విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన శ్రీ మ‌నోహ‌ర్ లాల్

Posted On: 11 JUN 2024 11:38AM by PIB Hyderabad

కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా శ్రీ మ‌నోహ‌ర్ లాల్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆయ‌న గృహ‌నిర్మాణ‌, ప‌ట్ట‌ణాభివృద్ధి వ్య‌వ‌హారాల శాఖ మంత్రిగా కూడా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మంతో విద్యుత్ శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ పంక‌జ్ అగ‌ర్వాల్ పాల్గొన్నారు. ఆయ‌న‌తోపాటు ప‌లువురు సీనియ‌ర్ అధికారులు మంత్రికి స్వాగ‌తం ప‌లికారు. 
 

 

గ‌త ప్ర‌భుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా ప‌ని చేసిన శ్రీ రాజ్ కుమార్ సింగ్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని మంత్రి శ్రీ మ‌నోహ‌ర్ లాల్ కు స్వాగ‌తం ప‌లికారు. విద్యుత్ శాఖ స‌హాయ మంత్రి శ్రీ శ్రీపాద్ యెసో నాయ‌క్ కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. 



విద్యుత్ శాఖ‌కు సంబంధించిన ప‌లు అంశాల‌ను అధికారులు మంత్రికి సంక్షిప్తంగా వివ‌రించారు. బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం కేంద్ర‌మంత్రి శ్రీ మ‌నోహ‌ర్ లాల్ ఆధ్వ‌ర్యంలో దేశంలో విద్యుత్ స‌ర‌ఫ‌రా గురించి స‌మీక్షా స‌మావేశం జ‌రిగింది. 

***
 


(Release ID: 2024557) Visitor Counter : 69