భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

సుప్రీం కోర్టుఉత్తర్వు ను పాటించడం కోసం సింబల్ లోడింగ్ యూనిట్స్  యొక్క నిర్వహణ మరియు నిలవల కు గాను ఆదేశాన్ని జారీ చేసినఇసిఐ

प्रविष्टि तिथि: 01 MAY 2024 4:18PM by PIB Hyderabad

సంవత్సరం 2023 కు సంబంధించిన రిట్ పిటిశన్ (సివిల్) సంఖ్య 434 లో మాన్య సర్వోన్నత న్యాయస్థానం 2024 ఏప్రిల్ 26 వ తేదీ న ఇచ్చిన తీర్పునకు అనుగుణం గా భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) సింబల్ లోడింగ్ యూనిట్ (ఎస్ఎల్‌యు) ల యొక్క నిర్వహణ కు మరియు నిలవ కు గాను ఒక క్రొత్త ప్రోటోకాల్ ను జారీ చేసింది. ఎస్ఎల్‌యు ల నిర్వహణ మరియు నిలవ లకు గాను క్రొత్త ప్రోటోకాల్స్ ను అమలు పరచడాని కి అవసరమైన మౌలిక సదుపాయాల ను మరియు ఏర్పాటుల ను సిద్ధం చేసుకోవాలి అంటూ సిఇఒ స్ (ముఖ్య కార్యనిర్వహణ అధికారులు) అందరికీ ఆదేశాల ను ఇవ్వడమైంది.

 

మాననీయ సర్వోన్నత న్యాయస్థానం ఆజ్ఞాపించిన ప్రకారం, సవరించిన ప్రోటోకాల్స్ 2024 మే 1 వ తేదీ నాడు గాని, లేదా ఆ తేదీ తరువాత గాని చేపట్టిన వివిపిఎటి లలో సింబల్ లోడింగ్ ప్రక్రియ ను పూర్తి చేయడాని కి సంబంధించిన అన్ని కేసుల లోను వర్తిస్తాయి.

 

ఎస్ఒపి/ఆదేశాల ను ఇక్కడ చూడవచ్చును:

 

https://www.eci.gov.in/eci-backend/public/api/download?

 

 

**

 


(रिलीज़ आईडी: 2019459) आगंतुक पटल : 280
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , हिन्दी , Hindi_MP , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam