ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మళ్లీ ఎన్నిక అయినసందర్భం లో ఆయన కు అభినందనల ను తెలిపిన అధ్యక్షుడు శ్రీ బైడెన్


దీనిని ప్రజాస్వామ్యం యొక్క మరియు ప్రజాస్వామికప్రపంచం యొక్క విజయం అని అభివర్ణించిన ప్రధాన మంత్రి

ప్రపంచ హితం కోసం భారతదేశం-యుఎస్ భాగస్వామ్యాన్ని మరింత బలపరచడం కోసం అంగీకారాన్ని వ్యక్తం చేసిన ఇరువురు నేతలు


ఒకరి తో మరొకరు సంప్రదింపుల ను జరుపుకొంటూ ఉండాలనినేతలు సమ్మతించారు

Posted On: 05 JUN 2024 11:17PM by PIB Hyderabad

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యుఎస్ఎ) యొక్క అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ బైడెన్ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మాట్లాడారు.

భారతదేశాని కి ప్రధాన మంత్రి గా చరిత్రాత్మకమైనటువంటి మూడో పర్యాయం తిరిగి ఎన్నిక అయినందుకు గాను ప్రధాన మంత్రి కి స్నేహపూర్ణమైన అభినందనల ను అధ్యక్షుడు శ్రీ బైడెన్ వ్యక్తం చేశారు.

అధ్యక్షుడు శ్రీ బైడెన్ కు ధన్యవాదాల ను ప్రధాన మంత్రి పలుకుతూ, దీనిని ప్రజాస్వామ్యం యొక్క మరియు ప్రజాస్వామిక ప్రపంచం యొక్క గెలుపు గా పేర్కొన్నారు.

ప్రపంచ హితం కోసం భారతదేశం-యుఎస్ విస్తృత ప్రపంచస్థాయి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత గా బలపరచడం కోసం కలసి పని చేయడాన్ని కొనసాగించేందుకు ఇరువురు నేత లు అంగీకరించారు.

ప్రస్తుతం జరుగుతున్న ఐసిసి టి20 క్రికెట్ వరల్డ్ కప్ కు సఫల సహ- ఆతిథేయి గా ఉంటున్నందుకు యుఎస్ కు ప్రధాన మంత్రి తన శుభాకాంక్షల ను తెలియజేశారు.

ఇద్దరు నేత లు ఒకరి తో మరొకరు సంప్రదింపులు జరుపుకొంటూ ఉండాలని సమ్మతి ని వ్యక్తం చేశారు.

 

***



(Release ID: 2023136) Visitor Counter : 48