ఆయుష్

శ్రీనగర్‌లో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు నేతృత్వం వహించనున్న ప్రధాన మంత్రి


యోగా సాధన ద్వారా ప్రపంచ ఆరోగ్యం శ్రేయస్సును ప్రోత్సహించే సందేశాన్ని ఇస్తున్నఈ ఏడాది ఇతివృత్తం"స్వీయ, సమాజం కోసం యోగా"

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గ్రామ సర్పంచులతో సంభాషించి యోగాను ప్రజా ఉద్యమంగా చేయాల్సిందిగా కోరారు.

"అంతరిక్షం కోసం యోగా" వంటి ప్రధాన కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా వేడుకలు

Posted On: 20 JUN 2024 5:33PM by PIB Hyderabad

21 జూన్ 2024 న జరగనున్న 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీనగర్‌లోని ఎస్‌కేఐసీసీలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు నేతృత్వం వహించనున్నారు. ఈ ఏడాది ఇతివృత్తం"స్వీయసమాజం కోసం యోగా" వ్యక్తిగత శ్రేయస్సుసామాజిక సామరస్యం రెండింటినీ పెంపొందించడంలో యోగా కీలక పాత్రను తెలుపుతుంది. జమ్ము,కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హాఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా)ఆరోగ్యకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్ రావ్ గణపతిరావు జాదవ్ తో పాటు అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

 

యోగా సాధన ద్వారా ప్రపంచ ఆరోగ్యంశ్రేయస్సును పెంపొందించాలనే సందేశాన్ని అందించే వేలాది మంది సాధకులను ఏకతాటిపైకి తీసుకురావడమే ఈ కార్యక్రమ లక్ష్యం. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి కామన్ యోగా ప్రోటోకాల్ సెషన్ లో పాల్గొని ప్రసంగించనున్నారు. శారీరకమానసికఆధ్యాత్మిక ఎదుగుదలను పెంపొందించడంలో యోగా ప్రాముఖ్యతను తెలియజేయనున్నారు.

యోగా ప్రయోజనాలను సమ్మిళితం చేయడానికిప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గ్రామ ప్రధానులందరికీ ఒక లేఖ కూడా రాశారు. "క్షేత్రస్థాయిలో యోగాచిరుధాన్యాలపై మరింత అవగాహన కల్పించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్నిప్రజా ఉద్యమంగా మార్చాలని కోరుతున్నాను" అని అందులో పేర్కొన్నారు. ఇది వరకు యోగా దినోత్సవాల సందర్భంగా యోగా కార్యక్రమాలను ఉద్దేశిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాసిన లేఖలు గ్రామ పంచాయితీలుఅంగన్ వాడీ కేంద్రాలుఆరోగ్య కేంద్రాల్లో యోగా సాధనపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయి.

 

కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్ రావ్ గణపతిరావ్ జాదవ్ఆయుష్ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచాజమ్మూకశ్మీర్ ఉన్నతాధికారులతో కలిసి శ్రీనగర్ లో జూన్ 21న జరుగనున్న ప్రధాన కార్యక్రమ వేదిక ఎస్‌కెఐసిసిని సందర్శించారు. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. యోగా దినోత్సవ ప్రధాన కార్యక్రమాన్ని యోగా ఔత్సాహికులందరికీ ఉత్తేజకర అనుభూతిని పొందేందుకు సన్నాహాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

2015 లో అంతర్జాతీయ యోగ దినోత్సవం ప్రారంభమైనప్పటి యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలను ప్రఖ్యాత ప్రదేశాలైన దిల్లీలోని కర్తవ్య పథ్చండీగఢ్డెహ్రాడూన్రాంచీలక్నోమైసూర్ న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయాల్లో పాల్గొన్నారు.

 

"అంతరిక్షం కోసం యోగా" అనే ముఖ్యమైన కార్యక్రమంతో ఈ సంవత్సరం వేడుకలు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) అన్ని కేంద్రాలుయూనిట్లు కామన్ యోగా ప్రోటోకాల్ సాధనపై కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూన్ 21న జరిగే కామన్ యోగా ప్రోటోకాల్ సాధనలో ఇస్రోకు చెందిన స్వయం ప్రతిపత్తి సంస్థలు కూడా పాల్గొంటాయి. దీనితో పాటు గగన్ యాన్ ప్రాజెక్టు బృందం కూడా క్రియాశీలకంగా పాల్గొననుంది. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి.

 

ప్రపంచవ్యాప్తంగా జరిగే వేడుకల్లోవిదేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలుభారత్ కు చెందిన వివిధ సంస్థలు పాల్గొంటాయి. ఇది యోగా విస్తృతిని ప్రతిబింబిస్తుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సహకారంతో చేపట్టిన "అంతరిక్షం కోసం యోగా" వంటి కార్యక్రమాలను ఈ ఏడాది నిర్వహిస్తున్నారు.

 

ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీనగర్‌లోని దాల్ సరస్సు ఒడ్డున వివిధ రంగాలకు చెందిన 7,000 మందికి పైగా ప్రజలు ప్రధానితో కలిసి యోగా కార్యక్రమంలో పాల్గొంటారు.

 

ఆయుష్ కార్యదర్శిశ్రీ వైద్య రాజేష్ కొటేచా ఒక సమావేశంలో మాట్లాడుతూఆరోగ్యంసామాజిక విలువలుసమాజ భావనను ప్రోత్సహించడంలో అంతర్జాతీయ యోగ దినోత్సవ పాత్రను ఉద్ఘాటించారు.

 

యోగా దినోత్సవ వేడుకల్లో 'సంపూర్ణ ప్రభుత్వవిధానంలో వివిధ ప్రభుత్వ విభాగాల సమన్వయంరాష్ట్ర ప్రభుత్వాలుకేంద్రపాలిత ప్రాంతాల క్రియాశీల భాగస్వామ్యం ఉన్నాయి. సంపూర్ణ ఆరోగ్యంపై యోగా ప్రభావాన్ని ప్రదర్శిస్తూ జాతీయ ఆయుష్ మిషన్ బృందం దేశవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

 

ఆయుష్ మంత్రిత్వ శాఖదిల్లీలోని ఎన్‌డిఎంసి (న్యూఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్)ఎఎస్ఐ (ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా) డిడిఎ (ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ)తో కలిసి 21 జూన్ 2024 న సామూహిక యోగా కార్యక్రమాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. ప్రజలందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేందుకుఆయుష్ మంత్రిత్వ శాఖ మైగవ్మైభారత్ ప్లాట్‌ఫామ్ లలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసిసిఆర్) భాగస్వామ్యంతో "కుటుంబంతో యోగా" వీడియో కాంటెస్ట్ తో పాటు అనేక పోటీలను కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ పోటీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుటుంబాలను ఐడివై 2024 వేడుకలలో పాల్గొనడానికి ప్రోత్సహిస్తుంది. దీని ద్వారా కుటుంబ బంధాలను బలోపేతం చేస్తుంది. ఇందులో పాల్గొనేందుకు చివరి తేదీ 30 జూన్ 2024

 

#YogaWithFamily వీడియో కాంటెస్ట్ లో పాల్గొనేవారు యోగా ద్వారా ఆరోగ్యంఐక్యత సందేశాన్ని ఇవ్వాలి. ఇందులో పాల్గొనే వారు ఉత్తేజకరమైన బహుమతులను గెలుచుకునే అవకాశం ఉంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగ ప్రపంచ వ్యాప్త ప్రచారం కోసం సామాజిక మాధ్యమాల్లో #InternationalDayofYoga2024, #YogaForSelfAndSociety, #YogaWithFamily #IDY2024 హ్యాష్‌ట్యాగ్ లను సృష్టించింది. ప్రజలందరూ వీటిని అనుసరించిపాల్గొనాల్సిందిగా కోరింది.

***



(Release ID: 2027262) Visitor Counter : 17