ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మళ్ళీ ఎన్నికైన సందర్భం లోఅభినందనల ను తెలిపిన యుకె ప్రధాని శ్రీ రుషి సునక్
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతదేశం - యుకెసమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత గా బలపరచుకోవాలన్న తన నిబద్ధత ను పునరుద్ఘాటించారు
యుకె లో త్వరలో ఎన్నికలు జరుగనుండగా ప్రధాన మంత్రి తనశుభాకాంక్షల ను తెలియజేశారు
Posted On:
05 JUN 2024 10:05PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో యునైటెడ్ కింగ్ డమ్ (యుకె) యొక్క ప్రధాని రైట్ ఆనరబుల్ శ్రీ రుషి సునక్ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా సంభాషించారు.
సాధారణ ఎన్నికల లో ప్రధాన మంత్రి విజయం సాధించినందుకు ఆయన కు అభినందనల ను ప్రధాని శ్రీ రుషి సునక్ తెలియ జేశారు. మూడో సారి పదవీబాధ్యలను చేపడుతూ చరిత్ర సృష్టించనున్నందుకు శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ప్రధాని శ్రీ రుషి సునక్ అందించిన హృదయపూర్వకమైన శుభాకాంక్షల కు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ధన్యవాదాలు పలికారు; భారతదేశం-యుకె సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని వివిధ రంగాల లో మరింత గా బలపరచుకోవడం కోసం కలసికట్టుగా పని చేయాలన్న తన వచనబద్ధత ను ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.
యుకె లో త్వరలో ఎన్నికలు జరుగనుండగా ప్రధాన మంత్రి తన శుభాకాంక్షల ను తెలియ జేశారు.
**
(Release ID: 2023525)
Visitor Counter : 70
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam