ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చారిత్రికమైనటువంటి విధంగా తిరిగి ఎన్నికైన సందర్భం లో ఆయన కు అభినందనల ను తెలిపిన అధ్యక్షుడు శ్రీ ఇమేనుయెల్మైక్రోన్
‘హొరాయిజన్ 2047’ మార్గసూచీ విషయం లో కలసి పని చేయడాన్ని కొనసాగించే విషయం లో అంగీకారాన్ని తెలిపినఇద్దరు నేతలు
డి-డే యొక్క 80 వ వార్షికోత్సవం సందర్భం లోశుభాకాంక్షలను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
త్వరలో జరుగనున్న పేరిస్ ఒలింపిక్స్ కోసం ప్రధానమంత్రి తన శుభాకాంక్షల ను తెలియ జేశారు
Posted On:
06 JUN 2024 2:23PM by PIB Hyderabad
ఫ్రాన్స్ గణతంత్రం యొక్కఅధ్యక్షుడు శ్రీ ఇమేనుయెల్ మైక్రోన్ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మాట్లాడారు.
ఎన్నికల లో చరిత్రాత్మకమైన విజయాన్ని ప్రధాన మంత్రి సాధించినందుకు గాను అధ్యక్షుడు శ్రీ మేక్రోన్ స్నేహపూర్ణమైన అభినందనల ను తెలియజేయడం తో పాటు వరుసగా మూడో పదవీ కాలానికి గాను ఆయన కు శుభాకాంక్షల ను తెలియ జేశారు.
అధ్యక్షుడు శ్రీ మైక్రోన్ కు కృతజ్ఞత ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. భారతదేశాని కి మరియు ఫ్రాన్స్ కు మధ్య బలమైనటువంటి మరియు విశ్వసనీయమైనటువంటి వ్యూహాత్మక భాగస్వామ్యం రాబోయే సంవత్సరాల లో సరిక్రొత్త శిఖరాల ను చేరుకొంటుందని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
‘హరైజన్ 2047’ మార్గ సూచీ లో ప్రస్తావించిన వాగ్దానాల ను నెరవేర్చే దిశ లో కలసి పని చేయడాన్ని కొనసాగించాలంటూ ఇద్దరు నేతలు సమ్మతి ని వ్యక్తం చేశారు.
డి-డే యొక్క చారిత్రిక 80 వ వార్షికోత్సవం సందర్భం లో అధ్యక్షుడు శ్రీ మైక్రోన్ కు ప్రధాన మంత్రి తన శుభాకాంక్షల ను తెలియజేశారు.
త్వరలో జరుగనున్న పేరిస్ ఒలింపిక్స్ మరియు పైరాలింపిక్ గేమ్స్ కు గాను శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను తెలిపారు.
ఇద్దరు నేతలు ఒకరితో మరొకరు సంప్రదింపులను కొనసాగించుదాం అంటూ వారి యొక్క అంగీకారాన్ని వ్యక్తం చేశారు.
***
(Release ID: 2023175)
Visitor Counter : 78
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam