ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మళ్ళీ ఎన్నిక అయిన సందర్భంలో ఆయన కు అభినందనల ను తెలిపిన యూరోపియన్ కమిశన్ యొక్క ప్రెసిడెంటు ఉర్సులా వాన్డెర్ లేయెన్  


ప్రపంచ హితం కోసం భారతదేశం-ఇయు వ్యూహాత్మకభాగస్వామ్యాన్ని మరింత బలపరచుకోవాలన్న తన నిబద్ధత ను పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

యూరోపియన్ పార్లమెంటు ఎన్నికల కు గాను ప్రధాన మంత్రితన శుభాకాంక్షల ను తెలియ జేశారు

Posted On: 06 JUN 2024 2:16PM by PIB Hyderabad

యూరోపియన్ కమిశన్ యొక్క ప్రెసిడెంటు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ గారు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.

 

సాధారణ ఎన్నికల లో గెలిచినందుకు ప్రధాన మంత్రి కి అభినందనల ను ప్రెసిడెంటు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ గారు తెలియ జేశారు. అంతేకాకుండా, ఆయన యొక్క చారిత్రిక మూడో పదవీ కాలానికి గాను శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. భారతదేశం లో ప్రజాస్వామ్యం మరియు ప్రపంచం లో అన్నింటి కంటే పెద్దవైన ఎన్నికల నిర్వహణ ను కూడ ఆమె ఎంతగానో మెచ్చుకొన్నారు.

 

ప్రెసిడెంటు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ గారికి ఆమె హృదయపూర్వక శుభాకాంక్షల ను తెలియజేసినందుకు గాను ప్రధాన మంత్రి తన కృతజ్ఞత ను వ్యక్తం చేస్తూ, భారతదేశం - ఇయు సంబంధాలు ఉమ్మడి విలువల పైన మరియు సూత్రాల పైన ఆధారపడి దృఢం గా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఈ సంవత్సరం లో ఇండియా - ఇయు వ్యూహాత్మక భాగస్వామ్యాని కి ఇరవయ్యో వార్షికోత్సవం అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ భాగస్వామ్యాన్ని ప్రపంచ హితాన్ని దృష్టి లో పెట్టుకొని మరింత బలపరచడం కోసం నిరంతరం పని చేస్తూ ఉండాలన్న తన నిబద్ధత ను కూడ ఆయన పునరుద్ఘాటించారు.

 

ఈ రోజు న ఆరంభం అవుతున్న యూరోపియన్ పార్లమెంటు ఎన్నికల సందర్భం లో ప్రధాన మంత్రి తన శుభాకాంక్షల ను తెలియ జేశారు.

 

***


(Release ID: 2023260) Visitor Counter : 63