భారత ఎన్నికల సంఘం

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం


రేపటి నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ప్రారంభం

ఎన్నికల నిర్వహణ కోసం రెండు సంవత్సరాల పాటు జరిగిన కసరత్తు

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు ఇచ్చిన ఎన్నికల సంఘం

మొదటి దశలో 102 లోక్ సభ స్థానాలకు పోలింగ్

ఓటు హక్కు వినియోగించుకోనున్న 16.63 కోట్ల మంది ఓటర్లు

1.87 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు

ఎన్నికల విధుల్లో 18 లక్షల మంది సిబ్బంది.

Posted On: 18 APR 2024 5:13PM by PIB Hyderabad

దేశంలో మొదటి దశ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందిన దేశంలో నాలుగు రాష్ట్రాల్లో మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు రాష్ట్రాల శాసనసభలు, 18 వ లోక్ సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు.ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకుని ఓటు వేసేందుకు వీలుగా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఎన్నికలు స్వేచ్ఛగా ప్రశాంతంగాఅవాంఛనీయ సంఘటనలు లేకుండా చూసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం రెండు సంవత్సరాల కిందట కసరత్తు ప్రారంభించింది. ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేలా చూసేందుకు రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల సంఘం అధికారుల బృందాలు  విస్తృతంగా పర్యటించి అవసరమైన ఏర్పాట్లు రూపకల్పన చేశాయి. విస్త్రుత్వ సంప్రదింపులుచర్చలుక్షేత్రస్థాయి పర్యటనలుసిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను సిద్ధం చేసింది. దీనికోసం దేశవ్యాప్తంగా అనేక సంస్థలుసంఘాలతో ఎన్నికల సంఘం సమావేశాలు నిర్వహించింది. 2024  సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి శ్రీ రాజీవ్ కుమార్కమిషనర్లు శ్రీ జ్ఞానేష్ కుమార్శ్రీ సుఖ్‌బీర్ సింగ్ సంధు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సమీక్ష నిర్వహించారు. మిగిలిన దశల ఎన్నికలు జూన్ 1వ తేదీ వరకు కొనసాగుతాయిసుమారు 97 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. .

 ఓటర్లు విగ్యాతతో వ్యవహరించాలని ఎన్నికల సంఘం పిలుపు ఇచ్చింది. ప్రతి ఒక్క ఓటరు ఇంటి నుంచి బయటకు వచ్చి పోలింగ్ వెళ్లి బాధ్యతతో సగర్వంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం కోరింది. తప్పనిసరిగా ప్రతి ఒక్క ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవాలని దేశవ్యాప్తంగా టెలివిషన్ ద్వారా  ప్రసారం అయిన సందేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి శ్రీ రాజీవ్ కుమార్ కోరారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి శ్రీ రాజీవ్ కుమార్ సందేశాన్ని 

హిందీలో    https://www.youtube.com/watch?v=DDdiNLMWnVk  

ఆంగ్లంలో : https://www.youtube.com/watch?v=CIuuKOPPcHUవినవచ్చు. 

మొదటి దశ పోలింగ్ విశేషాలు:

1.మొదటి దశ  2024 సార్వత్రిక ఎన్నికలు 2024 ఏప్రిల్ 19న జరుగుతాయి. మొదటి దశలో 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో   102 పార్లమెంట్ నియోజకవర్గాలకు (జనరల్-73; ఎస్టీ-11; ఎస్సీ-18) ,  అరుణాచల్ సిక్కిం లో   92 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. మిగిలిన దశలతో పోల్చి చూస్తే మొదటి దశలో అత్యధిక సంఖ్యలో పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. . ఓటింగ్ ఉదయం గంటలకు ప్రారంభమై సాయంత్రం గంటలకు ముగుస్తుంది (పోలింగ్ సమయం  నియోజకవర్గాల   వారీగా మారవచ్చు)

2.  16.63 కోట్ల మంది ఓటర్ల కోసం 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి.  18 లక్షల మంది పోలింగ్ అధికారులు విధులు నిర్వర్తిస్తారు. 

3.  8.4 కోట్ల మంది పురుషులు , 8.23 కోట్ల మంది మహిళలు,11,371 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు.  
4. 35.67 
లక్షల మంది మొదటిసారి  తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.20-29 సంవత్సరాల వయస్సు గల యువ ఓటర్లు 3.51 కోట్ల మంది ఉన్నారు.
5. 1625 మంది అభ్యర్థులు (పురుషులు - 1491; మహిళలు-134) బరిలో ఉన్నారు.
6. 41 హెలికాప్టర్లు, 84 ప్రత్యేక రైళ్లుదాదాపు లక్ష వాహనాల ద్వారా  పోలింగ్భద్రతా సిబ్బందిని తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 

స్వేచ్ఛగా ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు 
7. 
ఎన్నికలు ప్రశాంతంగా స్వేచ్ఛగా  నిర్వహించేందుకు కమిషన్ పలు నిర్ణయాత్మక చర్యలు చేపట్టింది. పోలింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు కేంద్ర బలగాలను పోలింగ్‌ కేంద్రాల వద్ద మోహరించారు.
8. 50% మించి  పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్ చేయడంతోపాటు అన్ని పోలింగ్ స్టేషన్‌లలో మైక్రో అబ్జర్వర్‌లను ఎన్నికల సంఘం  నియమించింది. 
9. 361 
మంది పరిశీలకులు (127 మంది సాధారణ పరిశీలకులు, 67 మంది పోలీసు పరిశీలకులు, 167 మంది వ్యయ పరిశీలకులు) ఇప్పటికే ఎన్నికలకు రోజుల ముందు వారి నియోజకవర్గాలకు చేరుకున్నారు. వారు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి ఎన్నికల సంఘానికి పూర్తి సమగ్ర  సమాచారం అందిస్తారు.  అదనంగాకొన్ని రాష్ట్రాలలో ప్రత్యేక పరిశీలకులను ఎన్నికల సంఘం నియమించింది. 
10. 
అవాంఛనీయ సంఘటనలు లేకుండా చూడడానికిఓటర్లను ప్రలోభ పెట్టె వారిపై చర్యలు తీసుకోవడానికి మొత్తం 4627 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 5208 స్టాటిస్టిక్స్ సర్వైలెన్స్ టీమ్‌లు, 2028 వీడియో సర్వైలెన్స్ టీమ్‌లు ,1255 వీడియో వ్యూయింగ్ టీమ్‌లు  24 గంటలూ నిఘా ఉంచుతాయి. 
11. 
మొత్తం 1374 అంతర్ రాష్ట్రాలు మరియు 162 అంతర్జాతీయ సరిహద్దు చెక్ పోస్ట్‌లు మద్యంమాదకద్రవ్యాలునగదు మరియు ఉచితాల అక్రమ ప్రవాహంపై గట్టి నిఘా ఉంచుతున్నాయి. సముద్రవాయు మార్గాల్లో గట్టి నిఘా ఉంచారు

ఓటర్లకు సౌకర్యాలు,సహకారం 

12. 102 
పార్లమెంట్ నియోజకవర్గాలలో 85 సంవత్సరాల పైబడిన వయస్సు ఉన్న  14.14 లక్షల మంది ఓటర్లు,  13.89 లక్షల పిడబ్ల్యుడి ఓటర్లు ఉన్నారువీరికి వారి ఇళ్ల నుంచి  ఓటు వేసే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది.  ఐచ్ఛిక హోమ్ ఓటింగ్ సదుపాయం ఇప్పటికే అద్భుతమైన ప్రశంసలుప్రతిస్పందనను పొందుతోంది.
13. పోలింగ్ కేంద్రానికి వచ్చి స్వయంగా ఓటు వేయాలని  నిర్ణయించుకున్న 85 సంవత్సరాల పైబడిన వయస్సు ఉన్న ఓటర్లకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తారు. వీరి కోసం ప్రత్యేక సంకేతాలుఓటింగ్ యంత్రాలపై పై బ్రెయిలీ సంకేతాలువాలంటీర్లు మొదలైన అన్ని సౌకర్యాలు కల్పిస్తారు.ఎన్నికల సంఘం  సక్షం యాప్ ద్వారా పిడబ్ల్యుడి ఓటరు  వీల్ చైర్ సౌకర్యాలు కూడా బుక్ చేసుకోవచ్చు.

14. మంచి నీరుషెడ్టాయిలెట్లుర్యాంపులువాలంటీర్లువీల్‌చైర్లు మరియు విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు వృద్ధులువికలాంగులతో సహా ప్రతి ఓటరు సులభంగా ఓటు వేయడానికి సౌకర్యాలు కల్పించారు.  
15. 
స్థానిక ఇతివృత్తంతో  102 పిసిలలో మోడల్ పోలింగ్ స్టేషన్‌లను ఏర్పాటు అయ్యాయి. . 5000 కంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్‌ల వద్ద మహిళా సిబ్బంది  భద్రతవిధులు నిర్వర్తిస్తారు. 1000 పోలింగ్ స్టేషన్‌లలో వికలాంగులు (పిడబ్ల్యుడిలు)విధులు నిర్వహిస్తారు.
16. నమోదైన ఓటర్లందరికీ ఓటరు సమాచార స్లిప్‌లు పంపిణీ చేయబడ్డాయి. ఈ స్లిప్పులు సులభతర చర్యగాఓటు వేయమని కమిషన్ నుంచి ఆహ్వానంగా కూడా పనిచేస్తాయి.
17. ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్ వివరాలను పోలింగ్ తేదీ వివరాలు  https://electoralsearch.eci.gov.in/  లింక్ ద్వారా  చూడవచ్చు. 
18. 
పోలింగ్ కేంద్రంలో  గుర్తింపు ధృవీకరణ కోసం ఓటర్ ఐడి కార్డ్ (EPIC) కాకుండా 12 ప్రత్యామ్నాయ పత్రాలను కూడా కమిషన్ ఆమోదించింది. . ఓటరు ఓటర్ల జాబితాలో నమోదు అయిన వారు  ఏదైనా ఒక పత్రాన్ని చూపించి ఓటు వేయవచ్చు. 
ఓటర్లకు సమాచారం
19. ఓటర్లు తప్పుడు సమాచారంతప్పుడు వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల సంఘం కోరింది.   ముఖ్యంగా సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం అవుతున్నాయి. . అన్ని ప్రశ్నలుస్పష్టీకరణలు మరియు అపోహలు తొలగించడానికి ఎన్నికల సంఘం వాస్తవాలు vs అపోహలు పేరిట ప్రత్యేక రిజిస్టర్ ఏర్పాటు చేసింది.  https://mythvsreality.eci.gov.in/  లో ప్రసంగాలుఅపోహలకు సమాధానం లభిస్తుంది. ఓటర్లు అన్ని అంశాలను ద్రువీకరించుకోవాలని ఎన్నికల సంఘం కోరింది. .

20. కేంద్ర ఎన్నికల సంఘం కెవైసి  యాప్ మరియు అభ్యర్ధి అఫిడవిట్ పోర్టల్ l (https://affidavit.eci.gov.in/ )   ఓటర్ల సమాచారం కోసం పోటీలో ఉన్న అభ్యర్థుల  ఆస్తులుఅప్పులువిద్యా నేపథ్యం నేర చరిత్ర  వంటి అన్ని వివరాలను లభిస్తాయి. 

మీడియా సౌలభ్యం

21.  21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల విధులు నిర్వహించడానికి  దాదాపు 47,000 పాసులను ఎన్నికల సంఘం జారీ చేసింది.  అంతర్జాతీయ మీడియాకు ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పించారు.
22. మీడియాతో పాటు సంబంధిత వర్గాలు ఓటర్ల వివరాలను ఈసీఐ  ఓటర్ టర్నవుట్ యాప్ ద్వారా చూడవచ్చు. ఇది క్రమం తప్పకుండా నవీకరించబడుతుంది.
23. సాధారణ ఎన్నికలు 2024 కి సంబంధించిన అన్ని సంబంధిత సమాచారాన్ని ఒకే చోట అందించడానికి 2024 ఎన్నికల కోసం కమిషన్ place  https://elections24.eci.gov.in/ ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించింది. 

నేపథ్యం: 

24. గత రెండేళ్లలోఎన్నికల సంసిద్ధతను సమీక్షించడానికి ఎన్నికల సంఘం  అనేక రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలను  సందర్శించింది.  రాజకీయ పార్టీలుఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలుఅన్ని జిల్లా అధికారులుడివిజనల్ కమిషనర్లురేంజ్ ఐజీలుసీఎస్/ డీజీపీలు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల  ఇతర సీనియర్ అధికారులతో చర్చలు జరిపింది. 
25. 
గుర్తించిన సమస్యలుఇబ్బందులు పరిష్కరించడానికి  ప్రధాన ఎన్నికల అధికారులు మరియు వారి బృందాలతో అనేక సమావేశాలుసమీక్ష సమావేశాలు జరిగాయి.శాంతి భద్రతల పరిస్థితి,  ఆందోళన కలిగించే నిర్దిష్ట ప్రాంతాలుకేంద్ర సాయుధ పోలీసు బలగాల అవసరాలు లాంటి అంశాలపై ఏర్పాట్లను సమీక్షించడానికి సీనియర్ అధికారుల బృందం వివిధ రాష్ట్రాల్లో పర్యటించింది. 
26. 
సమీక్షలో భాగంగాకేంద్ర  ఎన్నికల సంఘం కూడా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో  ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసి శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించిఅంచనా వేసింది.  చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నిరోధించడంనిర్భందించటంఅంతర్-రాష్ట్ర మరియు అంతర్జాతీయ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసింది. లోక్‌సభరాష్ట్ర శాసనసభలకు 2024 సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛగాన్యాయంగాశాంతియుతంగా నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల  అధికారుల మధ్య సమన్వయం సాధించడానికి ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి.
27. సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు ముందు సార్వత్రిక ఎన్నికల కోసం 2100 మంది సాధారణపోలీసువ్యయ పరిశీలకులకు  కమిషన్ అవగాహన కల్పించింది. 
28. 
ఓటింగ్‌ను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర  ఎన్నికల సంఘం (ECI)  గతంలో తక్కువ పోలింగ్‌ నమోదైన  పార్లమెంటరీ నియోజకవర్గాలపై (PCలు)  2024 సార్వత్రిక ఎన్నికలలో పోలింగ్‌కు ముందు ప్రత్యేక సమీక్ష నిర్వహించింది. 

29. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై మొత్తం ఎన్నికల యంత్రాంగానికి శిక్షణ ఇచ్చారు. అన్ని సూచనలు / మాన్యువల్‌లు / హ్యాండ్‌బుక్‌లు సమగ్రంగా నవీకరించబడ్డాయి ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అన్ని వివరాలు అందుబాటులో ఉన్నాయి.
 

***



(Release ID: 2018211) Visitor Counter : 267