భారత ఎన్నికల సంఘం

2024 ఏప్రిల్ 12న లోక్‌సభ 2024 సార్వత్రిక ఎన్నికల 3వ దశ గెజిట్ నోటిఫికేషన్ విడుదల


2024 మే 7న 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో 94 పార్లమెంటరీ నియోజకవర్గాలు, మధ్యప్రదేశ్‌లో వాయిదా పడిన 29-బెతుల్ పీసీలో పోలింగ్

3వ దశలో ఎన్నికలు జరగనున్న మొత్తం 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో నామినేషన్ల దాఖలు చేయడానికి ఆఖరి తేదీ 2024 ఏప్రిల్ 19

Posted On: 11 APR 2024 2:04PM by PIB Hyderabad

2024 సార్వత్రిక ఎన్నికల మూడో దశ నామినేషన్ల ప్రక్రియ  రేపటి నుంచి ప్రారంభం కానున్నది. 3వ దశలో 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న 94 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఎన్నికల నిర్వహణ కోసం  గెజిట్ నోటిఫికేషన్ రేపు అంటే 12.04.2024 న విడుదల అవుతుంది. ఈ ఎన్నికలతో పాటు  మధ్యప్రదేశ్‌లోని 29-బేతుల్ (ఎస్‌టి) పిసిలో వాయిదా పడిన ఎన్నికల నిర్వహణ కోసం  నోటిఫికేషన్ కూడా రేపు జారీ అవుతుంది. 

మధ్యప్రదేశ్‌లోని 29-బెతుల్ (ఎస్‌టి) పార్లమెంటరీ నియోజకవర్గం  లో వాయిదా వేసిన పోలింగ్‌తో పాటు ఈ 94 పార్లమెంటరీ నియోజకవర్గాలలో  పోలింగ్ 07.05.2024న జరుగుతుంది. మధ్యప్రదేశ్‌లోని 29-బేతుల్ (ఎస్‌టి) పార్లమెంటరీ నియోజకవర్గానికి 2వ దశలో పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే, పోటీ చేస్తున్న బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన పోటీ అభ్యర్థి మరణించడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి.

3వ దశలో  అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, గోవా, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్.లలో ఎన్నికలు జరుగుతాయి. 

3వ దశ ఎన్నికల షెడ్యూల్ :

 

***



(Release ID: 2017761) Visitor Counter : 91