ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నేపాల్ ప్రధాని గా నియమితులైన శ్రీ కె.పి. శర్మ ఓలి ని అభినందించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

నాడు పోస్టు చేయడమైనది: 15 JUL 2024 11:39AM by PIB Hyderabad

నేపాల్ ప్రధాని గా నియమితులైన శ్రీ కె.పి. శర్మ ఓలి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారతదేశానికి, నేపాల్ కు మధ్య ఉన్న ప్రగాఢమైన మైత్రి బంధాలను మరింత దృఢతరం చేయడం కోసం, ఉభయ దేశాల పరస్పర ప్రయోజనకర సహకారాన్ని విస్తరింపచేయడం కోసం కలసి పనిచేయాలన్న ఆకాంక్షనను  ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.

శ్రీ నరేంద్ర మోదీ ‘ఎక్స్’ లో ఈ విధంగా పేర్కొన్నారు :

‘‘శ్రీ @kpsharmaoli , నేపాల్ కు ప్రధాని గా మీరు నియమితులైన సందర్బంగా మీకు అభినందనలు. మన ఇరు దేశాల మధ్య ఉన్న ప్రగాఢ మైత్రీ సంబంధాలను మరింతగా దృఢతరం చేయడం కోసం,  మన ఉభయ దేశాల ప్రజల ప్రగతి కోసం, సమృద్ధి కోసం మన మధ్య పరస్పర ప్రయోజనకర సహకారాన్ని విస్తరింపచేయడం కోసం మీతో కలసి పని చేయాలని నేను ఎదురుచూస్తున్నాను. @PM_nepal_’’ .

 

*****
DS/SR

(రిలీజ్ ఐడి: 2033531) సందర్శకుల సూచీ సంఖ్య : : 104