భారత ఎన్నికల సంఘం
ఈ సీ ఐ రెండవ దశ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత రేపు సాధారణ ఎన్నికల రెండవ దశ నామినేషన్ల దాఖలు ప్రారంభమవుతుంది
ఈ దశలో 12 రాష్ట్రాలు/యూటీలలోని 88 పార్లమెంటరీ నియోజకవర్గాలతో పాటు ఒక భాగం పీ సీ (ఔటర్ మణిపూర్) ఏప్రిల్ 26, 2024న ఎన్నికలు జరగనున్నాయి.
మొత్తం 12 రాష్ట్రాలు/యూటీలకు 2వ దశ నామినేషన్ల చివరి తేదీ ఏప్రిల్ 4 2024
జే & కే కాకుండా మిగతా అన్ని 11 రాష్ట్రాలు/యూ టీ లకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన తేదీ ఏప్రిల్ 5, 2024; జే & కే నామినేషన్ల పరిశీలన తేదీ ఏప్రిల్ 6, 2024
Posted On:
27 MAR 2024 2:30PM by PIB Hyderabad
2024 సార్వత్రిక ఎన్నికల రెండవ దశ నామినేషన్లు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. 2024 లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలలో ఎన్నికలు జరగబోయే 12 రాష్ట్రాలు/యూటీలలోని 88 పార్లమెంటరీ నియోజకవర్గాల (పీ సీ లు) గెజిట్ నోటిఫికేషన్ 28.03.2024న విడుదల చేయబడుతుంది. రెండవ దశలో మణిపూర్ (ఔటర్ మణిపూర్)లో ఒక భాగమైన పీసీ తో పాటు ఈ 88 పీసీలలో పోలింగ్ 26.04.2024న జరుగుతుంది. ఔటర్ మణిపూర్ పీసీలో ఎన్నికల నోటిఫికేషన్ తొలి దశ కోసం జారీ చేయబడిన గెజిట్ నోటిఫికేషన్‌లో చేర్చబడింది. ఔటర్ మణిపూర్ పీసీ లోని 15 ఏ సీ లలో 19.04.2024 (ఫేజ్ 1)న ఎన్నికలకు జరగనున్నాయి మరియు ఈ పీసీ లోని 13 ఏ సీ లకురెండవ దశ పోలింగ్ 26.04.2018న జరుగుతుంది.
రెండవ దశ లో చేర్చబడిన రాష్ట్రాలు/ యూ టీ లు అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, జమ్మూ & కాశ్మీర్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్ & పశ్చిమ బెంగాల్, మణిపూర్‌లోని ఒక భాగం పీ సీ కాకుండా (ఔటర్ మణిపూర్)
రెండవ దశ షెడ్యూల్ క్రింద ఇవ్వబడింది
***
(Release ID: 2016555)
Visitor Counter : 153
Read this release in:
Gujarati
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam