భారత ఎన్నికల సంఘం

లోక్ స‌భ ఎన్నిక‌లు 2024 రెండో ద‌శ‌లో 13 రాష్ర్టాలు/ కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో పోటీ ప‌డుతున్న 1210 మంది అభ్య‌ర్థులు


లోక్ స‌భ ఎన్నిక‌లు 2024 రెండో ద‌శ‌లో 12 రాష్ర్టాలు/ కేంద్ర‌పాలిత ప్రాంతాల్లోని 88 పిసిల్లో 2633 నామినేష‌న్లు దాఖ‌లు

Posted On: 09 APR 2024 11:27AM by PIB Hyderabad

2024 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో రెండో ద‌శ‌లో 12 రాష్ర్టాలు/   కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో 1206 మంది అభ్య‌ర్థులు, ఔట‌ర్ మ‌ణిపూర్ పిసి నుంచి న‌లుగురు అభ్య‌ర్థులు పోటీ ప‌డుతున్నారు. లోక్ స‌భ ఎన్నిక‌లు 2024 రెండో ద‌శ‌లో పోలింగ్ కు వెళ్తున్న‌ 12 రాష్ర్టాలు/   కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు చెందిన 88 పిసిల్లో 2633 నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయి. 12 రాష్ర్టాలు/   కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో జ‌రుగుతున్న రెండో ద‌శ ఎన్నిక‌ల‌కు నామినేష‌న్ల దాఖ‌లుకు తుది గ‌డువు 2024 ఏప్రిల్ 4. మొత్తం 2633 నామినేష‌న్లు దాఖ‌లు కాగా నామినేష‌న్ల ప‌రిశీల‌న అనంత‌రం 1428 నామినేష‌న్లు చెల్లుబాట‌వుతాయ‌ని ప్ర‌క‌టించారు. ఈ 12 రాష్ర్టాలు/   కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో నామినేష‌న్ల ఉపసంహ‌ర‌ణ‌కు తుది గ‌డువు 2024 ఏప్రిల్ 8.

రెండో ద‌శలో కేర‌ళ‌కు చెందిన 20 పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌రిష్ఠంగా 500 నామినేష‌న్లున్నాయి.  14 పిసిల్లో 491 నామినేష‌న్ల‌తో క‌ర్ణాట‌క రెండో స్థానంలో ఉంది. కాగా త్రిపుర‌లోని ఒకే ఒక పిసిలో క‌నిష్ఠంగా 14 నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయి. ఇక మ‌హారాష్ర్ట‌లోని 16-నాందేడ్ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌రిష్ఠంగా 92 నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయి.

రాష్ర్టాలు/  కేంద్ర‌పాలిత ప్రాంతాల వారీగా రెండో ద‌శ  లోక్ స‌భ ఎన్నిక‌లు 2024

 

రాష్ర్టం/  కేంద్ర‌పాలిత ప్రాంతం

పిసిల సంఖ్య‌

అందిన నామినేష‌న్ల సంఖ్య‌

ప‌రిశీల‌న అనంత‌రం అర్హులైన అభ్య‌ర్థులు

నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ అనంత‌రం పోటీలో ఉన్న అభ్య‌ర్థులు

అస్సాం

5

118

62

61

బిహార్‌

5

146

55

50

చ‌త్తీస్ గ‌ఢ్‌

3

95

46

41

జ‌మ్ము క‌శ్మీర్‌

1

37

23

22

క‌ర్ణాట‌క‌

14

491

300

247

కేర‌ళ‌

20

500

204

194

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌

7

157

93

88

మ‌హారాష్ర్ట‌

8

477

299

204

రాజ‌స్తాన్

13

304

191

152

త్రిపుర‌

1

14

14

9

ఉత్త‌ర ప్ర‌దేశ్‌

8

226

94

91

ప‌శ్చిమ బెంగాల్‌

3

68

47

47

మొత్తం

88

2633

1428

1206

 

ఔట‌ర్ మ‌ణిపూర్ పిసిలో 15 ఎసిల్లో 19.04.2024న (తొలి ద‌శ‌), ఇదే పిసిలో 13 ఎసిల్లో 26.04.2024న (రెండో ద‌శ‌) పోలింగ్ జ‌రుగ‌నుంది.  ఈ ఔట‌ర్ మ‌ణిపూర్ పిసి నుంచి న‌లుగురు అభ్య‌ర్థులు పోటీ ప‌డుతున్నారు. 2024 ఏప్రిల్ 5వ తేదీన ఇందుకు సంబంధించి గెజిట్ నోటిఫికేష‌న్ వెలువ‌డింది. స్థూలంగా తొలి ద‌శ‌లో 21 రాష్ర్టాలు/  కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో 1625 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. వారిలో 1491 మంది పురుషులు కాగా 134 మంది మ‌హిళా అభ్య‌ర్థులున్నారు. 

 

****



(Release ID: 2017932) Visitor Counter : 75