సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ఎఫ్‌టిఐఐ యొక్క విద్యార్థి తీసిన చిత్రం - ‘‘సన్‌ఫ్లావర్స్ వర్ ద ఫస్ట్ వన్స్ టు నో’’ 77వ కాన్స్ చలన చిత్రోత్సవాని కి ఎంపికైంది


ఎఫ్‌టిఐఐ లో సంవత్సరాంతం లో చేపట్టే సమన్వయభరిత అభ్యాసంకోసం దర్శకుడు శ్రీ చిదానంద్ నాయక్ మరియు ఆయన ఆధ్వర్యం లోని బృందం రూపొందించినచిత్రాన్ని లా సినెఫ్ లో ప్రదర్శించనున్నారు

Posted On: 24 APR 2024 11:36AM by PIB Hyderabad

ఫిల్మ్ ఎండ్ టెలివిజన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టిఐఐ) లోని విద్యార్థి శ్రీ చిదానంద్ నాయక్ తీసిన చిత్రం ‘‘సన్‌ఫ్లావర్స్ వర్ ఫస్ట్ వన్స్ టు నో’’ ను ఫ్రాన్స్ లోని కాన్స్ లో జరుగనున్న 77 వ చలన చిత్రోత్సవం లోని పోటీ ప్రధానమైన విభాగం లా సినెఫ్ కు ఎంపిక చేయడమైంది. ఈ ఉత్సవం 2024 మే నెల 15 వ తేదీ నుండి అదే నెల 24 వ తేదీ వరకు జరుగనుంది. ‘లా సినెఫ్’ ఈ చిత్రోత్సవం లోని ఒక ఆధికారిక విభాగం గా ఉంది. దీని లక్ష్యమల్లా నూతన ప్రతిభావంతుల ను ప్రోత్సహించడం మరియు ప్రపంచ వ్యాప్తం గా నెలకొన్న చిత్ర పాఠశాలల్లో రూపొందిన చిత్రాల కు గుర్తింపు ను ఇవ్వడమూను .

 

ప్రపంచం అంతటా విస్తరించిన చలన చిత్ర పాఠశాల ల నుండి అందిన మొత్తం 2,263 చిత్రాల లో నుండి ఎంపిక చేసినటువంటి 18 లఘు చిత్రాల (వాటిలో 14 లైవ్ ఏక్శన్ మరియు 4 ఏనిమేటెడ్ ఫిల్మ్ స్ ఉన్నాయి) లో ఈ చిత్రం ఒకటి గా ఉంది. ఇది కాన్స్ లోని లా సినెఫ్విభాగం లో ఎంపిక అయినటువంటి ఒకే ఒక భారతీయ చిత్రం. వచ్చే మే నెల 23 వ తేదీ నాడు బునుయెల్ థియేటర్ లో న్యాయ నిర్ణేతల బృందం అవార్డు విజేతలైన చలన చిత్రాల ప్రదర్శన కంటే ముందుగా ఏర్పాటు అయ్యే ఒక కార్యక్రమం లో లా సినెఫ్బహుమతుల ను ప్రదానం చేయనుంది.

 

‘‘సన్ ఫ్లావర్స్ వర్ ఫస్ట్ వన్స్ టు నో’’ చిత్రం యొక్క ఇతివృత్తం ఏమిటి అంటే అది ఒక వయో వృద్ధ మహిళ పల్లె లోని ఒక కోడిపుంజు ను దొంగిలించడం తో, సముదాయం లో గందరగోళం చెలరేగుతుంది. ఆ కోడిపుంజు ను తిరిగి తీసుకు రావడం కోసం ఒక భవిష్యవాణి ని అనుసరించడం జరుగుతుంది, దీనిలో భఆగం గా వృద్ధురాలి కుటుంబాన్ని ప్రవాసానికి పంపించడం జరుగుతుంది.

 

ఒక సంవత్సరం కాలావధి కలిగినటువంటి టెలివిజన్ పాఠ్య క్రమాన్ని అభ్యసించిన ఎవరైనా ఒక విద్యార్థి రూపొందించిన చిత్రాన్ని ప్రతిష్టాత్మకమైన కాన్స్ చలన చిత్రోత్సవం లో ఎంపిక చేయడం ఇదే మొట్టమొదటి సారి.

 

ఎఫ్‌టిఐఐ లో అనుసరిస్తున్న విశిష్టమైన అధ్యాపన కళ మరియు సినిమా, ఇంకా టెలివిజన్ ల రంగం లో విద్య ను నేర్చుకోవడానికి గాను అభ్యాసం ఆధారిత మైన సహ శిక్షణ దృష్టికోణం పై శ్రద్ధ తీసుకొన్నందుకు ఫలితం గా సంస్థ యొక్క విద్యార్థులు మరియు ఈ సంస్థ యొక్క పూర్వ విద్యార్థులు గత కొన్నేళ్ళు గా జాతీయ మరియు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల లో ప్రశంసల కు పాత్రులు అవుతున్నారు.

 

ఎఫ్‌టిఐఐ యొక్క ఈ చిత్రం టివి విభాగం యొక్క ఏక వార్షిక నిర్మాణం. దీనిలో దర్శకత్వం, ఎలక్ట్రానిక్ సినిమాటోగ్రఫీ, కూర్పు, ఇంకా శబ్దం.. ఈ నాలుగు వేరు వేరు విభాగాల కు చెందిన విద్యార్థులు సంవత్సరం చివర లో సమన్వయభరిత అభ్యాసం లాగా ఒక ప్రాజెక్టు పైన కలసి పనిచేశారు. ఈ చిత్రాని కి దర్శకత్వాన్ని శ్రీ చిదానంద్.ఎస్ నాయక్ వహించగా, ఛాయాగ్రహణ బాధ్యత ను శ్రీ సూరజ్ ఠాకుర్, కూర్పు బాధ్యత ను శ్రీ మనోజ్.వి, శబ్దగ్రహణం బాధ్యత ను శ్రీ అభిషేక్ కదమ్ నిర్వహించారు.



(Release ID: 2018732) Visitor Counter : 97