ప్రధాన మంత్రి కార్యాలయం
వైద్యుల దినం సందర్భం గా వైద్యుల కు శుభాకాంక్షలుతెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
01 JUL 2024 9:45AM by PIB Hyderabad
ఈ రోజు న వైద్యుల దినం సందర్భాన్ని పురస్కరించుకొని వైద్యుల కు శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియ జేశారు. భారతదేశం లో ఆరోగ్య సంరక్షణ రంగం లో మౌలిక సదుపాయాల ను మెరుగు పరచడాని కి ప్రభుత్వం కంకణం కట్టుకొంది; వైద్యులు వారు అర్హులు అయినటువంటి యధోచిత గౌరవాన్ని పొందేటట్లు ప్రభుత్వం పూచీ పడుతుంది కూడాను అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ లో -
‘‘ఇవే #DoctorsDay శుభాకాంక్షలు. ఇది మన ఆరోగ్య సంరక్షణ రంగం లో శ్రమిస్తున్న వీరుల యొక్క సాటి లేనటువంటి సమర్పణ భావాన్ని మరియు కరుణ ను గౌరవించుకొనేటటువంటి రోజు. వారు ప్రశంసాయోగ్యమైనటువంటి నైపుణ్యం తో అత్యంత జటిలమైన సవాళ్ళ ను ఎదుర్కొనగలుగుతున్నారు. భారతదేశం లో ఆరోగ్య సేవల రంగం లో మౌలిక సదుపాయాల ను మెరుగు పరచడం తో పాటు వైద్యులు విస్తృత గౌరవానికి పాత్రులు, వారు యథోచిత గౌరవాన్ని పొందేటట్లు గా పూచీపడడానికి కూడా మా ప్రభుత్వం సంపూర్ణం గా కట్టుబడి ఉంది’’ అని పేర్కొన్నారు.
***
DS/SR
(Release ID: 2029924)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam