ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వ్యవసాయ రంగం గత ఐదు సంవత్సరాల్లో 4.18 శాతం సగటు వార్షిక వృద్ధి రేటును నమోదు చేసిందని ఆర్థిక సర్వే తెలిపింది.


చిన్న, సన్నకారు రైతులు అధిక విలువ పొందే వ్యవసాయం ఉత్పత్తిదారులుగా ఎదగాలి.

నూనెగింజల సాగు విస్తీర్ణం మొత్తం 2014-15లో (17.5 శాతం వృద్ధితో ) 25.60 మిలియన్ హెక్టార్ల నుంచి 2023-24 నాటికి 30.08 మిలియన్ హెక్టార్లకు పెరిగింది .

వ్యవసాయ రంగానికి ఊతమివ్వడానికి ప్రైవేట్ రంగం పెట్టుబడులను పెంచడం అత్యవసరం.

Posted On: 22 JUL 2024 2:59PM by PIB Hyderabad

2023-24 ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ వెలువరించారు. చిన్న, సన్నకారు రైతులు ధిక విలువ పొందే వ్యవసాయం ఉత్పత్తిదారులుగా ఎదగాలని ఆర్థిక సర్వే వివరించింది. చిన్న, సన్నకారు రైతుల ఆదాయాలు పెరిగినప్పుడు, వారు వస్తువులను కొనుగోలు చేస్తారు, ఇది ఉత్పత్తి విప్లవానికి ప్రేరణ నిస్తుందని ఆర్థిక సర్వే తెలిపింది.

భారతీయ వ్యవసాయ రంగం దేశ జి డి పి లో 18.2 శాతం వాటాతో సుమారు 42.3 శాతం జనాభాకు జీవనాధారాన్ని అందిస్తుందని ఆర్థిక సర్వే పేర్కొంది. గత ఐదు సంవత్సరాల్లో స్థిరమైన ధరలపై వ్యవసాయ రంగం సగటు వార్షిక వృద్ధి రేటు 4.18 శాతం నమోదు చేసుకుని, 2023-24కు తాత్కాలిక అంచనాల ప్రకారం వ్యవసాయ రంగం వృద్ధి రేటు 1.4 శాతంగా ఉందని ఆర్థిక సర్వే తెలిపింది.

ఆర్థిక సర్వే ప్రకారం, వ్యవసాయ పరిశోధనలో పెట్టుబడి మరియు అనుకూల విధానాలు ఆహార భద్రతకు బాగా తోడ్పడినట్లు తెలుస్తోంది. వ్యవసాయ పరిశోధన (పరిపాలనతో సహా)లో పెట్టిన ప్రతి రూపాయి పెట్టుబడి కి ₹13.85 రాబడి ఉంటుందని అంచనా. 2022-23లో, వ్యవసాయ పరిశోధన కోసం ₹19.65 వేల కోట్లు ఖర్చు చేశారు.

వ్యవసాయ రంగానికి ఊతమివ్వడానికి ప్రైవేట్ రంగం పెట్టుబడులను పెంచడం అత్యవసరం అని ఆర్థిక సర్వే తెలిపింది. సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పత్తి పద్ధతులు, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు, పంట అనంతర నష్టాలను తగ్గించడం మొదలైన వాటిలో పెట్టుబడులు పెరగాలి. మౌలిక సదుపాయాలు మరియు ఆహార ప్రాసెసింగ్ రంగం అభివృద్ధికి ఎక్కువ శ్రద్ధ పెట్టడం ద్వారా పంట వృథాను /నష్టాన్ని తగ్గించవచ్చు, నిల్వ కాలవ్యవధిని పెంచడం ద్వారా రైతులకు మెరుగైన ధరలను నిర్ధారించవచ్చు.

ఆర్థిక సర్వే ప్రకారం 2022-23లో, ఆహార ధాన్యాల ఉత్పత్తి 329.7 మిలియన్ టన్నులకు చేరుకొని చరిత్రాత్మక స్థాయిని అందుకుంది, నూనె గింజల ఉత్పత్తి 41.4 మిలియన్ టన్నులకు చేరుకుంది. 2023-24లో అల్ప వర్షపాతం, వానలు ఆలస్యం అయినకారణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి 328.8 మిలియన్ టన్నులకు తగ్గింది. 2015-16లో దేశీయంగా వంటనూనె 86.30 లక్షల టన్నుల నుండి 2023-24లో 121.33 లక్షల టన్నులకి పెరిగింది. నూనె గింజల మొత్తం విస్తీర్ణం 2014-15లో 25.60 మిలియన్ హెక్టార్ల నుండి 2023-24లో
 (17.5 శాతం వృద్ధితో )30.08 మిలియన్ హెక్టార్లకు పెరిగింది. వంటనూనెకు దేశీయ డిమాండ్, వినియోగ ధోరణులు పెరిగినప్పటికీ వంటనూనె దిగుమతి  శాతాన్ని 2015-16లో 63.2 శాతం నుండి  2022-23 నాటికి 57.3 శాతానికి తగ్గించింది.

ఆర్థిక సర్వే ప్రకారం వ్యవసాయ మార్కెటింగ్‌లో సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి, ధరలను మెరుగుపరచడానికి ప్రభుత్వం ఈ నామ్  పథకాన్ని అమలు చేసింది. 2024 మార్చి 14 నాటికి ఈ నామ్ పోర్టల్‌లో 1.77 కోట్ల మంది రైతులు మరియు 2.56 లక్షల వ్యాపారులు నమోదు చేసుకున్నారు. 10,000 ఎఫ్ పీ ఓ ల ఏర్పాటును ప్రోత్సహించడానికి  2020లో భారత ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించింది. 2027-28 వరకు ₹6.86 వేల కోట్లు బడ్జెట్ కేటాయించింది. 2024 ఫిబ్రవరి 29 నాటికి 8,195 ఎఫ్ పీ ఓలు కొత్త ఎఫ్ పీ ఓ పథకం కింద నమోదు చేసుకున్నారు. 3,325 ఎఫ్ పీ ఓలకు ₹157.4 కోట్ల ఈక్విటీ గ్రాంట్లు విడుదల చేశారు. 1,185 ఎఫ్ పీ ఓలకు ₹278.2 కోట్ల రుణ హామీ జారీ చేశారు.

ఆర్థిక సర్వే ప్రకారం వ్యవసాయ పంటలకు మద్దతుధర రైతులకు లాభదాయకమైన రాబడులను నిర్ధారిస్తుంది, ఆదాయాన్ని పెంచుతుంది,  ఆహారధాన్యాలను నిలకడైన ధరలతో అందించడానికి ప్రభుత్వానికి వీలుకల్పిస్తుంది. అందుకే, 2018-19 వ్యవసాయ సంవత్సరం నుండి ప్రభుత్వం అన్ని ఖరీఫ్, రబీ, ఇతర వాణిజ్య పంటలకు  దేశీయ సగటు ఉత్పత్తి ఖర్చు పై కనీసం 50 శాతం అదనం గా ఎం ఎస్ పీ ని పెంచుతుంది.

అత్యంత బలహీన రైతు కుటుంబాలకు సామాజిక భద్రతను అందించడానికి, ప్రభుత్వం ప్రధాన్ మంత్రి కిసాన్ మాంధాన్ యోజన (పీ ఎం కె ఎం వై )ను అమలు చేస్తోందని ఆర్థిక సర్వే తెలిపింది. ఈ పథకం 60 ఏళ్ల వయస్సుపై బడిన తర్వాత నమోదైన రైతులకునెలకు ₹3,000 పెన్షన్ అందిస్తుంది. తొలగిచబడే అర్హతా నిబంధనలకు లోబడి దరఖాస్తుదారు (18 నుండి 40 సంవత్సరాల వయసున్న వారికి )  ₹55 నుండి ₹200 మధ్య నెలవారీ ప్రీమియం చెలించాల్సి ఉంటుంది. 2024 జూలై 07 నాటికి 23.41 లక్షల రైతులు ఈ పథకం కింద నమోదు చేసుకున్నారు.

భూసార పునరుద్ధరణ, అవగాహన కల్పించడం, పోషణ,మెరుగుదల కోసం ప్రధాన మంత్రి పథకం (పీ ఎం ప్రమాన్)  కార్యక్రమం రాష్ట్రాలను రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడానికి ప్రోత్సహిస్తుందని ఆర్థిక సర్వే వివరించింది. ప్రత్యామ్నాయ ఎరువులు, నానో యూరియా, నానో డిఎపి, మరియు సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది.

రైతుల పంట భద్రతపై దృష్టి సారిస్తూ  ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ఆర్థిక సర్వే ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇది ప్రకృతి వైపరీత్యాలు, పురుగులు లేదా వ్యాధుల కారణంగా పంట నష్టాలనుంచి భద్రతను కల్పిస్తుంది. రైతులకు ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది. ఈ పథకం రైతుల జీవనోపాధులను పరిరక్షిస్తుంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాంకేతికతల అమలును  ప్రోత్సహిస్తుంది. పీ ఎం ఎఫ్ బి వై రైతుల నమోదు పరంగా ప్రపంచంలో అతిపెద్ద పంట బీమా పథకం, బీమా ప్రీమియం పరంగా మూడవ అతిపెద్ద పథకం. ఈ పథకం అన్నినిరోధించలేని ప్రకృతి వైపరీత్యాల నుండి విత్తే ముందు నుండి పంట కోత తర్వాత వరకుపంటలకు భీమాను రైతులకు అందిస్తుంది. 2022-23లో 500.2 లక్షల హెక్టార్లతో పోలిస్తే 2023-24లో  బీమా విస్తరణ మొత్తం 610 లక్షల హెక్టార్లకు చేరుకుంది. 2016-17 నుండి మొత్తం 5549.40 లక్షల రైతు దరఖాస్తులు ఈ పథకం కింద బీమా కవర్ చేయబడ్డాయి మరియు ₹150589.10 కోట్లు క్లెయిమ్‌లుగా చెల్లించబడ్డాయి.

***


(Release ID: 2035455) Visitor Counter : 610