ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలిగా తిరిగి ఎన్నికైన ఉర్సులా వాన్ డెర్ లేయేన్ ను అభినందించిన ప్రధాన మంత్రి

Posted On: 19 JUL 2024 11:48AM by PIB Hyderabad

యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలిగా ఉర్సులా వాన్ డెర్ లేయేన్ తిరిగి ఎన్నికైన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెను ఈ రోజు అభినందించారు.

 

 

భారతదేశం, యూరోపియన్ యూనియన్ ల  వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దృఢతరం చేసేందుకు కలసి పని చేయాలని తాను ఎదురు చూస్తున్నానని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

 

ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు:

 

‘‘యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలుగా తిరిగి ఎన్నికైన సందర్భంగా @vonderleyen , మీకు అభినందనలు. ప్రపంచ హితం దృష్ట్యా భారతదేశం - యూరోపియన్ యూనియన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపరచడానికి మీతో కలసి పని చేయాలని నేను ఎదురుచూస్తున్నాను.’’

 

 

***

DS/RT



(Release ID: 2034328) Visitor Counter : 65