ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత వ్యవసాయ రంగం ఒక విజయగాథ: ఆర్థిక సర్వే 2023-24


వ్యవసాయ రంగానికి సంబంధించి ఐదు విధాన సిఫార్సులను ఆర్థిక సర్వే హైలైట్ చేసింది

ప్రాథమిక ఆహార భద్రత నుంచి పౌష్టికాహార భద్రతకు మారడం ప్రస్తుత అవసరం


Posted On: 22 JUL 2024 3:03PM by PIB Hyderabad

వ్యవసాయ రంగం 3 పెద్ద సవాళ్ల కూడలి వద్ద ఉంది: ఆహార మరియు పోషకాహార భద్రత, వాతావరణ మార్పు మరియు కీలకమైన వనరుల సుస్థిర వినియోగం

 

భారతీయ వ్యవసాయ రంగం ఒక విజయగాథ. 1960వ దశకంలో ఆహార లోటు, దిగుమతి చేసుకునే స్థితి నుండి  దేశం వ్యవసాయ ఉత్పత్తుల నికర ఎగుమతిదారుగా ఎదిగిందని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2023-24 ఆర్థిక సర్వేలో  హైలైట్ చేశారు.

ప్రాథమిక ఆహార భద్రత నుంచి పౌష్టికాహార భద్రతకు మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని సర్వే అభిప్రాయపడింది. పప్పు దినుసులు, చిరుధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం వంటివి మరింతగా అవసరమని, వాటి డిమాండ్ నిత్యావసరాల కంటే వేగంగా పెరుగుతోందని సర్వే పేర్కొంది. కాబట్టి, వ్యవసాయ రంగ విధానాలు మరింత పోషకమైన మరియు ప్రకృతి వనరులకు అనుగుణంగా ఉండే 'డిమాండ్ ఆధారిత ఆహార వ్యవస్థ'తో మరింత సమీకృతం కావాలని సర్వే సూచిస్తుంది.

రైతు ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని  మార్కెట్లు పనిచేసేలా ప్రభుత్వాలు తీసుకోగల ఐదు విధాన సిఫార్సులను ఆర్థిక సర్వే వివరించింది. ధరల పెరిగిన  మొదటి సందర్భంలోనే  ఫ్యూచర్స్ లేదా ఎంపికలను నిషేధించకపోవడం గురించి మొదటి దశ తెలుపుతుంది. ఇటువంటి మార్కెట్లను నియంత్రించే  తెలివైన నిర్మాణ  రూపకల్పన ద్వారా  వ్యవసాయ వస్తువుల ఫ్యూచర్ మార్కెట్లో అధికారుల జోక్యం అవసరాన్ని నివారించగలదని సర్వే పేర్కొంది.

అసాధారణ పరిస్థితులలో మాత్రమే వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను నిషేధించాలని, ప్రత్యేకించి అవి అత్యవసరమైన ఆహార ధాన్యాలు కాని పక్షంలో, దేశీయ వినియోగదారులను ప్రత్యామ్నాయం వైపు మళ్ళించాలని సర్వే చేసిన రెండవ సిఫార్సు తెలియజేస్తుంది. " అంతర్జాతీయ అధిక ధరల నుండి ప్రయోజనం పొందడానికి రైతులను  అనుమతించాలి" అని సర్వే పేర్కొంది.

మూడో దశగా, ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేసే నిర్మాణాన్ని (ఫ్రేంవర్క్) పునఃపరిశీలించాలని సర్వే పేర్కొంది. భారత ద్రవ్యోల్బణ లక్ష్య చట్రం, ద్రవ్యోల్బణాన్ని లక్ష్యంగా చేసుకున్నప్పుడు ఆహారాన్ని మినహాంచాలని  పేర్కొంది. "అధిక ఆహార ధరలు, తరచుగా, డిమాండ్-ప్రేరితమైనవి కావు, కానీ సరఫరా-ప్రేరితమైనవి. భారతదేశం యొక్క ద్రవ్యోల్బణ లక్ష్య ఫ్రేమ్వర్క్ ఆహారాన్ని మినహాయించి ద్రవ్యోల్బణ రేటును లక్ష్యంగా చేసుకోవాలా అనేది అన్వేషించదగినది." అని సర్వే పేర్కొంది. పేద మరియు అల్పాదాయ వినియోగదారులకు అధిక ఆహార ధరల వల్ల కలిగే ఇబ్బందులను, నిర్దిష్ట కొనుగోళ్ల కోసం తగిన కాలవ్యవధికి చెల్లుబాటు అయ్యే నేరుగా ప్రయోజన బదిలీలు లేదా కూపన్ల ద్వారా నిర్వహించవచ్చని సర్వే పేర్కొంది.

నాల్గవ సిఫారసు మొత్తం నికర నీటి పారుదల కల భూవిస్తీర్ణాన్ని పెంచాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడుతుంది. అనేక రాష్ట్రాలు జాతీయ సగటు కంటే చాలా తక్కువగా ఉన్నాయని, భారతదేశ నీటిపారుదల సామర్థ్యం ఉపరితల జలాలకు 30-40 శాతం, భూగర్భ జలాలకు 50-60 శాతం మాత్రమే ఉందని సర్వే పేర్కొంది. మెరుగైన నీటి వినియోగ వ్యవసాయ పద్ధతులు, బిందుసేద్యం, ఫెర్టిగేషన్ వంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించే ఆవశ్యకతను ఈ సర్వే ఎత్తిచూపింది.

సర్వే యొక్క ఐదవ మరియు చివరి సూచన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నిరంతరంగా వ్యవసాయాన్ని తయారు చేయడం గురించి. వరి వంటి ధాన్యాలు, చెరకు నీటి ఆధారిత పంటలు మరియు వరి సాగు మీథేన్ ఉద్గారాలకు దారితీస్తుంది. పంట తటస్థ ప్రోత్సాహక నిర్మాణాలను ప్రోత్సహించాల్సిన సమయం ఆసన్నమైందని సర్వే పేర్కొంది.

21వ శతాబ్ధపు మూడు అతిపెద్ద సవాళ్ల కూడలిలో వ్యవసాయం ఉంది- ఆహార మరియు పోషకాహార భద్రతను కొనసాగించడం, వాతావరణ మార్పులను స్వీకరించడం, నియంత్రించడం  మరియు నీరు, శక్తి మరియు భూమి వంటి కీలకమైన వనరుల సుస్థిర వినియోగం అని సర్వే తెలిపింది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు లాభదాయకమైన ఉపాధికి గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఆర్థిక వృద్ధికి మరియు ఉపాధి కల్పనకు దోహదం చేయడానికి వ్యవసాయం యొక్క సామర్థ్యాన్ని భారతదేశం ఇంకా పూర్తిగా ఉపయోగించుకోలేదని సర్వే పేర్కొంది.

నీటి ఎద్దడి, వాతావరణ మార్పుల వల్ల ఉద్భవిస్తున్న  సవాళ్లను ఎదుర్కొనేందుకు వ్యవసాయ రంగంలో తీవ్రమైన నిర్మాణాత్మక పరివర్తన అవసరమని సర్వే పేర్కొంది. వ్యవసాయ కూలీలు తిరిగి వాళ్ళ ఇళ్ళుచేరిన ( రివర్స్ మైగ్రేషన్) కారణంగా కోవిడ్ సంవత్సరాల్లో వ్యవసాయ ఉపాధి పెరగడం, 2024 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయంలో విలువను పెంచే వృద్ధి రేటు క్షీణించడం మరియు 2024 వేసవిలో దేశంలోని వాయవ్య మరియు మధ్య ప్రాంతాలలో అత్యంత వేడికారణంగా  పెరుగుతున్న నీటి అవసరాల ఒత్తిడి మరియు శక్తి వినియోగంతో భారత వ్యవసాయ రంగ విధానాలను తీవ్రంగా మరియు నిజాయితీగా తయారుచేయడం అనివార్యమని   సర్వే ముక్తాయింపు పలుకుతుంది.

***


(Release ID: 2035459) Visitor Counter : 687