పార్లమెంటరీ వ్యవహారాలు
పద్దెనిమిదో లోక్ సభ యొక్క ఒకటో సమావేశాలు 2024 జూన్24 వ తేదీ నుండి జులై 3 వ తేదీ వరకు జరుగనున్నాయి
Posted On:
12 JUN 2024 1:42PM by PIB Hyderabad
పద్దెనిమిదో లోక్ సభ యొక్క ఒకటో సమావేశాలు 2024 వ సంవత్సరం జూన్ 24 వ తేదీ నుండి 2024 జులై 3 వ తేదీ వరకు జరుగనున్నాయి. లోక్ సభ కు క్రొత్త గా ఎన్నికైన సభ్యుల ప్రమాణం/ప్రతిజ్ఞ, సభాపతి యొక్క ఎన్నిక, భారతదేశం మాన్య రాష్ట్రపతి యొక్క ప్రసంగం మరియు ఆ ప్రసంగం పైన చర్చ వంటివి ఈ సమావేశాల లో చోటు చేసుకోనున్నాయి. ఈ వివరాల ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ కిరెన్ రిజిజూ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ (ఇదివరకు ‘ట్విటర్’) లో నమోదు చేసిన ఒక సందేశం లో తెలియజేశారు. రాజ్య సభ యొక్క 264 వ సమావేశాలు 2024 జూన్ 27 వ తేదీ న మొదలై 2024 జులై 3 వ తేదీ నాడు ముగుస్తాయి అని కూడా మంత్రి తెలిపారు.
**
(Release ID: 2024749)
Visitor Counter : 152
Read this release in:
Hindi
,
Hindi_MP
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam
,
Manipuri
,
Assamese
,
Bengali
,
English
,
Khasi
,
Urdu