్, ప్లాస్టిక్ ఉత్పత్తులు, కెమికల్స్ ధరలు పెరుగుతున్నాయని, భారత తయారీ విలువ గొలుసును పెంచుకుంటోందని, ఉపాధి కల్పనకు ఊతమిచ్చే రంగాలుగా ఆవిర్భవించాయని సర్వే పేర్కొంది.

పెరుగుతున్న ఈపీఎఫ్ఓ నమోదు

వ్యవస్థీకృత రంగంలో మార్కెట్ స్థితిని తెలుసుకునేందుకు ఇపిఎఫ్ఓ లోని పేరోల్ డేటా ఒక కొలమానం.2019 ఆర్థిక సంవత్సరం నుండి పేరోల్ లో స్థిరమైన పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన సహాయంతో కోవిడ్ మహమ్మారి నుండి వేగంగా కోలుకుంటున్న ఇపిఎఫ్ఓకు వార్షిక నికర పేరోల్ చేరికలు 2019 ఆర్థిక సంవత్సరంలో 61.1 లక్షల కాగా, 2024 ఆర్థిక సంవత్సరంలో 131.5 లక్షలకు రెట్టింపు అయ్యాయి. 2015 ఆర్థిక సంవత్సరం నుంచి 2024 ఆర్థిక సంవత్సరం మధ్య ఈపీఎఫ్ఓ మెంబర్‌షిప్ నంబర్లు (పాత డేటా అందుబాటులో ఉన్నాయి) 8.4 శాతం సీఏజీఆర్ పెరిగాయి.

ఉపాధి కల్పనకు ప్రోత్సాహం

భారత్ ఉత్పాదక సామర్థ్యాలను పెంచడానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పిఎల్ఐ) పథకాన్ని ప్రారంభించడం, మూలధన వ్యయాన్ని పెంచడం మొదలైన ఉపాధి కల్పనను పెంచడానికి, కార్మికుల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. రుణ సదుపాయాన్ని సులభతరం చేయడం, బహుళ ప్రక్రియ సంస్కరణల ద్వారా స్వయం ఉపాధికి ఊతమిచ్చింది. ఉపాధి కల్పన, కార్మికుల సంక్షేమాన్ని పెంపొందించేందుకు నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్సీఎస్) పోర్టల్, ఈ-శ్రమ్ పోర్టల్ ప్రారంభం, కొవిడ్-19 అనంతరం సామాజిక భద్రతా ప్రయోజనాలతో ఉపాధిని పెంచడానికి ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన (ఏబీఆర్వై) ప్రవేశపెట్టడం, వన్ నేషన్ - వన్ రేషన్ కార్డు వంటి కార్యక్రమాలు, 2019, 2020లో 29 కేంద్ర చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా విలీనం చేయడం వంటి కార్యక్రమాలను సర్వే ప్రస్తావించింది.

గ్రామీణ వేతనాల తీరుతెన్నులు

2023-24 ఆర్థిక సర్వే ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ వేతనాలు ప్రతి నెలా 5 శాతానికి పైగా పెరిగాయని, సగటున వ్యవసాయంలో నామమాత్రపు వేతన రేట్లు పురుషులకు 7.4 శాతం, మహిళలకు 7.7 శాతం పెరిగాయని పేర్కొంది. ఇదే సమయంలో వ్యవసాయేతర కార్యకలాపాల్లో వేతనాల పెరుగుదల పురుషులకు 6.0 శాతం, మహిళలకు 7.4 శాతంగా ఉంది. అంతర్జాతీయ సరుకు ధరలు, దేశీయ ఆహార ధరల సడలింపుతో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందని, ఇది వాస్తవ వేతనాల్లో స్థిర పెరుగుదలకు దారితీస్తుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది.

 

****



(Release ID: 2035465) Visitor Counter : 106