ప్రధాన మంత్రి కార్యాలయం

‘పిఎంఎవై’ కింద 3 కోట్ల అదనపు గ్రామీణ-పట్టణ గృహాలతో కోట్లాది పౌరుల ఆత్మగౌరవం.. ‘జీవన సౌలభ్యం’ ఇనుమడిస్తాయి: ప్రధానమంత్రి

Posted On: 10 JUN 2024 9:54PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అదనంగా 3 కోట్ల గ్రామీణ-పట్టణ గృహాల నిర్మాణంపై నిర్ణయం వల్ల దేశంలో గృహ అవసరాలను తీర్చగలమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. అంతేగాక ప్రతి పౌరుడి  మెరుగైన జీవన ప్రమాణాలకు భరోసా ఇచ్చే దిశగా ప్రభుత్వ నిబద్ధతను ఈ నిర్ణయం సుస్పష్టం చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:

‘‘కోట్లాది భారతీయుల ‘జీవన సౌలభ్యం’, ఆత్మగౌరవానికి ఇదో ఉత్తేజం!...

ప్రధానమంత్రి ఆవాస్ యోజనను మరింత విస్తరించడం ద్వారా అదనంగా 3 కోట్ల గ్రామీణ-పట్టణ గృహాల నిర్మాణానికి మంత్రిమండలి నిర్ణయించింది. దేశంలో గృహావసరాలను తీర్చడంతోపాటు ప్రతి పౌరుడి మెరుగైన జీవన ప్రమాణానికి భరోసా ఇవ్వడంపై ప్రభుత్వ నిబద్ధతను ఈ నిర్ణయం చాటి చెబుతోంది. అలాగే సార్వజనీన వృద్ధి, సామాజిక సంక్షేమంపై మా ప్రభుత్వ చిత్తశుద్ధిని కూడా ‘పిఎంఎవై’ విస్తరణ నిర్ణయం ప్రస్ఫుటం చేస్తుంది’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS



(Release ID: 2023888) Visitor Counter : 67