ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎన్ఇపి 2020 యువతను 21వ శతాబ్దపు విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి ఉత్పన్నమయ్యే సవాళ్లను, అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధం చేస్తుంది.


భారతదేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో కూడిన పాఠశాల విద్యా వ్యవస్థ వివిధ సామాజిక-ఆర్థిక నేపథ్యాలకు చెందిన సుమారు 26 కోట్ల మంది విద్యార్థులకు చదువు అందిస్తోంది

దిశ మార్చే ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ (ఇ సి సి ఇ) కార్యక్రమం 'పోషణ్ భీ పధాయ్ భీ' కార్యక్రమం ప్రారంభం

రాబోయే ఐదేళ్లలో మొత్తం 613 ఫంక్షనల్ డైట్ లు డైట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అప్ గ్రేడ్
దేశవ్యాప్తంగా 5116 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కె జి బి వి ) లో విద్యను అభ్యసిస్తున్న 7.07 లక్షల మంది బాలికలు.

పాఠశాల బోర్డులన్నీ ఒకే విధంగా పని చేసేలా విధాన సిఫార్సులకు రూపకల్పన

2025 ఆర్థిక సంవత్సరంలో 10,080 పిఎంశ్రీ స్కూళ్లకు రూ.5942.21 కోట్లు మంజూరుకు ఆమోదం

2024 ఆర్థిక సంవత్సరంలో (2023 డిసెంబర్ వరకు) పి ఎం పోషణ్ పథకం కింద 10.67 లక్షల పాఠశాలల్లో 11.63 కోట్ల మంది పిల్లలకు ప్రయోజనం

2019 ఆర్థిక సంవత్సరం నుంచి 2024 ఆర్థిక సంవత్సరం వరకు (2024 మార్చి వరకు) స్కిల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి 29,342 పాఠశాలలు

Posted On: 22 JUL 2024 2:39PM by PIB Hyderabad

2020 లో ప్రారంభించిన జాతీయ విద్యా విధానం (ఎన్ఇపి) విద్యపై సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను కలిగి ఉండటమే కాకుండా, 21 వ శతాబ్దం విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుండి ఉత్పన్నమయ్యే సవాళ్లు , అవకాశాలను స్వీకరించడానికి భారతదేశ యువతను సిద్ధం చేసే విధాన పత్రంగా ఉందని కేంద్ర ఆర్థిక,  కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2023-24 పేర్కొంది.

భారతదేశంలో ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలతో కూడిన పాఠశాల విద్యా వ్యవస్థ వివిధ సామాజిక-ఆర్థిక నేపథ్యాలకు చెందిన సుమారు 26 కోట్ల మంది విద్యార్థులకు విద్యావసరాలు తీరుస్తోందని సర్వే పేర్కొంది.   3-18 సంవత్సరాల వయస్సు గల అభ్యాసకులందరికీ అధిక-నాణ్యమైన విద్యను అందించడానికి, భారతీయ సంస్కృతి మూలాల లోని విద్యా వ్యవస్థను సృష్టించడానికి , భారతదేశాన్ని ప్రపంచ విజ్ఞాన తిరుగులేని శక్తిగా మార్చే సామర్థ్యాన్ని ఎన్ఇపి 2020 కలిగి ఉందని సర్వే పేర్కొంది. 

పోషకాహారం , చదువు రెండూ ('పోషణ్ భీ పధాయ్ భీ' )

జాతీయ విద్యావిధానం 2020 మార్గదర్శకాలకు అనుగుణంగా 2023 మేలో 'పోషణ్ భీ పధాయ్ భీ' (పీబీపీబీ)ను ప్రారంభించినట్లు సర్వే పేర్కొంది. ఇది అంగన్ వాడీ కేంద్రాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద, సార్వత్రిక, అధిక-నాణ్యత గల ప్రీస్కూల్ నెట్ వర్క్ ను అభివృద్ధి చేయడంలో భారతదేశానికి సహాయపడే ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ (ఇసిసిఇ) కార్యక్రమం.

మొదటిసారిగా, 0-3 సంవత్సరాల ప్రారంభ ఉద్దీపనను ఒక ప్రభుత్వ కార్యక్రమం ద్వారా అమలు చేస్తున్నట్లు సర్వే ప్రముఖంగా తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి చిన్నారికి రోజూ కనీసం రెండు గంటల పాటు నాణ్యమైన ప్రీస్కూల్ బోధన అందించనున్నారు. దివ్యాంగ పిల్లలకు ప్రత్యేక మద్దతుతో సహా 0-3 సంవత్సరాల , 3-6 సంవత్సరాల పిల్లల అభివృద్ధి మైలురాళ్లను లక్ష్యంగా చేసుకున్న ఆట-ఆధారిత, కార్యాచరణ ఆధారిత అభ్యాస బోధన కోసం జాతీయ ఇసిసిఇ టాస్క్ ఫోర్స్ సిఫార్సులను అన్ని రాష్ట్రాలు అనుసరిస్తాయని సర్వే తెలిపింది.

 

అంగన్ వాడీల దేశవ్యాప్త వెబ్ ను బలోపేతం చేయడం..

మెదడు ఎదుగుదలలో 85 శాతం 6 సంవత్సరాల వయస్సులోనే జరుగుతుందని ప్రపంచవ్యాప్త ఆధారాలను పరిగణనలోకి తీసుకుంటే, అంగన్ వాడీ పర్యావరణ వ్యవస్థ మన పిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి కీలకమైన యాక్సెస్ పాయింట్ గా మారుతుందని సర్వే పేర్కొంది. అంగన్ వాడీల ద్వారా పిబిపిబిని సాధించడానికి, అధిక-నాణ్యత మౌలిక సదుపాయాలు, ఆట పరికరాలు , సుశిక్షితులైన అంగన్ వాడీ కార్యకర్తలు / ఉపాధ్యాయులతో వాటిని బలోపేతం చేయాలి. దీనికి సంబంధించి, 40,000 మంది మాస్టర్ ట్రైనర్ల ద్వారా అంగన్ వాడీ వర్కర్లందరికీ కార్యకలాపాలు, ఆటలు స్వదేశీ , డిఐవై బొమ్మల వాడకంతో సహా ఇసిసిఇ సూత్రాలపై శిక్షణ ఇస్తారు. జనవరి 2024 నాటికి, 25 రాష్ట్రాలు , 182 జిల్లాల పరిధిలో 95 శిక్షణా కార్యక్రమాల ద్వారా 3735 మంది రాష్ట్ర స్థాయి మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చినట్లు సర్వే పేర్కొంది.

ఎన్ఇపి 2020 లక్ష్యాలు , విధానాలను కార్యాచరణలోకి తెచ్చి వాటిని పురోగతి వైపు నడిపించేందుకు  పాఠశాల విద్యలో ప్రభుత్వం తెచ్చిన కొన్ని ప్రధాన పథకాలు / చొరవలు:

1.సమగ్ర శిక్షా అభియాన్

నిశిత:అన్ని స్థాయిల్లోని ఉపాధ్యాయులను కవర్ చేసేలా విస్తరించిన ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్.  నిశిత ఇ సి సి ఇ లో 1,26,208 మంది మాస్టర్ ట్రైనర్లు సర్టిఫై అయ్యారు. 

పాఠశాల విద్య, ఉపాధ్యాయ విద్యకు మార్గనిర్దేశం చేసే మొత్తం 613 జిల్లా స్థాయి సంస్థలను (ఫంక్షనల్ డిస్ట్రిక్ట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (డీఐఇటీలు) లను వచ్చే ఐదేళ్లలో డీఐఇటీలుగా అప్ గ్రేడ్ చేయనున్నారు. ఈ మొదటి విడత అప్ గ్రేడేషన్ (ఎఫ్ వై 24)లో దేశవ్యాప్తంగా 125 డీఐఇటీలకు రూ.92,320.18 లక్షలు మంజూరయ్యాయి.

విద్యా ప్రవేశ్:  ప్రీస్కూల్ విద్యతో నిమిత్తం లేకుండా గ్రేడ్-1 విద్యార్థులందరికీ 3 నెలల ఆట ఆధారిత 'స్కూల్ ప్రిపరేషన్ మాడ్యూల్' అయిన విద్యా ప్రవేశ్ ను 36 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేశాయి.  2023-24లో 8.46 లక్షల పాఠశాలల నుంచి 1.13 కోట్ల మంది విద్యార్థులను కవర్ చేశారు. 

దేశవ్యాప్తంగా 5116 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) ప్రస్తుతం 7.07 లక్షల మంది బాలికలు చదువుతున్నారు.

ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు సమ్మిళిత విద్య (సీడబ్ల్యూఎస్ఎన్):  ప్రీ ప్రైమరీ నుంచి పన్నెండో తరగతి వరకు ప్రత్యేక అవసరాలున్న 18.50 లక్షల మంది పిల్లలకు ఈ పథకం అమలు చేశారు. 

నేషనల్ అసెస్ మెంట్ సెంటర్- పరాఖ్:  దీని కింద, అన్ని పాఠశాల బోర్డులలో సమానత కోసం భాగస్వాములతో చర్చ అనంతరం పాలసీ సిఫారసు లను రూపొందిస్తున్నారు. 

2.దీక్ష:  దీక్ష కార్యక్రమం కింద అభ్యాసకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మొదలైన వారి కోసం ఉచిత మొబైల్ అప్లికేషన్ , వెబ్ పోర్టల్ లను 36 భారతీయ , విదేశీ భాషలలో విడుదల చేశారు.  దీక్ష కింద 1.71 కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్లకు 3.53 లక్షల ఇ-కంటెంట్ అందుబాటులో ఉంది.

3. పిఎంశ్రీ:  పిఎంశ్రీ కింద, 3 దశల పాఠశాల ఎంపిక పూర్తయింది,  32 రాష్ట్రాలు/ యుటి లు/కె వి ఎస్/ఎన్ వి ఎస్ నుంచి నుండి 10,858 పాఠశాలలు ఎంపిక అయ్యాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో 10,080 పిఎంశ్రీ పాఠశాలలకు రూ.5942.21 కోట్లు మంజూరయ్యాయి.

4.పిఎం పోషణ్:  ఈ పథకం ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఒక పూట వండిన వేడి  భోజనం అందిస్తున్నారు. ఈ పథకం 2024 ఆర్థిక సంవత్సరంలో (2023 డిసెంబర్ వరకు) 10.67 లక్షల పాఠశాలల్లోని 11.63 కోట్ల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చింది.

5. నేషనల్ మీన్స్-మెరిట్ స్కాలర్ షిప్ స్కీమ్:  ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు వారు మధ్యలో చదువు మానకుండా అరికట్టడానికి ఈ పథకం కికింద స్కాలర్ షిప్ లను అందిస్తారు. 2023-24 సంవత్సరంలో 2,50,089 మంది విద్యార్థులకు రూ.300.10 కోట్లు మంజూరయ్యాయి.

విద్యాంజలి: పాఠశాల వాలంటీర్ కార్యక్రమం

విద్యాంజలి చొరవ సమగ్ర సమాజ భాగస్వామ్యం ద్వారా,  సబ్జెక్ట్ అసిస్టెన్స్ మెంటరింగ్,  ఆధునిక ఎలక్ట్రానిక్స్ , డిజిటల్ పరికరాలను అందించడంతో సహా వివిధ డొమైన్లలో స్వచ్ఛంద విరాళాలను అందించడం ద్వారా 1.44 కోట్లకు పైగా విద్యార్థుల విద్యా అనుభవాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది.

పాఠశాల మౌలిక సదుపాయాలలో పురోగతి

అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులపై నివేదిక ఇస్తూ,  2012-13లో 88.1 శాతంగా ఉన్న బాలికల మరుగుదొడ్లు 2022-23లో 97 శాతం ఉన్నాయని సర్వే పేర్కొంది. బాలుర మరుగుదొడ్లు 2012-13లో 67.2 శాతం ఉండగా, 2022-23 నాటికి 95.6 శాతానికి పెరిగాయి. 2012-13లో 36.3 శాతంగా ఉన్న చేతులు కడుక్కునే సౌకర్యం 2022-23 నాటికి 94.1 శాతానికి పెరిగింది. విద్యుత్ సౌకర్యం ఉన్న పాఠశాలలు కూడా 2012-13లో 54.6 శాతం నుంచి 2022-23 నాటికి 91.7 శాతానికి పెరిగాయి. అన్ని పాఠశాలల్లో ఇంటర్నెట్ వ్యాప్తి 2012-13లో 6.2 శాతం నుంచి 2022-23లో 49.7 శాతానికి, కంప్యూటర్లు 2012-13లో 22.2 శాతం నుంచి 2022-23 నాటికి 47.7 శాతానికి పెరిగాయి.

వృత్తి విద్య

సాధించిన పురోగతి పరంగా, 2019 నుండి 2024 ఆర్థిక సంవత్సరం  మార్చి 2024 వరకు 29,342 పాఠశాలలు స్కిల్ ఎడ్యుకేషన్ కిందకు వచ్చాయి. 2024 ఆర్థిక సంవత్సరం వరకు 88 ఉద్యోగ అవకాశాలు ఉన్న 22 రంగాలు స్కిల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి వచ్చాయి.

 

***


(Release ID: 2035451) Visitor Counter : 205