రైల్వే మంత్రిత్వ శాఖ
రైల్వేలు, సమాచార ప్రసారాలు, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అశ్వనీ వైష్ణవ్
చౌక ధరలతో సౌకర్యవంతమైన రవాణా మార్గంగా రైల్వేలను మార్చడమే ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యం: అశ్వనీ వైష్ణవ్
గడచిన పదేళ్లలో ఆధునికీకరణ, కొత్త రైళ్లు, స్టేషన్ల పునరుద్ధరణ, విద్యుద్దీకరణ ద్వారా రైల్వే కొత్త సొబగులు అద్దుకుంది- వైష్ణవ్
Posted On:
11 JUN 2024 3:25PM by PIB Hyderabad
రైల్వేలు, సమాచార ప్రసారాలు, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలకు మంత్రిగా అశ్వనీ వైష్ణవ్ ఈ రోజు రైల్ భవన్ లో ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. రైల్వే బోర్డు సీఈవో, చైర్మన్ జయ వర్మ సిన్హా, ఇతర సీనియర్ రైల్వే అధికారులతో కలసి రైల్ భవన్లో మంత్రికి ఆహ్వానం పలికారు. ఇతర రైల్వే అధికారులు, హౌస్ కీపింగ్ సిబ్బంది మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.

మీడియాను ఉద్దేశించి వైష్ణవ్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ నిర్దేశించిన దీర్ఘకాలిక లక్ష్యాలను సాకారం చేసేందుకు నిబద్దుడై ఉన్నట్టు తెలిపారు. "రైల్వేలతో ప్రధాని మోదీకి ప్రత్యేక అనుబంధం ఉంది. భారతీయ రైల్వేలను సామాన్య ప్రజలకు చౌకగా అందుబాటులో ఉంచుతూ సౌకర్యవంతమైన రవాణా మార్గంగా తీర్చిదిద్దే బాధ్యతను నాకు అప్పగించారు ’’ అని అన్నారు.

జులై 8, 2021న రైల్వే మంత్రిగా మొదటి సారి బాధ్యతలు చేపట్టిన వైష్ణవ్, సరికొత్త ఆశయాలతో రైల్వే మంత్రిగా రెండో పర్యాయాన్ని ప్రారంభించారు. మొదటి పర్యాయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన ఎజెండాకు అనుగుణంగా అనేక పరివర్తనాత్మక ప్రాజెక్టులను ప్రారంభించి, అమలు చేశారు. స్టేషన్ల రూపాంతరీకరణ, కొత్త రైళ్లు ప్రవేశపెట్టడం, స్టేషన్ల పునరుద్ధరణ, కొత్త రైల్వే లైన్లు వేయడం, విద్యుద్దీకరణ తదితరమైన వాటి ద్వారా రైల్వేల్లో మౌలిక సదుపాయాల ఆధునికీకరణ, పునరుద్ధరణ ప్రాజెక్టులు చేపట్టారు.
అశ్వనీ వైష్ణవ్(1970లో జన్మించారు) ఒడిశా నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి అయిన ఆయన సుందర్‌గర్, బాలాసోర్, కటక్ ప్రాంత ప్రజలకు జిల్లా కలెక్టర్ గా సేవలందించారు. ఐఐటీ కాన్పూర్ లో టెక్నాలజీలో మాస్టర్స్, వార్టన్ నుంచి ఎంబీయే పట్టాలు అందుకున్నారు.
ట్విట్టర్: https://twitter.com/AshwiniVaishnaw?s=08
ఇన్ట్సాగ్రామ్: https://www.instagram.com/ashwini.vaishnaw/
***
(Release ID: 2024475)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam