భారత ఎన్నికల సంఘం
2024 సార్వత్రిక ఎన్నికలలో తప్పుడు సమాచారాన్ని ముందస్తుగా ఎదుర్కోవడానికి ఈ సి ఐ 'అవాస్తవము - నిజం ' (మిత్ వర్సెస్ రియాలిటీ) రిజిస్టర్'ని పరిచయం చేసింది
ఒక బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా సులభంగా చూడగల ఫార్మాట్‌లో విశ్వసనీయమైన మరియు ప్రామాణీకరించబడిన ఎన్నికల సంబంధిత సమాచారం కోసం ఏకీకృత ప్లాట్‌ఫారమ్
Posted On:
02 APR 2024 5:42PM by PIB Hyderabad
తప్పుడు సమాచారం వ్యాప్తిని నిరోధించడానికి మరియు ఎన్నికల ప్రక్రియ యొక్క సమగ్రతను నిలబెట్టడానికి, భారత ఎన్నికల సంఘం (ఈ సి ఐ) జరుగనున్న సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా 'మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్'ని ఈరోజు ప్రారంభించింది. దీనిని ఈ రోజు న్యూఢిల్లీలోని నిర్వాచన్ సదన్‌లో ఎన్నికల కమిషనర్లు శ్రీ జ్ఞానేష్ కుమార్ మరియు శ్రీ సుఖ్‌బీర్ సింగ్ సంధుతో కలిసి ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్ ప్రారంభించారు. 'మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్' ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్‌సైట్ (https://mythvsreality.eci.gov.in/) ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటుంది. తాజా నిర్ధారణ అయిన అబద్దపు పుకార్లు మరియు తాజా తరచూ అడిగే ప్రశ్నలను చేర్చడానికి రిజిస్టర్ నిరంతరంగా అప్‌డేట్ చేయబడుతుంది. 'మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్' పరిచయం ఎన్నికల ప్రక్రియను తప్పుడు సమాచారం నుండి రక్షించడానికి ఈ సి ఐ యొక్క కొనసాగుతున్న ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్ 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటనపై విలేకరుల సమావేశంలో ఎన్నికల సమగ్రత కోసం డబ్బు, కండ, గుండా బలం మరియు ఎం సి సి ఉల్లంఘనలతో పాటు తప్పుడు సమాచారాన్ని ఒక సవాలుగా గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రజాస్వామ్య దేశాల్లో తప్పుడు సమాచారం మరియు తప్పుడు కథనాలు పెరుగుతున్న ఆందోళనతో, ఈ సి ఐ ద్వారా ఈ వినూత్నమైన మరియు చురుకైన చొరవ ఓటర్లు ఎన్నికల ప్రక్రియ అంతటా ఖచ్చితమైన మరియు ధృవీకరించబడిన సమాచారాన్ని పొందేలా చేసే ప్రయత్నం.
'మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్' అనేది ఎన్నికల సమయంలో చెలామణి అవుతున్న అపోహలు, పుకార్లు మరియు అబద్ధాలను తొలగించడానికి, తద్వారా సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకునేలా ఓటర్లకు అధికారాన్ని అందించడానికి వాస్తవ సమాచారం యొక్క సమగ్ర భాండాగారంగా పనిచేస్తుంది. ఇది ఈ వీ ఎం లు/ వీ వీ పాట్లు, ఎలక్టోరల్ రోల్/ఓటర్ సేవలు , ఎన్నికల ప్రవర్తన మరియు ఇతరులకు సంబంధించిన అపోహలు మరియు తప్పుడు సమాచారాన్ని విస్తృతంగా కవర్ చేసే వినియోగదారు స్నేహపూర్వక నమూనాలో రూపొందించబడింది. ఈ రిజిస్టర్ ఎన్నికలకు సంబంధించిన ఇప్పటికే ఛేదించిన నకిలీ సమాచారం, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తిరుగుతున్న అపోహలు, ముఖ్యమైన అంశాలపై తరచుగా అడిగే ప్రశ్నలు మరియు వాటాదారులందరి కోసం వివిధ విభాగాల క్రింద రిఫరెన్స్ మెటీరియల్‌లను అందిస్తుంది. రిజిస్టర్ క్రమం తప్పకుండా నవీకరించబడుతుంది.
మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్‌లో అందించిన సమాచారంతో ఏదైనా ఛానెల్ ద్వారా తమకు అందిన సందేహాస్పద సమాచారాన్ని నిర్దారించుకోవడానికి మరియు ధృవీకరించడానికి వాటాదారులందరూ ప్రోత్సహించబడ్డారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో సమాచారాన్ని ధృవీకరించడానికి, తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి, అపోహలను తొలగించడానికి మరియు కీలక సమస్యల గురించి తెలియజేయడానికి ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించవచ్చు. రిజిస్టర్ నుండి సమాచారాన్ని వినియోగదారులు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా పంచుకోవచ్చు.
***
(Release ID: 2017924)
Visitor Counter : 179
Read this release in:
Marathi
,
Malayalam
,
Bengali
,
Odia
,
English
,
Gujarati
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Kannada