ఆర్థిక మంత్రిత్వ శాఖ

జూన్ 26, 2024 లోగా సెంట్రల్ ఎక్సైజ్ బిల్లు 2024 ముసాయిదాపై ముందుగా నిర్ణయించిన పద్ధతిలో సూచనలివ్వాల్సిందిగా స్టేక్ హోల్డర్స్ ని కోరిన సీబీఐసీ

Posted On: 04 JUN 2024 2:36PM by PIB Hyderabad

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ), రెవెన్యూ విభాగం, ఆర్థిక మంత్రిత్వ శాఖ, జూన్ 26, 2024 నాటికి సెంట్రల్ ఎక్సైజ్ బిల్లు 2024 ముసాయిదాపై స్టేక్ హోల్డర్ల నుంచి సూచనలను ఆహ్వానిస్తున్నాయి.

సీబీఐసీ సెంట్రల్ ఎక్సైజ్ బిల్లు 2024 ముసాయిదాను సిద్ధం చేసింది. ఈ బిల్లు అమల్లోకి వస్తే ప్రస్తుతమున్న సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ 1944 రద్దవుతుంది. సులభతర వ్యాపార విధానాలను ప్రోత్సహించడంతో పాటు పాత, వ్యర్థ చట్టాలను రద్దు చేసి సమగ్రమైన ఆధునికమైన కేంద్ర ఎక్సైజ్ చట్టాన్ని తీసుకురావడమే ఈ ముసాయిదా ప్రధాన ధ్యేయం. ఈ బిల్లులో 12 చాప్టర్లు, 114 సెక్షన్లు, రెండు షెడ్యూల్లు ఉన్నాయి.

చట్ట రూపకల్పన ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎక్సైజ్ బిల్లు 2024 ముసాయిదాను  సీబీఐసీ వెబ్సైట్లో(https://www.cbic.gov.in) అప్లోడ్ చేయడంతో పాటు స్టేక్ హోల్డర్స్ నుంచి 21 రోజుల్లోగా సూచనలు కింది ఫార్మాట్లో  అందజేయాల్సిందిగా ఆహ్వానించింది.

క్రమసంఖ్య          ముసాయిదా బిల్లులోని క్లాజ్ నెంబర్     క్లాజ్ టైటిల్   సూచించిన మార్పులు ఏమైనా ఉంటే     కారణాలు/వ్యాఖ్యలు/రిమార్కులు

 

ముసాయిదా బిల్లుపై  సూచనలు/వ్యాఖ్యలు పైన తెలిపిన పద్ధతిలో ఎంఎస్ వర్డ్ (లేదా కంపాటబుల్ ఫార్మాట్) లేదా మెషీన్ రీడబుల్ పీడీఎఫ్ ఫార్మాట్లో పంపించాలి.

***



(Release ID: 2022747) Visitor Counter : 123