హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎన్‌సిఒఆర్‌డి 7వ శిఖర స్థాయి సమావేశానికి 2024 జులై 18న గురువారం న్యూ ఢిల్లీలో అధ్యక్షత వహించనున్న కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా


జాతీయ మత్తు మందుల హెల్ప్ లైన్ ‘మానస్’ ను , శ్రీనగర్ లోని ఎన్‌సిబి జోనల్ ఆఫీసును ప్రారంభించనున్న హోం శాఖ మంత్రి

ఎన్‌సిబి ‘వార్షిక నివేదిక 2023’ ను, ‘నషా ముక్త్ భారత్’ అనే అంశంపై రూపొందిన సంగ్రహ గ్రంథాన్ని శ్రీ అమిత్ షా ఆవిష్కరిస్తారు

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం డ్రగ్స్ భూతాన్ని అణచివేయడంలో, డ్రగ్ ట్రాఫికింగ్ తో పోరాటం జరపడంలో ‘సహనానికి ఎంతమాత్రం తావు లేని విధానాన్ని’ అమలు చేస్తున్నది

సంస్థాగత నిర్మాణాన్ని బలపరచడం, నార్కో ఏజెన్సీలన్నిటి మధ్య సమన్వయం నెలకొల్పడం, ప్రజలలో విస్తృతమైన చైతన్యాన్ని తీసుకు వచ్చేందుకు ఒక ప్రచార ఉద్యమాన్ని నడపడం.. ఈ మూడు అంశాల వ్యూహాన్ని దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలుచేస్తూ, భారతదేశంలో 2047 కల్లా డ్రగ్స్ ను పారదోలాలనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లక్ష్యాన్ని సాధించనుంది


Posted On: 15 JUL 2024 6:01PM by PIB Hyderabad

కేంద్ర హోంసహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా గురువారం, 2024 జులై 18న్యూ ఢిల్లీ లో జరగనున్న నార్కో-కోఆర్డినేషన్ సెంటర్ (ఎన్‌సిఒఆర్‌డి) 7వ శిఖర స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు.  మాదక్ పదార్థ్ నిషేధ్ ఆసూచన కేంద్ర.. ఎమ్ఎఎన్ఎఎస్(మానస్) పేరు తో జాతీయ నార్కోటిక్స్ హెల్ప్ లైన్ ను హోం మంత్రి ప్రారంభించనున్నారు.  శ్రీనగర్ లో ఏర్పాటైన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) జోనల్ ఆఫీసును మంత్రి ప్రారంభించనున్నారు.  ఎన్‌సిబి వార్షిక నివేదిక 2023’ ను, నషా ముక్త్ భారత్’ అంశంపై సంగ్రహ గ్రంథాన్ని కూడా శ్రీ అమిత్ షా ఆవిష్కరించనున్నారు. భారతదేశంలో డ్రగ్స్ వినియోగాన్ని నివారించడంలోడ్రగ్స్ దొంగచాటు క్రయ విక్రయాలను అడ్డుకోవడంలో కృషి చేస్తున్న వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీల ప్రయత్నాలను సమన్వయ పరచడం, ఏకతాటి మీదకు తీసుకు రావడం ఈ సమావేశం లక్ష్యం.

 

 

డ్రగ్స్ భూతాన్ని అణచివేయడంలోడ్రగ్స్ దొంగచాటు క్రయ విక్రయాలను ఎదుర్కోవడంలో సహనానికి ఎంతమాత్రం తావు లేని విధానాన్ని’ (జీరో టాలరెన్స్ పాలిసి) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం తీసుకువచ్చింది.  సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టపరచడంనార్కో సంబంధ ఏజెన్సీలన్నిటి మధ్య సమన్వయాన్ని నెలకొల్పడంప్రజలలో చైతన్యాన్ని పెంచేందుకు పెద్ద ఎత్తున ప్రచార ఉద్యమాన్ని నిర్వహించడం అనే మూడు సూత్రాల వ్యూహాన్ని అమలు చేస్తూ 2047కల్లా డ్రగ్స్ కు చోటు ఉండని భారతదేశాన్ని ఆవిష్కరించాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లక్ష్యాన్ని హోం శాఖ సాధించనుంది.

 

 

ఈ వ్యూహంలో భాగంగా చేపట్టే చర్యల్లో ఈ క్రిందివి కూడా ఉన్నాయి:

·         నాలుగు అంచెల వ్యవస్థ లో అన్ని స్థాయిలలో సంబంధికులందరితో క్రమం తప్పక ఎన్‌సిఒఆర్‌డి  సమావేశాలను నిర్వహించడం.

·         కార్యకలాపాలుఉత్తమ విధానాలను వెల్లడి చేయడానికే అచ్చంగా ఒక కేంద్రీకృత ఎన్‌సిఒఆర్‌డి (NCORD) పోర్టల్ ను ప్రారంభించడం.

  • ఇతర నేరాలతోఅంతర్జాతీయ ప్రభావాలతో కూడిన అతి ప్రధానమైన కేసుల విషయంలో ఏ యే రకాలైన చర్యలను తీసుకోవాలనే అంశాన్ని సమన్వయ పరచడం కోసం ఒక సంయుక్త సమన్వయ సంఘాన్ని ఏర్పాటు చేయడం.
  • ప్రతి రాష్ట్రంలో/ కేంద్రపాలిత ప్రాంతంలో యాంటి-నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ (ఎఎన్‌టిఎఫ్)ను ఏర్పాటు చేయడం.

 

·         మత్తు మందులను ధ్వంసం చేయడానికి సంబంధించిన ఉద్యమానికి అగ్ర ప్రాధాన్యాన్ని ఇవ్వడం.

·         నార్కో సంబంధ నేరగాళ్ళ కోసం ఎన్ఐడిఎఎఎన్ (NIDAAN) పోర్టల్ ను ప్రారంభించడం.

·         డ్రగ్స్ ఆచూకీని కనిపెట్టడం కోసం జాగిలాల దళాలను ఏర్పాటు చేయడం.

·         ఫోరెన్సిక్ సామర్థ్యాలను దృఢతరం చేయడం.

·         ప్రత్యేక ఎన్‌డిపిఎస్ న్యాయస్థానాలనుఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడం.

·         డ్రగ్స్ బారిన పడకుండా ప్రజలకు అవగాహనను కలిగించడానికి ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ (ఎన్ఎమ్‌బిఎ) ను నడపడం.

 

రాష్ట్రాలకుదేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు మధ్య మేలైన సమన్వయం కోసం ఎన్‌సిఒఆర్‌డి యంత్రాంగాన్ని 2016లో స్థాపించడమైంది.  దీనిని నాలుగు అంచెల వ్యవస్థ గా 2019లో మరింత పటిష్ట పరచడమైంది.  దీనిలో ఉన్నత స్థాయిలో  చెందిన ఎన్‌సిఒఆర్‌డి కమిటి ఉంది;  ఈ కమిటీకి కేంద్ర హోం శాఖ కార్యదర్శి నేతృత్వం వహిస్తున్నారు.  ఎగ్జిక్యూటివ్ స్థాయి ఎన్‌సిఒఆర్‌డి కమిటీ కి దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి, రాష్ట్ర స్థాయి ఎన్‌సిఒఆర్‌డి కమిటీలకు చీఫ్ సెక్రటరీ లు, జిల్లా స్థాయి ఎన్‌సిఒఆర్‌డి కమిటీలకు జిల్లా మేజిస్ట్రేట్ లు నేతృత్వం వహిస్తున్నారు.

 

**


(Release ID: 2033773) Visitor Counter : 56